Monday, April 18, 2016

పలికెను నాలో పల్లవిగా





చిత్రం :  అల్లుడు పట్టిన భరతం (1980)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : బాలు, సుశీల 





పల్లవి :


పలికెను నాలో పల్లవిగా...
పలికెను నాలో పల్లవిగా
అరవిరిసే అనురాగం...
అరవిరిసే అనురాగం...
నా పరువాలే పాడగా... ఆ... ఆ.. ఆ..



పలికెను నాలో పల్లవిగా...
పలికెను నాలో పల్లవిగా 




చరణం 1 :



కడలిని కోరి గిరులను దాటి... సెలయేరు దిగిదిగిరాగా
కడలిని కోరి గిరులను దాటి... సెలయేరు దిగిదిగిరాగా


మిన్నుల్లో పూచే వెన్నెల తానే ఈ నేల ముద్దాడి పోదా
నిను నిన్ను చూసి నను నేనే మరచి
నిను నిన్ను చూసి నను నేనే మరచి
నిన్నంటి రాలేదా...
ఆ పరువాలే పాడగా.. ఆ.. ఆ.. ఆ... 



పలికెను నాలో పల్లవిగా...
పలికెను నాలో పల్లవిగా 





చరణం 2 :



మిలమిల మెరిసే జిలిబిలి నవ్వే అలివేణి పెదవికి అందం
మిలమిల మెరిసే జిలిబిలి నవ్వే అలివేణి పెదవికి అందం



జలజల కురిసే తొలకరి జల్లే నింగికి నేలకు బంధం
ఆ అందమేదో... ఆ బంధమేదో...
ఆ అందమేదో  ఆ బంధమేదో ఇరువురి అనుబంధం


ఆ పరువాలే పాడగా.. ఆ.. ఆ.. ఆ... 



పలికెను నాలో పల్లవిగా...
పలికెను నాలో పల్లవిగా
అరవిరిసే అనురాగం...
అరవిరిసే అనురాగం...
నా పరువాలే పాడగా... ఆ... ఆ.. ఆ..



పలికెను నాలో పల్లవిగా...
పలికెను నాలో పల్లవిగా 








No comments:

Post a Comment