Showing posts with label సత్యం. Show all posts
Showing posts with label సత్యం. Show all posts

Saturday, November 19, 2022

అరికాలు నిమరని




చిత్రం : మా వూరి పెద్దమనుషులు/రాహువు-కేతువు) (1980)

సంగీతం : సత్యం 

గీతరచయిత :  సినారె 

నేపథ్య గానం : బాలు, సుశీల  


పల్లవి :


అరికాలు నిమరని.. అరకంట చూడని

అరనవ్వు విసరని.. మరి మరి మరి మరి మరి మరి 


అరికాలు నిమిరినా.. అరకంట చూసినా

అరనవ్వు విసిరినా.. సరి సరి సరి సరి సరి  


ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..



చరణం 1 :


బులిపించే నీ వయసేమో పలుకు పలుకు పలుకు పలకమంది

గుబులేసే నా గుండెల్లో కళుకు కళుకు కళుకు కళుకుమంది 

బులిపించే నీ వయసేమో పలుకు పలుకు పలుకు పలకమంది

గుబులేసే నా గుండెల్లో కళుకు కళుకు కళుకు కళుకుమంది 


ఆ గుబులు తీయనిదమ్మా.. అది నీకే తెలియనిదమ్మా

ఆ గుబులు తీయనిదమ్మా.. అది నీకే తెలియనిదమ్మా

ఆ వింత మరి కొంత చిగురించాలంటే...


అరికాలు నిమరని.. అరకంట చూడని

అరనవ్వు విసరని.. సరి సరి సరి సరి సరి


ఉ.. ఉ.. ఉ.. ఉ.. 


చరణం 2 :


గడుసైనా కోరికయేమో అడుగు అడుగు అడుగు అడగమంది

తొలి సిగ్గు అలజడి ఏమో నిలువు నిలువు నిలువు నిలవమంది 

గడుసైనా కోరికయేమో అడుగు అడుగు అడుగు అడగమంది

తొలి సిగ్గు అలజడి ఏమో నిలువు నిలువు నిలువు నిలవమంది


ఒక చెంప ముద్దంటుంది.. ఒక చెంప వద్దంటుంది

ఆ రెంటి చెలగాట సరి చెయ్యాలంటే... ఆ


అరికాలు నిమరని.. అరకంట చూడని

అరనవ్వు విసరని.. మరి మరి మరి మరి 


అరికాలు నిమిరినా.. అరకంట చూసినా

అరనవ్వు విసిరినా.. సరి సరి సరి సరి సరి సరి

 

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. 




Wednesday, September 1, 2021

శరణంటిమయ్యా శ్రీ ఆంజనేయ

 




చిత్రం :  మూడుపువ్వులు-ఆరుకాయలు (1979) 

సంగీతం :  సత్యం

గీతరచయిత :  సినారె

నేపథ్య గానం :  బాలు 


పల్లవి :



శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం

భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం భజేహం భజేహం


శరణంటిమయ్యా శ్రీ ఆంజనేయ కరుణించవయ్యా వీరాంజనేయ  

శరణంటిమయ్యా శ్రీ ఆంజనేయ కరుణించవయ్యా వీరాంజనేయ

నమో వజ్రకాయ నమో భక్తగేయ 

నమో వజ్రకాయ నమో భక్తగేయ

నమో దివ్యమహిమాప్రమేయ 

శరణంటిమయ్యా శ్రీ ఆంజనేయ కరుణించవయ్యా వీరాంజనేయ


చరణం 1 :



శ్రీమన్మహా మంగళాకార

త్రైలోక్య మందార 

దుష్టారి సంహార 

శిష్టాత్మ సంచారా

సంసార పంకమ్మునందున్న మమ్ముద్ధరించంగ 

మా శోకదావానల జ్వాలలార్పంగ వేవేగ రావయ్య శ్రీ ఆంజనేయ


శరణంటిమయ్యా శ్రీ ఆంజనేయ కరుణించవయ్యా వీరాంజనేయ


చరణం 2 :



కన్నాము సామీరి... కన్నాము స్వామీ 

ప్రసన్నమ్ము నీ మోము కన్నామయ్యా

కోటి పుణ్యాలు పండించుకొన్నామయా …. 

ఏమి వక్షమ్ము...  శ్రీరామ పక్షమ్ము, 

దాక్షిణ్య దక్షమ్ము...ఆర్తాళి రక్షమ్ము... సాకార మోక్షమ్ము

మా వీక్షణమ్ముల్ కృతార్థమ్ములాయెన్ గదా

 

దైవ భక్తాగ్రగణ్యా! 

