Wednesday, April 13, 2016

ఓ జాబిలీ వెన్నెలా ఆకాశం

చిత్రం : రంగూన్ రౌడి (1979)
సంగీతం :  జె.వి. రాఘవులు
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :   సుశీల



పల్లవి :


ఓ ..జాబిలీ ..వెన్నెలా ఆకాశం ఉన్నదే నీ కోసం
ఎదురు చూసింది నిదుర కాసింది..  కలువ నీ కోసమే..


వెలుగువై రావోయి... వెలుతురే తేవోయి
ఓ ..జాబిలీ ..వెన్నెలా ఆకాశం ఉన్నదే నీ కోసం 


ఝుమ్ ఝుమ్ ఝుమ్... ఝుమ్ ఝుమ్ ఝుమ్... ఝుమ్ ఝుమ్ ఝుమ్



చరణం 1 :


నువ్వు లేక...  నవ్వ లేక... ఎందరున్నా ఎవరు లేక
జంట గాని...  తోడు లేక...  ఒంటిగా నేనుండలేను ..


స్నేహ దీపాలు...
స్నేహ దీపాలు.... వెలగనీ చాలు
చీకటే లేదోయి
వెలుతురే కావోయి... వెలుతురే తేవోయి..


ఓ ..జాబిలీ ..వెన్నెలా ఆకాశం ఉన్నదే నీ కోసం 

ఝుమ్ ఝుమ్ ఝుమ్... ఝుమ్ ఝుమ్ ఝుమ్... ఝుమ్ ఝుమ్ ఝుమ్





చరణం 2 :





గువ్వ లాగా నువ్వు రాగా... గూడు నవ్వే గుండె నవ్వే
వేకువల్లె నీవు రాగా... చీకటంతా చెదిరిపోయే


తుడిచి కన్నీళ్లు....
తుడిచి కన్నీళ్లు... కలసి నూరేళ్ళు
జతగా ఉందామోయి
వెలుగువే నీవోయి .... వెలుతురే కావోయి




ఓ ..జాబిలీ ..వెన్నెలా ఆకాశం ఉన్నదే నీ కోసం 

ఝుమ్ ఝుమ్ ఝుమ్... ఝుమ్ ఝుమ్ ఝుమ్... ఝుమ్ ఝుమ్ ఝుమ్



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4031

No comments:

Post a Comment