Wednesday, October 7, 2015

నీవేరా నా మదిలో




చిత్రం: అంతా మన మంచికే (1972)
సంగీతం: సత్యం
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం: భానుమతి




పల్లవి :


నీవేరా నా మదిలో.. నీవేరా నా మదిలో దేవా
తిరుమలవాసా.. ఓ శ్రీనివాసా.. నీ పదదాసిని నేనేరా....            
నీవేరా నా మదిలో.. దేవా తిరుమలవాసా.. ఓ శ్రీనివాసా.. నీ పదదాసిని నేనేరా...
నీవేరా నా మదిలో...  నీవేరా నా మదిలో



చరణం 1 :



ఎంతో మధురం నీ శుభనామం.. జగతికి దీపం నీ దివ్యరూపం
ఎంతో మధురం నీ శుభనామం.. జగతికి దీపం నీ దివ్యరూపం 

ఆశల పూలే  దోసిట నింపి వేచే భాగ్యము నాదే.. 
వేచే భాగ్యము.. నాదేరా....  


నీవేరా నా మదిలో.. నీవేరా నా మదిలో  

గమ ప ప గమ గ గ గమ నీ నీ నీ
ఆ ఆ ఆ ఆ ఆ హా హా ఆ ఆ ఆ ఆ 



చరణం 2 :



నీ మెడలోన కాంతులు చిందే కాంచన హారము కాలేను నేను
నీ మెడలోన కాంతులు చిందే కాంచన హారము కాలేను నేను 

నీ పదములపై వాలిన సుమమై నిలిచే భాగ్యము..
నా నిలిచే భాగ్యము నాదేరా.....  
          

నీవేరా నా మదిలో... నీవేరా నా మదిలో
గమ ప ప గమ గ గ గమ నీ నీ నీ
ఆ ఆ ఆ ఆ ఆ హా హా ఆ ఆ ఆ ఆ 



చరణం 3 :



నా జీవితమే హారతి చేసి.. నీ గుడి వాకిట నిలిచాను స్వామీ
నా జీవతమే హారతి చేసి.. నీ గుడి వాకిట నిలిచాను స్వామీ 

నీ సన్నిథియే నా పెన్నిధిగా  మురిసే భాగ్యము నాదే..
మురిసే భాగ్యము నాదేరా.....  
          


నీవేరా నా మదిలో దేవా.. తిరుమలవాసా.. ఓ శ్రీనివాసా.. నీ పదదాసిని నేనేరా
నీవేరా నా మదిలో...  నీవేరా నా మదిలో





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3097

4 comments:

  1. That background and color. Appearing is so good

    ReplyDelete
  2. Bhanumati garu has a typical and lovely voice.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. అద్భుతమైన ఆలాపన తోడి మధురరాగం..
    భానుమతి రామకృష్ణ గారిని ఎప్పటికీ మరువలేము..

    ReplyDelete