అగణ్యమ్ము నీ కీర్తి... మాన్యమ్ము నీ మూర్తి 

ధన్యమ్ము ధన్యాతిధన్యమ్ము మా జన్మజాతమ్ము వాతాత్మజ...  ఆంజనేయా 


శరణంటిమయ్యా శ్రీ ఆంజనేయ కరుణించవయ్యా వీరాంజనేయ


చరణం 3 :


ఎన్నెన్ని ప్రాంతమ్ములెన్నెన్ని దుర్గమ్ములెన్నో అరణ్యమ్ములెన్నో గిరీంద్రమ్ములెన్నాళ్ళు శోధించి శోధించీ….

క్షేత్రాలు దర్శించి తీర్థాలు సేవించి మంత్రాలు వల్లించి తంత్రాలు ఛేదించి ఎన్నాళ్ళకెన్నాళ్ళకూ….

వీక్షించినామయ్య నీ భవ్య రూపమ్ము, సారించవేమయ్య నీ దివ్య తేజమ్ము…..

కుప్పించి లంఘించి అంబోధులన్ మించి ఆకాశ పర్యంత సంవర్ధివై ఉగ్రతాస్ఫూర్తివై…

చండ భానుచ్ఛటా మండితాఖండ శక్తిప్రపూర్ణుండవై సాగిరావయ్యా…

నా ఆత్మపీఠంబుపై నీ ప్రతిష్ఠార్థమై వేచి ఉన్నానయా….

రక్షమాం రక్షమాం చేరరావా...  అఖర్వప్రభావా ! 

అపూర్వానుభావా! అహో ఆంజనేయా!

రామ్! రామ్!...  ప్రసన్నాంజనేయా ! 

రామ్! రామ్!...  సువర్ణాంజనేయా…. ఆ….


నమస్తే… నమస్తే…. నమస్తే….. నమః



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8352

Friday, June 11, 2021

దూరాకాశ వీధుల్లో తారాదీపాలు

చిత్రం  :  మాయావి (1976)

సంగీతం  : సత్యం

గీతరచయిత  :  డి. కృష్ణమూర్తి 

నేపథ్య గానం  :  ఎస్. జానకి 



పల్లవి : 


దూరాకాశ వీధుల్లో తారాదీపాలు

భారమైన గుండెల్లో ఆరని దీపాలు

ఆరక ఊరక ఊగాలి ఆశాదీపాలు

దూరాకాశ వీధుల్లో తారాదీపాలు


ఓ... ఓ... ఓ... ఓ... 
ఓ.... ఓ... ఓ... 


చరణం 1 : 



తోడు దొరకని బ్రతుకులలో... తోచే శోధనలు

మాయలెరుగని మనసులలో... మండే వేదనలు

కనిపెట్టి కరుణించేవి... కరుణించి కాపాడేవి


దూరాకాశ వీధుల్లో తారాదీపాలు

భారమైన గుండెల్లో ఆరని దీపాలు

ఆరక ఊరక ఊగాలి ఆశాదీపాలు


దూరాకాశ వీధుల్లో తారాదీపాలు


ఓ... ఓ... ఓ.. ఓ...


చరణం 2 :


మూసే చీకటి ముసుగుల్లో... దాగినవెన్నెన్నో

చేసే మాయల వేషం వెనుక దాచినవేమేమో

పయనించి పరికించేవి... పరికించి పాలించేవి 



దూరాకాశ వీధుల్లో తారాదీపాలు

భారమైన గుండెల్లో ఆరని దీపాలు

ఆరక ఊరక ఊగాలి ఆశాదీపాలు

దూరాకాశ వీధుల్లో తారాదీపాలు




https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7217

Wednesday, November 4, 2020

కసురుకున్న కళ్ళది




చిత్రం : బంగారు కానుక (1982)

సంగీతం :  సత్యం

గీతరచయిత : వేటూరి 

నేపథ్య గానం : బాలు, సుశీల 



పల్లవి :


కసురుకున్న కళ్ళది పెసరకాయ వేళ్ళది

కసురుకున్న కళ్ళది పెసరకాయ వేళ్ళది

ఏమౌతాదో ఏమో వస్తే కౌగిళ్ళకి

ఇ.. ఇ.. ఇ.. ఇ.. ఇ.. ఇ.. 

