Thursday, October 8, 2015

ఆడేనోయి నాగకన్యకా

చిత్రం : బాలభారతము (1972)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : సుశీల



పల్లవి :


ఆడేనోయి నాగకన్యకా.. చూడాలోయి వీరబాలకా


వేడుక నీకు చెసేను.. కోడెనాగు  ఆడి పాడి.. నేడే.. నేడే    



ఆడేనోయి నాగకన్యకా.. చూడాలోయి వీరబాలకా
వేడుక నీకు చెసేను.. కోడెనాగు  ఆడి పాడి..  నేడే.. నేడే 




చరణం 1 :



శిరసున దాల్చేను భూభారం మా ఆదిశేషు 

శిరసున దాల్చేను భూభారం మా ఆదిశేషు  

మురహరికే అమరిన తల్పం.. మురహరికే అమరిన తల్పం
శివునకు మేమే గళమున హారం.. శివునకు మేమే గళమున హారం 


క్షీరాబ్ది చిలికెను మా వాసుకీ  
       

ఆడేనోయి నాగకన్యకా.. చూడాలోయి వీరబాలకా





చరణం 2 :



నరులకు ఆరాధ్య దైవాలే మా నాగజాతి
నరులకు ఆరాధ్య దైవాలే మా నాగజాతి

వరములతో నిరతము బ్రోచి..  వరములతో నిరతము బ్రోచి
గరళమునందే అమృతము నొసగే.. గరళమునందే అమృతము నొసగే 

కామిత దాతలు మా నాగులే     

ఆడేనోయి నాగకన్యకా.. చూడాలోయి వీరబాలకా
వేడుక నీకు చెసేను.. కోడెనాగు  ఆడి పాడి.. నేడే..  నేడే






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7899

No comments:

Post a Comment