Thursday, October 8, 2015

మానవుడే మహనీయుడు

చిత్రం: బాలభారతము (1972)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: ఘంటసాల 



పల్లవి :


మానవుడే మహనీయుడు.. మానవుడే మహనీయుడూ
శక్తి యుతుడు.. యుక్తి పరుడు.. మానవుడే మాననీయుడూ

మంచిని తలపెట్టినచో మనిషి కడ్డులేదులే
ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే

మానవుడే మహనీయుడు.. మానవుడే మహనీయుడూ 



చరణం 1 :



దివిజ గంగ భువి దిపిన భగీరథుడు మానవుడే
సుస్థిర తారగమారిన ద్రువుడు కూడ మానవుడే
సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే
జీవకోటి సర్వములో శ్రేష్టతముడు మానవుడే 

మానవుడే మహనీయుడు.. మానవుడే మహనీయుడూ 





చరణం 2 :



గ్రహరాశుల నధిగమించి.. ఘనతారల పథము నుంచి
గ్రహరాశుల నధిగమించి.. ఘనతారల పథము నుంచి 

గగనాంతర రోదసిలో గధర్వగోళ తతుల దాటి
చంద్రలోకమైనా.. దేవేంద్ర లోకమైనా..
చంద్రలోకమైనా.. దేవేంద్ర లోకమైనా
బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే 


మానవుడే మహనీయుడు.. మానవుడే మహనీయుడూ
శక్తి యుతుడు.. యుక్తి పరుడు.. మానవుడే మాననీయుడూ





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7575

No comments:

Post a Comment