పూలా పొదరిళ్ళకి... పూలా పొదరిళ్ళకి


ఉడుం పట్టు పిల్లడు.. ఊరికంత అల్లుడు

ఉడుం పట్టు పిల్లడు.. ఊరికంత అల్లుడు

ఏమిస్తాడో ఏమో వస్తే కౌగిళ్ళకి

అహా హా...  హా  

పూలా పొదరిళ్ళకి... హా.. పూలా పొదరిళ్ళకి



చరణం 1 :


పిసినిగొట్టు నడుమ్మీద పిలక జళ్ళది

విసిరిగొట్టు కొంగుల్లో పొంగే పరవళ్ళది

పిసినిగొట్టు నడుమ్మీద పిలక జళ్ళది

విసిరిగొట్టు కొంగుల్లో పొంగే పరవళ్ళది


సెలయేటి ఉరవళ్ళది... చలిగాలి సణుగుళ్ళది

ఆ...ఆ...

సెలయేటి ఉరవళ్ళది... చలిగాలి సణుగుళ్ళది

ఏమొతాదో ఏమో ఎండా ఎన్నళ్ళకి... అహా.. ఏయ్

చీరాసందిళ్ళకి... తీపీ సందిళ్ళకి 


కసురుకున్న కళ్ళది పెసరకాయ వేళ్ళది

ఏమిస్తాడో ఏమో వస్తే కౌగిళ్ళకి

అహా హా...  హా  

పూలా పొదరిళ్ళకి... హా.. పూలా పొదరిళ్ళకి


చరణం 2 :


చెంత కొచ్చి చేయి పడితే ఇంక చెల్లడు

బుగ్గ గట్టి చేతికిస్తే మొగ్గైనా గిల్లడు 

చెంత కొచ్చి చేయి పడితే ఇంత చెల్లడు  

బుగ్గ గట్టి చేతికిస్తే మొగ్గైనా గిల్లడు 


సరసాల ఈ గుంటడు... సరదాకి బాగుంటడు

సరసాల ఈ గుంటడు... సరదాకి బాగుంటడు


ఏమిస్తాడో ఏమో నా ఇరవై ఏళ్ళకి

హా.. హా.. హా

చీరా కుచ్చిళ్ళకి.. హా.. చిలిపి వత్తిళ్ళకి



ఉడుం పట్టు పిల్లడు.. ఊరికంత అల్లుడు

ఏమౌతాదో ఏమో వస్తే కౌగిళ్ళకి 

హా.. హా...

పోదాం సందేళకి.. పూలా పొదరిళ్ళకి 



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1876

Tuesday, November 3, 2020

నడకా హంసధ్వని రాగమా

 



చిత్రం : బంగారు కానుక (1982)

సంగీతం :  సత్యం

గీతరచయిత : వేటూరి

నేపథ్య గానం : బాలు, జానకి 



పల్లవి :

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. 

ఆ.. ఆ.. ఆ.. ఆ.. 


నడకా హంసధ్వని రాగమా 

ఆది నడుమా గగనంలో కుసుమమా 

నడకా హంసధ్వని రాగమా 

ఆది నడుమా గగనంలో కుసుమమా 


మణిపురిలో వయ్యారమా 

పురివిప్పిన మయూరమా 


నడకే హంసధ్వని రాగామే  

అది నడుమే గగనంలో కుసుమమే 

శ్రుతిలయానుబంధమే స్వరజతి కల్యాణమే 


నడకే హంసధ్వని రాగామే  

అది నడుమే గగనంలో కుసుమమే  


చరణం 1 :


హిమగిరికా సరిఝరి వాహినిలో 

అలరేగిన సితవర్ణ తురంగమా 

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 

హిమకర కర మహిమాన్విత నిశీధిలో 

చెలరేగిన చేకోరిక విహంగామా 

పరువాల పతంగమా...  హృదయాల మృదంగమా 


వసంత పంచమ సుస్వరమా 

వార్షుకాభ్రసడ్జమ నిస్వనమా 

స గారి...  సరిసని. .  పా  నిసరి 

స స   ప ప   ప ప ప ప  గపగరిస  


నడకా......  హంసధ్వని రాగమా....  

నడకే హంసధ్వని రాగామే  


చరణం 2 :


కాశ్మీర మందార  కుసుమంలో 

మధువులైన పెదవుల మకరందామా 

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 

కన్యాకుమారి కౌగిలింతలలో 

కదలి పొంగు కడలీతరంగమా 

నా జీవన దాహమా...  నా జవ్వన మొహమా 

అరుణచరణ యుగ చారణమా 

మధురగతుల మదవారణమా 

సరి  సరి  ప గ ద ప  గప  నిప   నిసరి 

నిస గరి  సరి  స ని గ ప  గరిస  


నడకా......  హంసధ్వని రాగమా....  

