Wednesday, April 20, 2016

ఓ ప్రేమా నా ప్రేమా




చిత్రం : చంటి (1992)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : చిత్ర   





పల్లవి :



ఓ ప్రేమా నా ప్రేమా
దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం
ఓ ప్రేమ నా ప్రేమ ప్రేమిస్తే చావేనా
దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం
రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబంధం
ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా




చరణం 1 :


క్షణమొక యుగముగ గడిపిన బ్రతుకిది తెలుసుకో ప్రియతమా
విరహమె సుఖమని కలయిక కలయని తలచుటే మధురమా
మృతులకు చితులకు ముగియని కధలివి కదలిరా ప్రణయమా
అడుగులు చిలికిన రుధిరవు మడుగుల ఎరుపులే ప్రళయమా


జారిపోయే కాలం చేజారిపోయే యోగం
రగులుతున్న గాయం నేనడగలేను న్యాయం
కరువౌతాను కన్నుల్లో గురుతుంటాను గుండెల్లో



ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా
దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం


రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబంధం
ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా




చరణం 2 :



గిరులను విడిచిన నదులిక వెనకకు తిరుగునా జగమునా
కులమని కడుధని కులమని విలువలు చెరుగునా మనసున
గగనము మెరుపుల నగలను తోడిగితే ఘనతలే పెరుగునా
ఉరుములు వినపడి ఉదయపు వెలుగులు అదురునా చెదురునా


పేదవాళ్ళ ప్రేమా కాటువేసే పామా
స్వాగతాలు అనదా చావుకైనా ప్రేమ
మానై నేను బ్రతుకున్నా మనిషై నేను చస్తున్నా



ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా
దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం


రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబంధం
ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11034

No comments:

Post a Comment