Wednesday, October 7, 2015

రొట్టె విరిగి నేతిలో పడ్డాక





చిత్రం :  ఘరానా దొంగ (1980)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల





పల్లవి : 



రొట్టె విరిగి నేతిలో పడ్డాక.. లొట్టలేసుక్కూర్చుంటే ఎట్టాగ
రొట్టె విరిగి నేతిలో పడ్డాక.. లొట్టలేసుక్కూర్చుంటే ఎట్టాగ
అందగత్తె చూస్తుంటే.. అందమంత ఇస్తుంటే..
అర్థ రాత్రి గడిపేది ఎట్టాగ..
అర్థ రాత్రి గడిపేది ఎట్టాగ.. 



రొట్టె విరిగి నేతిలో పడ్డాక.. లొట్టలేసుక్కూర్చుంటే ఎట్టాగ
రొట్టె విరిగి నేతిలో పడ్డాక.. లొట్టలేసుక్కూర్చుంటే ఎట్టాగ
అందమైన ఈడుంటే.. అందగాడు తోడుంటే
చందమామ నిదరోయేదెట్టాగ..
చందమామ నిదరోయేదెట్టాగ.. 




చరణం 1 :


కౌగిట్లో కాలాలు కరగాలని... తప్పెట్లుతాళాలు మ్రోగాలని
వలపుల్ని వాటేసి ఒంటరిగుంటే... చెలి తోడు లేకుంటే ఎట్టాగ
ఎట్టాగ... ఎట్టాగ


ఆ కౌగిళ్లే మన ఇళ్లు కావాలని... మల్లెపొదరిల్లే పడకిళ్లు కావాలని
కలగంటే కాదంటే ఎట్టాగ.. చలి తీరిపోతుంటే ఎట్టాగ
ఎట్టగెట్టేట్టగెట్టాఎట్టగెట్టేట్టగెట్టా ఎట్టాగ 


రొట్టె విరిగి నేతిలో పడ్డాక.. అబ్బా.. లొట్టలేసుక్కూర్చుంటే ఎట్టాగ





చరణం 2 :



వానల్లే నువ్వొచ్చి తడపాలని... వరదల్లే నే పొంగి పోవాలని
చినుకుల్లో ఇల్లేసి వణుకుతు ఉంటే... చెలికాడు రాకుంటే ఎట్టాగ
ఎట్టాగ... ఎట్టాగ


చుక్కల్లో పక్కేసుకోవాలని... రెండు దిక్కుల్ని కలిపేసుకోవాలని
అనుకుంటే తప్పైతే ఎట్టాగ... ఆపలేని పులకింత ఎట్టాగ
ఎట్టగెట్టేట్టగెట్టాఎట్టగెట్టేట్టగెట్టా ఎట్టాగ




రొట్టె విరిగి నేతిలో పడ్డాక.. లొట్టలేసుక్కూర్చుంటే ఎట్టాగ
రొట్టె విరిగి నేతిలో పడ్డాక.. లొట్టలేసుక్కూర్చుంటే ఎట్టాగ
అందగత్తె చూస్తుంటే.. అందమంత ఇస్తుంటే..
అర్థ రాత్రి గడిపేది ఎట్టాగ..
అర్థ రాత్రి గడిపేది ఎట్టాగ.. 




రొట్టె విరిగి నేతిలో పడ్డాక.. లొట్టలేసుక్కూర్చుంటే ఎట్టాగ
రొట్టె విరిగి నేతిలో పడ్డాక.. లొట్టలేసుక్కూర్చుంటే ఎట్టాగ
అందమైన ఈడుంటే.. అందగాడు తోడుంటే
చందమామ నిదరోయేదెట్టాగ..
చందమామ నిదరోయేదెట్టాగ.. 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3757

No comments:

Post a Comment