నడకే హంసధ్వని రాగామే 

ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 


చరణం 3 : 


నా మానస సరోవరస్థీరంలో 

కలికి నెలలు చిలికే కల్హారమా 

ఆ ఆ ఆ ఆ ఆ ఆ 

కలహంసలు కలలు కన్న స్వప్నంలో 

హింసపడిన హంసల నయగారమా 

నడకే ఒక నాట్యమా... 

నడకే ఒక నాట్యమా...  నామృగేంద్రమధ్యమా

శరత్వేణురవరంజితమా .... శరదంబరచెంచల సంచితమా 


తకున్దరి తకఝను... తకున్దరి తకఝను

తధిగిన తొం తకిట తొం తక తొం త


నడకా హంసధ్వని రాగమా 

ఆది నడుమా గగనంలో కుసుమమా 

మణిపురిలో వయ్యారమా 

పురివిప్పిన మయూరమా 

నడకే హంసధ్వని రాగామే  

అది నడుమే గగనంలో కుసుమమే 

శ్రుతిలయానుబంధమే స్వరజతి కల్యాణమే  


నడకే హంసధ్వని రాగామే  

అది నడుమే గగనంలో కుసుమమే




తామర పువ్వంటి తమ్ముడు కావాలా

 




చిత్రం : బంగారు కానుక (1982)

సంగీతం :  సత్యం

గీతరచయిత :

నేపథ్య గానం : బాలు, సుశీల 



పల్లవి :


తామర పువ్వంటి తమ్ముడు కావాలా 

చామంతి పువ్వంటి చెల్లాయి కావాలా

తామర పువ్వంటి తమ్ముడు కావాలా 

చామంతి పువ్వంటి చెల్లాయి కావాలా


ఈ మహరాణి నా గృహరాణి

ఈ మహరాణి నా గృహరాణి

దయ ఉంచి ఇద్దర్ని ఇవ్వాలా

తామర పువ్వంటి తమ్ముడు కావాలా 

చామంతి పువ్వంటి చెల్లాయి కావాలా


చరణం 1 :


ఇల్లేలే ఇల్లాలు వెదజల్లే అందాలు

కలబోసిన అమ్మాయి ఈ ఏడే పుట్టాలి

నన్నేలే శ్రీవారు మురిపించే సరసాలు

మరిపించే అబ్బాయి తమ భరతం పట్టాలి


మా అమ్మలు ఆటకి అమ్మా నాన్న బొమ్మలు కావాలి

అమ్మా నాన్న నాకో తమ్ముడు ఇప్పుడే కావాలి


తామర పువ్వంటి తమ్ముడు కావాలా 

చామంతి పువ్వంటి చెల్లాయి కావాలా



చరణం 2 :


మా పాపే యువరాణి... మా ఇల్లే ఒక రాజ్యం

ఆ మాటే ధర్మానా... కాదంటే జరిమాణా

కంటావా మహరాణి... కావాలి ఒక సైన్యం

పెద్దైనా చినదానా... నీ ప్రేమే నజరానా 


ఇద్దరు లేకా ముగ్గురన్నది హద్దు ఎవరికైనా

ముద్దుల తమ్ముని ఇవ్వక పోతే మీకే జిల్లాయి


తామర పువ్వంటి తమ్ముడు కావాలా 

చామంతి పువ్వంటి చెల్లాయి కావాలా

ఈ మహరాణి నా గృహరాణి

దయ ఉంచి ఇద్దర్ని ఇవ్వాలా

నా మదినేలే ఈ మహరాజు 

దయ ఉంటే ఇద్దర్ని ఇస్తానే


తామర పువ్వంటి తమ్ముడు కావాలా 

చామంతి పువ్వంటి చెల్లాయి కావాలా



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6644

Sunday, September 13, 2020

తగునా నీకిది జవరాలా

 



చిత్రం : రామాయణంలో పిడకల వేట (1980)

సంగీతం : సత్యం

గీతరచయిత :  జాలాది 

నేపథ్య గానం : రమణ, బాజీరావ్


పల్లవి :


తగునా నీకిది జవరాలా... తగునా నీకిది జవరాలా

తకతైకతైకమని తరలిపోవగా 

తగవులేల ఈ బిగువులేేలనే 

తగునా నీకిది జవరాలా ప్రియురాలా రావేలా


తగునా నీకిది ఓ రసికా... తగునా నీకిది ఓరసికా

తకతైకతైకమని సైగచేసి నడివీధిలోన 

నగుబాటుసేయక 

తగునా నీకిది ఓ రసికా... ప్రాణసఖా చాలునికా



చరణం 1 :


