Wednesday, December 17, 2014

కంటి చూపు చెపుతోంది

చిత్రం :  జీవిత చక్రం (1971)
సంగీతం :  శంకర్ జైకిషన్
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం : శారద



పల్లవి :


కంటిచూపు చెపుతోంది.. కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట.. ఓ రాజా
కంటిచూపు చెపుతోంది..  కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట.. ఓ రాజా


ఆశలూ.. దాచకూ... ఆశలూ.. దాచకూ


కంటి చూపు చెపుతోంది.. కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట.. ఓ రాజా
ఓ.....  రాజా



చరణం 1 :



ఆడపిల్లా పూల తీగె.. ఒక్కలాగె చక్కనైనవి
ఆడపిల్లా పూల తీగె.. ఒక్కలాగె చక్కనైనవి
ఆడపిల్లా.. పూలతీగే ఒక్కలాగే..  అండ కోరుకుంటాయి.. ఓ.. 


అందమైన జవరాలు పొందుకోరి వచ్చింది ఎందుకలా చూస్తావు.. ఓ రాజా?
స్నేహమూ చేయవా?.. స్నేహమూ చేయవా?.. 


కంటి చూపు చెపుతోంది.. కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట.. ఓ రాజా
ఓ.....  రాజా



చరణం 2 :


కొమ్మమీద గోరువంక రామచిలుక జోడు కూడె
కొమ్మమీద గోరువంక రామచిలుక జోడు కూడె
కొమ్మమీద గోరువంక రామచిలుక ముద్దుపెట్టుకున్నాయి.. ఓయ్


మెత్తనైన మనసు నాది కొత్త చిగురు వేసింది
మత్తులోన మునిగింది.. ఓ రాజా..
మైకమూ పెంచుకో.. మైకమూ పెంచుకో


కంటి చూపు చెపుతోంది.. కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట.. ఓ రాజా
ఓ.....  రాజా




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=231

No comments:

Post a Comment