Thursday, July 23, 2015

వయసు ఉరకలు వేస్తుంటే

చిత్రం  :  మొనగాడు (1976)
సంగీతం  :  కె.వి. మహదేవన్
గీతరచయిత  :  ఆత్రేయ
నేపధ్య గానం  : బాలు, సుశీల 

పల్లవి :

వయసు ఉరకలు వేస్తుంటే.. సొగసు పొంగులు వస్తుంటే
మనసు హద్దులు పెడుతుంటే.. మధ్యన నలిగీ పోతుంటే
ఏమి చేద్దాం.. ఏమి చేద్దాం.. ఎంతకాలం ఆపుకొందాం

వయసు ఉరకలు వేస్తుంటే... మనసు హద్దులు పెడుతుంటే

చరణం 1 :

పువ్వు పువ్వు కవ్విస్తుంటే.. పులకింతలు రప్పిస్తుంటే
నిండు పున్నమి వెన్నెలైనా.. నిప్పులాగా అనిపిస్తుంటే

చరణం 2 :

చల్లగాలులు వీస్తుంటే.. జివ్వుజివ్వున చలివేస్తుంటే

నిన్ను చూస్తూ నన్ను నేనే కౌగిలించుక గడపాలంటే
నిన్ను చూస్తూ నన్ను నేనే కౌగిలించుక గడపాలంటే

ఏమి చేద్దాం.. ఏమి చేద్దాం.. ఎంతకాలం ఆపుకొందాం

వయసు ఉరకలు వేస్తుంటే.. సొగసు పొంగులు వస్తుంటే

చరణం 3 :

కళ్ళు నాలుగు కలిపేస్తుంటే.. కన్నెతనము జడిపిస్తుంటే

అదురుతున్న పెదవులు నిన్నే.. హత్తుకొమ్మని అందిస్తుంటే

అదురుతున్న పెదవులు నిన్నే.. హత్తుకొమ్మని అందిస్తుంటే

ఏమి చేద్దాం.. ఏమి చేద్దాం.. ఎంతకాలం ఆపుకొందాం

వయసు ఉరకలు వేస్తుంటే.. సొగసు పొంగులు వస్తుంటే
మనసు హద్దులు పెడుతుంటే.. మధ్యన నలిగీ పోతుంటే
ఏమి చేద్దాం.. ఏమి చేద్దాం.. ఎంతకాలం ఆపుకొందాం

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2406

No comments:

Post a Comment