అంబరు జగదాంబ కరుణించు భ్రమరాంబ

రంగుబంగరుబొమ్మ రంగేళి చిలకమ్మా 

అంబరు జగదాంబ కరుణించు భ్రమరాంబ

రంగుబంగరుబొమ్మ రంగేళి చిలకమ్మా 


ఇంటినుండి నను వెంటతెచ్చినది కొంటె వలపు నయగారమా              

సొంతపెళ్లామా చెంత చేర్చుకుని సరసమాడుటిది నేరమా          

వగలిక చాలించి వలపించరారా 

వగలిక చాలించి వలపించరారా

మగువల మనసెరిగి బులిపించుకోరా


తగునా నీకిది ఓ రసికా... తగునా నీకిది ఓరసికా

తకతైకతైకమని సైగచేసి నడివీధిలోన 

నగుబాటుసేయక 

తగునా నీకిది ఓ రసికా... ప్రాణసఖా చాలునికా



చరణం 2 :


చాలు సరసాలింక గడసరి గొరవంక

సమయము కాదింక... రాలేదు నెలవంక

చాలు సరసాలింక గడసరి గొరవంక

సమయము కాదింక... రాలేదు నెలవంక



జంటలోనే చలిమంటలోన నాకొంటె వయసు చల్లార్చని

రసికరాజు ఇటు ఇసుకతిన్నెల పూలపాన్పునిక లేవరా

పూలపాన్పులకన్నా ఇసుకతిన్నెలుమిన్నా

పూలపాన్పులకన్నా ఇసుకతిన్నెలుమిన్నా

వంటగది పొగకన్నా వగల సెగలే మిన్నా

  


తగునా నీకిది జవరాలా... 

తకతైకతైకమని తరలిపోవగా 

తగవులేల ఈ బిగువులేేలనే 


తగునా నీకిది ఓ రసికా

తకతైకతైకమని సైగచేసి నడివీధిలోన 

నగుబాటుసేయక 

తగునా నీకిది ఓ రసికా... ప్రియురాలా.. చాలునిక



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5471

నా పేరే మురళీమోహన్




చిత్రం : రామాయణంలో పిడకల వేట (1980)

సంగీతం : సత్యం

గీతరచయిత :  ఆరుద్ర 

నేపథ్య గానం: బాలు, జానకి 


పల్లవి :


నా పేరే మురళీమోహన్... ఆరడుగుల అభినవ రామన్ 

నాకుంది ఒకటే బాణం ప్రేమ 

నీకోసం మళ్లీ పుట్టా నీతోనే ముడిపడి ఉంటా

నువ్వంటే పడి చస్తానే భామా

ఓ భామా సత్యభామా... ఓ భామా సత్యభామా



నా పేరే ఆశాదీపం అందానికి సుందర రూపం

నాకుంది ఒకటే హృదయం రామా

నలుగురిలో అల్లరివద్దు నట్టేట్టా నను ముంచద్దు

నాకోసం పడిచావద్దు మామా

ఓ మామ చందమామ... ఓ మామ చందమామ



చరణం 1 :


నీ వలపు తలపులే తెరిస్తే నా వయసు పొంగులో తడిస్తే

ఇక శృంగార సురభోగమే

నాటకాల నటశేఖరా నీ బూటకాలు ఇక చాలురా

ఇది అరచేతి వైకుంఠమే


హేయ్... శ్రీదేవిని వద్దన్నాను శ్రీప్రియనే కాదన్నాను

శ్రీదేవిని వద్దన్నాను శ్రీప్రియనే కాదన్నాను

నువ్వు అంటే సై అన్నానే భామా

ఓ భామా సత్యభామ... ఏయ్ భామా సత్యభామా


హేయ్...

నా పేరే ఆశాదీపం అందానికి సుందర రూపం

నాకుంది ఒకటే హృదయం రామా

నీకోసం మళ్లీ పుట్టా నీతోనే ముడిపడి ఉంటా

నువ్వంటే పడి చస్తానే భామా


ఓ భామా సత్యభామా... ఓ భామా సత్యభామా

ఓ మామ చందమామ... ఓ మామ చందమామ



చరణం 2 :


