Monday, January 19, 2015

ఎరుగని సుఖమే ఎదురుగ నిలిచింది

చిత్రం :  యవ్వనం కాటేసింది (1976)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  దాసరి
నేపధ్య గానం :   సుశీల



పల్లవి :


ఎరుగని సుఖమే ఎదురుగ నిలిచింది.. ఏదో కోరిక ఎదలో రగిలింది
ఎరుగని సుఖమే ఎదురుగ నిలిచింది.. ఏదో కోరిక ఎదలో రగిలింది 


లాలలా లలాలలా.. లాలలా లలాలలా
ఎరుగని సుఖమే ఎదురుగ నిలిచింది.. ఏదో కోరిక ఎదలో రగిలింది


చరణం 1 :


పరుగులు తీసే నాలో వెచ్చదనం.. పొంగే కడలిలా ఉరికే యవ్వనం
అమ్మమ్మా అమ్మమ్మా.. నాలో రేపెను పరవశం
పడుచుదనానికి పానుపువేసింది.. వలపుల పాటకు పల్లవి పాడింది    

           
ఎరుగని సుఖమే ఎదురుగ నిలిచింది.. ఏదో కోరిక ఎదలో రగిలింది



చరణం 2 : 


ప్రతి చిరుగాలి పలికే వేణువుగా.. జతగా ఎవరో నడిపారు నీడగా
అమ్మమ్మా అమ్మమ్మా.. ఈ జగమే తోచెను వింతగా


ఏ సడి విన్నా ఏదో పులకింత.. కన్నెతనానికి కమ్మని గిలిగింత
లాలలా లలాలలా.. లాలలా లలాలలా




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5306

No comments:

Post a Comment