Wednesday, April 6, 2016

ఫాలఘాట్ మాధవన్





చిత్రం :  రాధా కళ్యాణం (1981)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :   బాలు, సుశీల 


పల్లవి :



ఫాలఘాట్ మాధవన్.. పాటంటే ధనాధన్ ...
మదరాశి మాధవన్... మాటంటే ఝణాఝన్
నా.. చాన్స్ దొరికితే కానా... ఆ.. ఆ..
మ మ మ మ.. మహదేవన్...



చిటికెయ్యవే చినదానా...  చిందెయ్యవే తందానా
చిటికెయ్యవే చినదానా...  చిందెయ్యవే తందానా
నీ చిటికెల చినుకుల చిత్తుగా తడిసి
పూటకొక్క పాటకట్టి...  పాటతోనె కోటకట్టి..  కోటలోన నిన్నుపెట్టి 

చిటికెయ్యవే చినదానా...  చిందెయ్యవే తందానా 




చరణం 1 :


పనిపమ... రిమపనిపమ.. రిమపని పమ మపమరి రిమరిస రిపమప
మెత్తగా పదమెత్తగా... కుసుమించిన అందెల గుండెలు ఘల్లనా



మపమరి సరిమపమరి నిస రిసమరి  మపనిప మరిరిస సనినిసప
ఆడగా... నడుమాడగా.. జడ వంపు మరో మరుడెత్తిన విల్లనగా


సుస్వర భాస్వర సురుచిర లయఝరిగా... సనిపమ రిసనిపని


హా... చిటికెయ్యవే చినదానా...  చిందెయ్యవే తందానా



చరణం 2 :


కొప్పులోని జాజిపూలు ఘుమఘుమలే మా సరిగమలన్నాయి
గుండెలోని పొంగులేమో గుసగుసలే మా పల్లవులన్నాయి


కొప్పులోని జాజిపూలు ఘుమఘుమలే మా సరిగమలన్నాయి
గుండెలోని పొంగులేమో గుసగుసలే మా పల్లవులన్నాయి


తకధిమి అంటూ ఆడే అడుగులు తామే చరణాలన్నాయి
ఎదలో తీయని కదలికలేమో మృదంగ నాదాలన్నాయి


ఓరి మాధవా... ఆ..
ఓరి మాధవా... నా అణువణువుణ కెరళ గీతాలున్నాయి
కెరళ గీతాలున్నాయి... కెరళ గీతాలున్నాయి


లలలాలల లలలాల... లలలాలల లలలాల
లలలాలల లలలాల.. ఉహుహుహు... ఉహుహు..







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5075

No comments:

Post a Comment