నిన్ను నమ్మి నే వరిస్తే నీ బులుపు తీర్చుకునివిడిస్తే 

ఇక వడగళ్ల కడగళ్ల వాన

నా దేవతల్లే నిను కొలుస్తా... నీ దేవుడల్లే నే నిలుస్తా

నే శృంగార రాముణ్ణే అవుతా


కళ్యాణం చుక్కెడతావా పారాణి పసుపెడతావా 

కళ్యాణం చుక్కెడతావా పారాణి పసుపెడతావా

నూరేళ్ల బంధం వేస్తావా 

ఓ మామా చందమామా...  ఓ మామ చందమామ


నా పేరే మురళీమోహన్... ఆరడుగుల అభినవ రామన్ 

నాకుంది ఒకటే బాణం ప్రేమ 

నీ మురళీ వాయిస్తుంటే నా హృదయం పులకిస్తుంటే

ఒళ్ళంతా ఝల్లంటుంది మామా


ఓ మామా చందమామా...  ఓ మామ చందమామ

ఓ భామా సత్యభామా... ఓ భామా సత్యభామా



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5470

పెళ్లైన బ్రహ్మచారిని

 




చిత్రం : రామాయణంలో పిడకల వేట (1980)

సంగీతం : సత్యం

గీతరచయిత :  ఆరుద్ర

నేపథ్య గానం: బాలు, జానకి 


పల్లవి :


హోయ్... పెళ్లైన బ్రహ్మచారిని ఓ చిలకల కొలికి 

పెళ్లామున్న స్వాములారిని 

పెళ్లైన బ్రహ్మచారిని ఓ చిలకల కొలికి 

పెళ్లామున్న స్వాములారిని 


చెప్పిన మాట విననంటావు

జిలిబిలి సరసం లేదంటావు  

నీకు నాకు తళాంగు తధిగిణతోం 


పెళ్లైన బ్రహ్మచారిని ఓ చిలకలకొలికి 

పెళ్లామున్న స్వాములారిని 


చరణం 1 :


పలుకే బంగారమాయే కులుకే వెటకారమాయే

ఉలకనైనా ఉలకనంటివే 

తెలుసు నేనంటే నీకు అలుసు

నేనలుసైపోయా అత్తామామల వత్తాసయినవే


ఇంట్లోపనులు చూడొద్దా ఇంటికి పేరు తేవొద్దా

వేళాపాళా అక్కరలేదా... తళాంగు తధిగిణతోం


పెళ్లైన బ్రహ్మచారిని ఓ చిలకల కొలికి 

పెళ్లామున్న స్వాములారిని  


చరణం 2 :


పట్టు నేపట్టానంటే ఒట్టు... వదిలిస్తా బెట్టు 

డ్యుయెట్టు పాడించుతా

చేదా నా మీద మోజు లేదా 

మరి నువ్వు మాత్రం ఉప్పు కారం తినడంలేదా


ఉప్పుకారం తింటున్నా ఎప్పుడెప్పుడని అంటున్నా

ఒప్పు తప్పు తెలియాలి... తళాంగు తధిగిణతోం



పెళ్లైనా బ్రహ్మచారిగారు ఓ గండరగండా

పెళ్లామున్న స్వాములారు

పెళ్లైనా బ్రహ్మచారిగారు ఓ గండరగండా

పెళ్లామున్న స్వాములారు


చెప్పినమాట వింటాలెండి... జిలిబిలి సరసం ఇస్తాలెండి

రాజిమనకు... తళాంగు తధిగిణతోం




https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5469

Monday, July 20, 2020

ఆడాలా పాడాలా

చిత్రం : చెప్పింది చేస్తా (1978)
సంగీతం :  సత్యం
గీతరచయిత : రాజశ్రీ
నేపథ్య గానం : జానకి, సుశీల 
 





పల్లవి : 


ఆడాలా పాడాలా...
ఈనిలయం విష వలయం... దాటేగతిలేకా ఈ వేళా
ఆడాలా పాడాలా
ఈనిలయం విషవలయం...దాటేగతిలేకా ఈ వేళా
ఆడాలా పాడాలా



చరణం 1 :


ఆరనివేదన నాలో రేగినా... రేగినా
ఏ చిరునవ్వులతో తుళ్లి ఆడనా... ఆడనా
ఆఖరి ఉాపిరి నాలో ఆగినా... ఆగినా
నే రగిలే ఎదతో రాగం పాడనా... పాడనా
ఓ... ప్రాణములే పందెముగా చిందులవేసేనా


ఆడాలా పాడాలా
ఈనిలయం విషవలయం... దాటేగతిలేకా ఈ వేళా
ఆడాలా పాడాలా


చరణం 2 :


సవాలు చేసిన నన్ను మరవకు 
నీకు గులామునవుతానంటు తలవకు
ఆడది అలుసని అనుకుంటె తప్పురా   
అది ఎదురుతిరితే నీకే ముప్పురా
మోసాలు ఘోరాలు ఇకపై సాగవురా


