Monday, December 29, 2014

మనిషిలోని మనసు చూడు

చిత్రం :  మా దైవం (1976)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  
ఆరుద్ర

నేపధ్య గానం :  సుశీల



పల్లవి :



మనిషిలోని మనసు చూడు.. ఆ మనసులోన వుంటుంది మంచి చూడు
మంచితనం ఎంచుతూ మమకారం పెంచుతూ అందరికి ఆనందం పంచి చూడు


తక తక తై తై తక తక తై తై తక తక తై తై  . . తై తై
చక చక పనిచెయ్‌ చక చక పనిచెయ్‌ చక చక పనిచెయ్‌ . . చెయ్‌ చెయ్‌


తక తక తై తై తక తక తై తై తక తక తై తై  . . తై తై
చక చక పనిచెయ్‌ చక చక పనిచెయ్‌ చక చక పనిచెయ్‌ . . చెయ్‌ చెయ్‌




చరణం 1 :


ఎటువంటి మొరకైనా చదునౌను.. ఆ చదునైన మాగాణి పదునౌను

ఎటువంటి మొరకైనా చదునౌను.. ఆ చదునైన మాగాణి పదునౌను

ప్రతిచేను పండాలి పచ్చపచ్చగా..ప్రతిచేను పండాలి పచ్చపచ్చగా.. ప్రతిగుండె మారాలి మెత్తమెత్తగా 



మనిషిలోని మనసు చూడు.. ఆ మనసులోన వుంటుంది మంచి చూడు
మంచితనం ఎంచుతూ మమకారం పెంచుతూ.. అందరికి ఆనందం పంచి చూడు



చరణం 2 :


చోటీయకుంటే వంచనకు ఇక.. పనిలేదులే ముళ్ళ కంచెలకు
చెప్పేస్తే పోతుంది చేసిన పాపం.. తప్పులకు ఎంచకున్న ఎంతో పుణ్యం   

 
మనిషిలోని మనసు చూడు.. ఆ మనసులోన వుంటుంది మంచి చూడు
మంచితనం ఎంచుతూ మమకారం పెంచుతూ..  అందరికి ఆనందం పంచి చూడు



తక తక తై తై తక తక తై తై తక తక తై తై  . . తై తై
చక చక పనిచెయ్‌ చక చక పనిచెయ్‌ చక చక పనిచెయ్‌ . . చెయ్‌ చెయ్‌


తక తక తై తై తక తక తై తై తక తక తై తై  . . తై తై తై
చక చక పనిచెయ్‌ చక చక పనిచెయ్‌ చక చక పనిచెయ్‌ . . చెయ్‌ చెయ్‌ చెయ్‌





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=18105

No comments:

Post a Comment