Thursday, December 11, 2014

కలసి పాడుదాం

చిత్రం :  బలిపీఠం (1975)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపధ్య గానం :  బాలు

పల్లవి :

కలసి పాడుదాం తెలుగు పాట.. కదలి సాగుదాం వెలుగుబాట
తెలుగువారు నవజీవన నిర్మాతలనీ.. తెలుగుజాతి సకలావనికే జ్యోతియనీ
కలసి పాడుదాం తెలుగు పాట.. కదలి సాగుదాం వెలుగుబాట

చరణం 1 :

కార్యశూరుడు వీరేశలింగం  కలంపట్టి పోరాడిన సింగం
దురాచారాల దురాగతాలను తుదముట్టి౦చిన అగ్నితరంగం
అడుగో.. అతడే.. వీరేశలింగం     

మగవాడెంతటి ముసలాడైనా మళ్ళీ పెళ్ళికి అర్హత వుంటే
బ్రతుకే తెలియని బాల  వితంతువుకెందుకు లేదా హక్క౦టాను 

చేతికి గాజులు తొడిగాడు చెదిరిన తిలకం దిద్దాడు.....
మోడు వారిన ఆడబ్రతుకుల పసుపూ కుంకుమ నిలిపాడు.. నిలిపాడు
కలసి పాడుదాం తెలుగు పాట...  కదలి సాగుదాం వెలుగుబాట

చరణం 2 :

అడుగో.. అతడే.. గురజాడ
మంచిచెడ్డలు లోకమ౦దున ఎంచి చూడగా రెండే కులములు
మంచిచెడ్డలు లోకమ౦దున ఎంచి చూడగా రెండే కులములు
మంచియన్నది మాలయైతే... మాల నేనౌతాను.. మాల నేనౌతాను అన్నాడు.....

కలసి పాడుదాం తెలుగు పాట.. కదలి సాగుదాం వెలుగుబాట
తెలుగువారు నవజీవన నిర్మాతలనీ...  తెలుగుజాతి సకలావనికే జ్యోతియనీ
కలసి పాడుదాం తెలుగు పాట... కదలి సాగుదాం వెలుగుబాట 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2030

No comments:

Post a Comment