Wednesday, July 22, 2015

పారే గోదావరిలా పరుగెత్తేదే వయసు

చిత్రం  :  రాధమ్మ పెళ్ళి (1974)
సంగీతం  :  రమేశ్ నాయుడు
గీతరచయిత  :  సినారె
నేపధ్య గానం  : జానకి


పల్లవి :

ఆ... ఆ... ఆ.. ఆ...ఆ.. అ
పారే గోదావరిలా పరుగెత్తేదే వయసు
 పొడిచే తొలిపొద్దులా పొరలు లేనిదే మనసు
పారే గోదావరిలా పరుగెత్తేదే వయసు
ఆ... ఆ... ఆ.. ఆ...ఆ.. అ


చరణం 1 :


గుండెలో సుడిగుండాలున్నా..  నిండుగ నవ్వును ఏరు
పక్కలోన బురదవున్నా.. పచ్చగ నవ్వును పైరు


గుండెలో సుడిగుండాలున్నా.. నిండుగ నవ్వును ఏరు
ఏ వెతలున్నా..  ఏదేమైనా..
అలా అలా.. కిలా కిలా..నవ్వేదే జీవితం.. నవ్వేదే జీవితం 



పారే గోదావరిలా పరుగెత్తేదే వయసు
పొడిచే తొలిపొద్దులా పొరలు లేనిదే మనసు
పారే గోదావరిలా పరుగెత్తేదే వయసు



చరణం 2 :

వేటకాడు పొంచుంటాడనీ.. గూటిలో గువ్వ దాగదు
గొడ్డలి వేటు పడుతుందనీ.. కొమ్మ ఎదగడం ఆగదు


వేటకాడు పొంచుంటాడనీ.. గూటిలో గువ్వ దాగదు
ఎవరేమన్నా.. ఎదురేమన్నా
అలా అలా.. గలా గలా.. సాగేదే జీవితం.. సాగేదే జీవితం 

పారే గోదావరిలా పరుగెత్తేదే వయసు
పొడిచే తొలిపొద్దులా పొరలు లేనిదే మనసు


పారే గోదావరిలా పరుగెత్తేదే వయసు
ఆ... ఆ... ఆ.. ఆ...ఆ.. అ




http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3076

No comments:

Post a Comment