ఆడాలా పాడాలా
ఈనిలయం విషవలయం దాటేగతిలేకా ఈ వేళా
ఆడాలా పాడాలా 

ఈనాడు పాడే ఈపాట

చిత్రం : చెప్పింది చేస్తా (1978)
సంగీతం :  సత్యం
గీతరచయిత : రాజశ్రీ
నేపథ్య గానం : బాలు, సుశీల 
 





పల్లవి : 


ఈనాడు పాడే ఈపాట నీకు నా కానుక       
అనుకోలేదు ఏనాడు ఈ కలయిక       
మన ఈ కలయిక


ఈనాడు పాడే ఈ పాట నీకు నా కానుక       
అనుకోలేదు ఏనాడు ఈ కలయిక       
మన ఈ కలయిక


చరణం 1 :


నిండుగ నీవు నూరేళ్లు మెలిగి పచ్చగా సాగించు బ్రతుకు       
నిన్నే నమ్మిన నీవారి ఎదలో వెన్నెల పన్నీరు చిలుకు
ఆడినమాట మరువను నేను ఎన్నటికి మారిపోను         
 బాసలనే మరచిపోను... బాసలనే మరచిపోను


ఈనాడు పాడే ఈ పాట నీకు నా కానుక
అనుకోలేదు ఏనాడు ఈ కలయిక
మన ఈ కలయిక


చరణం 2 :


మెలకువలోనే ఎన్నెన్ని కలలో... కలలో బంగారు కథలు       
నాటికి నేటికి ఎనలేని దూరం... ఏమిటి ఈ వింతకాలం
కలలే నిజమై కథలే వరమై చెరగదు ఆనాటి చెలిమి           
తరగదు అనురాగ కలిమి... తరగదు అనురాగ కలిమి



ఈనాడు పాడే ఈ పాట నీకు నా కానుక
అనుకోలేదు ఏనాడు ఈ కలయిక... మన ఈ కలయిక

ఒకానొక కన్నె చిలకుంది

చిత్రం : చెప్పింది చేస్తా (1978)
సంగీతం :  సత్యం
గీతరచయిత : రాజశ్రీ
నేపథ్య గానం : బాలు 



పల్లవి : 


ఒకానొక కన్నె చిలకుంది
అదే నన్ను కన్ను గీటింది
సందెవేళ సైగచేసి చాటుగా నన్ను రమ్మంది

ఒకానొక కన్నె చిలకుంది
అదే నన్ను కన్ను గీటింది
సందెవేళ సైగచేసి చాటుగా నన్ను రమ్మంది


ఒకానొక కన్నె చిలకుంది.. హహహ.. హే


చరణం 1 :


కైపురేపే కనులతోనే నాకు వేసింది వల
కలుసుకున్న తెలుసుకున్న దాని అందాల వెల 
కైపురేపే కనులతోనే నాకు వేసింది వల
కలుసుకున్న తెలుసుకున్న దాని అందాల వెల 
మురిపించింది మరిపించింది... నను గారడి చేసినది


ఒకానొక కన్నె చిలకుంది
అదే నన్ను కన్ను గీటింది
సందెవేళ సైగచేసి చాటుగా నన్ను రమ్మంది


ఒకానొక కన్నె చిలక.. హహహ.. హే


చరణం 2 :


మంచు కురిసే మసకరేయి ముసుగు లాగింది చెలి
పైటచెంగు మాటులోన తీర్చుకున్నాను చలి 
మంచు కురిసే మసకరేయి ముసుగు లాగింది చెలి
పైటచెంగు మాటులోన తీర్చుకున్నాను చలి     
ఆనాటిసుఖం ఆ వింత క్షణం నావరకే సొంతము



ఒకానొక కన్నె చిలకుంది
అదే నన్ను కన్ను గీటింది
సందెవేళ సైగచేసి చాటుగా నన్ను రమ్మంది


ఒకానొక కన్నె చిలక.. హహహ.. హే

కన్నెపిల్లలం కాని నీకు తల్లులం

చిత్రం : చెప్పింది చేస్తా (1978)
సంగీతం :  సత్యం
గీతరచయిత : రాజశ్రీ
నేపథ్య గానం : సుశీల, జానకి 





పల్లవి : 


కన్నెపిల్లలం కాని నీకు తల్లులం
గోలచెయ్యకు నీకు జోలపాడుతాం
ళోళోళో హాయి హాయి... ళోళోళో హాయి హాయి


చరణం 1 :


ఉయ్యాలే లేదురా నీకు ఇచ్చట 
ఈ తువ్వాలే తీర్చేను ముద్దుముచ్చట
అరెరె.. ఉగ్గుపాలులేవని ఏమనుకోకు 
నీ బుగ్గలు కందేలాగ నువ్వేడవకు


