అనురాగం ఆలాపనగా... ప్రతి జన్మకు అది దీవెనగా నే చేసిన బాసల లయలో... శ్రుతి చేసిన వీణల జతగా ఈ సంగమమే మన సరిగమగా... పలికే జీవనరాగంలో కలిసే మనసుల తొలి గీతం... ఎన్నో జన్మల సంగీతం
ఆమని వలపుల కమ్మని కథ... ఏమని తెలుపను ఎదలొ సొద రాగాలేవో నాలో రేగే... వయ్యారాలే ఉయ్యాలూగే కలిసే మనసుల తొలి గీతం... ఎన్నో జన్మల సంగీతం
చరణం 1 :
ఈ తీరని ఆవేదనలే... ఒక తీయని ఆరాధనగా నీ కౌగిలి నా కోవెలగా... నా బ్రతుకే నీ హారతిగా శృంగారంలో సింధురాలే చిలికే సంధ్యా రాగంలో
కలిసే మనసుల తొలి గీతం.... ఎన్నో జన్మల సంగీతం కలిసే మనసుల తొలి గీతం... ఎన్నో జన్మల సంగీతం
No comments:
Post a Comment