Friday, January 20, 2017

ఓ..ఓ..ఓ.. శ్రుతి శ్రుతి శ్రుతి ప్రియశ్రుతి

చిత్రం :  అంకితం (1990)
సంగీతం :  యువరాజ్
గీతరచయిత :  సినారె
నేపధ్యగానం :  బాలు

పల్లవి :

ఓ...ఓ..ఓ...ఓ...
ఓ..ఓ..ఓ.. శ్రుతి.. శ్రుతి.. శ్రుతి.. ప్రియశ్రుతి
స్వరమెత్తి పాడుతా నీకోసం... సరికొత్త రీతిలో నీకోసం

ఇన్నాళ్ళ నీ మౌనగీతం...
ఇన్నాళ్ళ నీ మౌనగీతం... ఇకపైన మన యుగళగీతం

ఓ..ఓ..ఓ.. శ్రుతి.. శ్రుతి.. శ్రుతి.. ప్రియశ్రుతి

చరణం 1 :

గురుదేవుణికి స్వరదక్షిణగా అంకితమిచ్చిన ఆ పాటా
రెక్కలు కట్టి గొంతుగూటిలో నొక్కిపట్టిన నా పాటా

నీ గుండె తీగలో నినదించగా...
నీ గుండె తీగలో నినదించగా... నా గురువు రాగాత్మ దీవించగా

ఓ..ఓ..ఓ.. శ్రుతి శ్రుతి శ్రుతి ప్రియశ్రుతి

చరణం 2 :

ఆడిన మాటకు తాకట్టుపడి మోడులా పడి ఉన్నాను
ఎదుగుతున్న నీ ప్రేమకు లోబటి ఎదురుతెన్నులు చూశాను

ఇక నేను పలికే ప్రతి గీతం...
ఇక నేను పలికే ప్రతి గీతం... ఒక నీకు..నీకే అంకితం

ఓ..ఓ..ఓ.. శ్రుతి శ్రుతి శ్రుతి ప్రియశ్రుతి
స్వరమెత్తి పాడుతా నీకోసం... సరికొత్త రీతిలో నీకోసం
ఇన్నాళ్ళ నీ మౌనగీతం... ఇకపైన మన యుగళగీతం

ఓ..ఓ..ఓ.. శ్రుతి శ్రుతి శ్రుతి ప్రియశ్రుతి

No comments:

Post a Comment