Monday, December 15, 2014

పాపలు మంచికి రూపాలు

చిత్రం :  దేవుడమ్మ (1973)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  రాజశ్రీ
నేపధ్య గానం :  సుశీల, బాలు
 
పల్లవి :

పాపలు మంచికి రూపాలు దేవుడి గుడిలో దీపాలు
పాపలు మంచికి రూపాలు దేవుడి గుడిలో దీపాలు.. దీపాలు.. దీపాలు

మచ్చలేని మాణిక్యాలు ముచ్చటైన అరవిందాలు
మచ్చలేని మాణిక్యాలు ముచ్చటైన అరవిందాలు
కరుణకు ప్రతిబింబాలు కనిపించే దేవతలు

పాపలు మంచికి రూపాలు దేవుడి గుడిలో దీపాలు.. దీపాలు.. దీపాలు
తాంతతై తైత తాతై దిగిత తాంతతై తైత తాతై దిగిత 

చరణం 1 :

అభం శుభం తెలియనివారు కల్లకపటం ఎరుగని వారు

అసత్యాలు ఆడనివారు అరమరికలు లేనివారు
చిలకలవలె పలికేవారు చిరునవ్వుల పసివారు

పాపలు మంచికి రూపాలు దేవుడి గుడిలో దీపాలు
పాపలు మంచికి రూపాలు దేవుడి గుడిలో దీపాలు.. దీపాలు.. దీపాలు
తాంతతై తైత తాతై దిగిత తాంతతై తైత తాతై దిగిత
 
చరణం 2 :  

చిన్ని చిన్ని పాపలు నేడు రేపు దేశ పౌరులు మీరు

కాని పనులు చేయరాదు నీతిబాట వీడరాదు
మన దేశం గర్వించేలా మంచి పేరు సాదించాలి

పాపలు మంచికి రూపాలు దేవుడి గుడిలో దీపాలు
పాపలు మంచికి రూపాలు దేవుడి గుడిలో దీపాలు.. దీపాలు.. దీపాలు

1 comment:

  1. What a super song! Should be played on children's day and all children birthdays.

    ReplyDelete