Wednesday, March 9, 2016

శ్రీమతి అని పిలిచేదాకా







చిత్రం : పసుపు పారాణి (1980)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల




పల్లవి :


శ్రీమతి అని పిలిచేదాకా చిన్నదానా.. సిగ్గులన్ని దాచిపెట్టు పిల్లదాన
శ్రీమతి అని పిలిచేదాకా చిన్నదానా.. సిగ్గులన్ని దాచిపెట్టు పిల్లదాన
ఆ పాలబుగ్గలో ఈ పూల మొగ్గలో ముత్యాల ముగ్గులే మెరిసేనులే

శ్రీవారని పిలిచేదాన చినవాడా.. ముద్దులన్ని మూట పెట్టు పిలవాడా
ముద్దులన్ని మూట పెట్టు పిలవాడా


ఆ సన్న నవ్వులో ఏ సన్నజాజులో చలి సంధ్య మోజులై విరిసేనులే
శ్రీమతి అని పిలిచేదాకా చిన్నదానా.. సిగ్గులన్ని దాచిపెట్టు పిల్లదాన
ముద్దులన్ని మూట పెట్టు పిలవాడా



చరణం 1 :


చిలుకంటి చినదాని కులుకెంత చూడనిదే
కునుకేది కంటికి.. కుదురేది చూపుకి
వరదంటి చిన్నవాడి వయసంత చూడనిదే
వలపేది జంటకి.. వరసేది ముద్దుకి
అందాక నా చూపు చుక్క పెట్టుకో..
ఆ పైన పులకింతల సారె పెట్టుకో



శ్రీమతి అని పిలిచేదాకా చిన్నదానా.. సిగ్గులన్ని దాచిపెట్టు పిల్లదాన
సిగ్గులన్ని దాచిపెట్టు పిల్లదాన
శ్రీవారని పిలిచేదాన చినవాడా.. ముద్దులన్ని మూట పెట్టు పిలవాడా
ముద్దులన్ని మూట పెట్టు పిలవాడా


చరణం 2 :


పురి విప్పి నా సొగసు పున్నమై పోతుంటే
తోడేది ఈడుకి .. ఈ తొలకరి వేళకి
వేడెక్కి నా వయసు వేసవై పోతుంటే
నీరేది ఎండకి.. ఒంటరి గుండెకి
అందాక వెన్నెల్లో గొడుగు వేసుకో..
ఆ గొడుగులో జరిగే గొడవ చూసుకో...



శ్రీవారని పిలిచేదాన చినవాడా.. ముద్దులన్ని మూట పెట్టు పిలవాడా
ముద్దులన్ని మూట పెట్టు పిలవాడా
శ్రీమతి అని పిలిచేదాకా చిన్నదానా.. సిగ్గులన్ని దాచిపెట్టు పిల్లదాన
సిగ్గులన్ని దాచిపెట్టు పిల్లదాన



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5435


No comments:

Post a Comment