Wednesday, September 2, 2015

ఉడతా ఉడతా హూత్

చిత్రం :  జీవనతరంగాలు (1973)
సంగీతం :  జె.వి. రాఘవులు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  ఘంటసాల





పల్లవి : 


ఉడతా ఉడతా హూత్.. ఎక్కడికెళతావ్ హూత్
కొమ్మ మీది జంపండు కోసుకొస్తావా.. మా  బేబీకిస్తావా ?
ఉడతా ఉడతా హూత్.. ఎక్కడికెళతావ్ హూత్
కొమ్మ మీది జంపండు కోసుకొస్తావా.. మా  బేబీకిస్తావా ?  
  



చరణం 1 :


చిలకమ్మా.. ఓ చిలకమ్మా.. చెప్పేది కాస్తా  వినవమ్మా
చిలకమ్మా.. ఓ చిలకమ్మా.. చెప్పేది కాస్తా  వినవమ్మా
నీ పంచదార పలుకులన్నీ.. బేబీకిస్తావా.. మా బేబీకిస్తావా? 


ఉడతా ఉడతా హూత్... ఎక్కడికెళతావ్ హూత్
ఉడతా ఉడతా హూత్... ఎక్కడికెళతావ్ హూత్   




చరణం 2 :


ఉరకలేసే ఓ జింకా.. పరుగులాపవె నీవింకా
ఉరకలేసే ఓ జింకా.. పరుగులాపవె నీవింకా
నువు నేర్చుకున్న పరుగులన్నీ..
నువు నేర్చుకున్న పరుగులన్నీ.. బేబీకిస్తావా.. మా బేబీకిస్తావా ?   


ఉడతా ఉడతా హూత్... ఎక్కడికెళతావ్ హూత్
ఉడతా ఉడతా హూత్... ఎక్కడికెళతావ్ హూత్ 




చరణం 3 :



చిలకల్లారా.. కోకిలలారా... చెంగున దూకే జింకల్లారా
చిలకల్లారా.. కోకిలలారా... చెంగున దూకే జింకల్లారా
చిన్నరి పాపల ముందు.. మా చిన్నరి పాపలముందు
మీరెంత? మీ జోరేంత?..  మీరెంత? మీ జోరేంత?  
 

ఉడతా ఉడతా హూత్... ఎక్కడికెళతావ్ హూత్
ఉడతా ఉడతా హూత్... ఎక్కడికెళతావ్ హూత్  





No comments:

Post a Comment