Thursday, March 17, 2016

తొలి సంజెకు తూరుపు ఎరుపు

చిత్రం: కన్య కుమారి (1977)
సంగీతం: బాలు
గీతరచయిత: వేటూరి
నేపథ్య గానం: బాలు, సుశీల  



పల్లవి : 


తొలి సంజెకు తూరుపు ఎరుపు
మలి సంజెకు పడమర ఎరుపు
తెలియదు నాకు పడమర తూరుపు
తెలిసిందొకటే ఎరుపు.. నా చెలియ పెదవి ఎరుపు



తొలి సంజెకు తూరుపు ఎరుపు
మలి సంజెకు పడమర ఎరుపు 



చరణం 1 :


ఇరు సంధ్యల ఇరుకుల నడుమ.. మరుమల్లెల వలపే మనది
ఇరు పెదవుల ఎరుపుల నడుమ.. చిరునవ్వుల పిలుపే మనది


తొలి సంజెకు తూరుపు ఎరుపు
మలి సంజెకు పడమర ఎరుపు 



చరణం 2 :


సిరివెన్నెలొలుకు  సిగమల్లె తెలుపు
చిరునవ్వులోని మరుమల్లె తెలుపు
తొలిరోజులందు... చెలి మోజులందు... విరజాజులన్ని తెలుపు


అరమూత కనుల నునులేత వలపు
తెర తీసి నాకు తెలుపు
తెనిగించి మనసు తెలుపు



తొలి సంజెకు తూరుపు ఎరుపు
మలి సంజెకు పడమర ఎరుపు 



చరణం 3 :



చెలి కాటుక మబ్బుల వెన్నెల..
తొలి కోరిక మదిలో కోయిల
మన కలయిక సంధ్యారాగం..
ప్రతిరాగం జీవన రాగం




తొలి సంజెకు.. తూరుపు ఎరుపు
మలి సంజెకు.. పడమర ఎరుపు
తెలియదు నాకు పడమర తూరుపు
తెలిసిందొకటే ఎరుపు.. నా చెలియ పెదవి ఎరుపు



తొలి సంజెకు.. తూరుపు ఎరుపు
మలి సంజెకు.. పడమర ఎరుపు 





https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8007

No comments:

Post a Comment