మంచిబాబు నువ్వు మల్లెలాగ నవ్వు
మంచిబాబు నువ్వు మల్లెలాగ నవ్వు
నవ్వులలో వెలుగులను వెదజల్లాలి


కన్నెపిల్లలం కాని నీకు తల్లులం
గోలచెయ్యకు నీకు జోలపాడుతాం
ళోళోళో హాయిహాయి ళోళోళో హాయిహాయి


చరణం 2 :


ఏనాటి బంధమో ఈ అనుబంధం 
ఇది ఎందాక పోతుందో మన సంబంధం
అయ్యె గుట్టుగా తెచ్చాము నిన్నిక్కడికి   
రచ్చచేసి పంపకురా మమ్ము బయటికి


చిన్నివాడివైన చేతులెత్తి నీకు
చిన్నివాడివైన చేతులెత్తి నీకు
మొక్కుతాము దయచేసి గుక్కపట్టకు


కన్నెపిల్లలం కాని నీకు తల్లులం
గోలచెయ్యకు నీకు జోలపాడుతాం
ళోళోళో హాయి హాయి ళోళోళో హాయి


Friday, July 17, 2020

నా ప్రేయసి... ఊహలో ఊర్వశి

చిత్రం : టాక్సీ డ్రైవర్ (1981)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు 



పల్లవి : 


నా ప్రేయసి... ఊహలో ఊర్వశి
నా ప్రేయసి... ఊహలో ఊర్వశి
ఆకాశ వీధిలో అందాల రాశి 


నా ప్రేయసి... ఊహలో ఊర్వశి
ఆకాశ వీధిలో అందాల రాశి
నా ప్రేయసి... ఊహలో ఊర్వశి 



చరణం 1 :



కలగా నీవు కనిపించినావే
వలగా నీవు వలపించినావే
చెలిమై నన్ను జతకూడినావే
సిరివై నన్ను విడనాడినావే
ఆ దివిలో నీవు... భువిలో నేను
ఆ దివిలో నీవు... భువిలో నేను
ఎదలోన రగిలే వ్యధవైతివే


నా ప్రేయసి... ఊహలో ఊర్వశి
ఆకాశ వీధిలో అందాల రాశి
నా ప్రేయసి... ఊహలో ఊర్వశి 


చరణం 2 :


గుండెలలో నీకు గుడి కట్టినానే
అనురాగాదీపాలు వెలిగించినానే
శిలవని తెలియక పూజించినానే
విషమని తెలియక సేవించినానే 


కలవో లేవో...  కలవో శిలవో

కలవో లేవో...  కలవో శిలవో 

కలయిక... కల ఇక...  మనకికలేదులే 



నా ప్రేయసి... ఊహలో ఊర్వశి
ఆకాశ వీధిలో అందాల రాశి
నా ప్రేయసి... ఊహలో ఊర్వశి



Wednesday, July 1, 2020

లవ్ లవ్ లబ్జనక అబ్బదాని సోకు

చిత్రం : ఐ లవ్ యూ (1979)
సంగీతం :  సత్యం
గీతరచయిత :
నేపథ్య గానం : బాలు 



పల్లవి : 


లబ్జనకిడి లబ్జనకిడి తబ్జనకిడి తబ్జనకిడి
జనకిడి జనకిడి తకధిమి ధికధిమి తకధిమి


లవ్ లవ్ లవ్ లవ్ లబ్జనక అబ్బదాని సోకు
జబ్బల దాకా జుమ్కీలు...   అబ్బదాని సోకు
జబ్బల దాకా జుమ్కీలు   


అగ్గురారం సంతలోన గుగ్గిళ్లు కొనిపెడితే
అగ్గురారం సంతలోన గుగ్గిళ్లు కొనిపెడితే
గుగ్గిళ్లు వద్దని మొగ్గలు కోరింది మల్లె మొగ్గలు కోరింది


లవ్ లవ్ లబ్జనక అబ్బదాని సోకు
జబ్బల దాకా జుమ్కీలు
జబ్బల దాకా జుమ్కీలు


చరణం 1 :



ఓరబ్బ నాయుడోరి తోటకాడా
ఓలమ్మి నారింజ చెట్టు కాడా
నాయుడోరి తోటకాడా... ఓలమ్మి నారింజ చెట్టు కాడా
అరెరే కాపిటీల  కొస్తుంటే...  ఓలమ్మె కానిపట్టు పట్టిందె
సందె చీకటిలోన.. సందె చీకటిలోన సరసమాడిందే

లవు లవు లబ్జనక అబ్బదానిసోకు
జబ్బల దాకా జుమ్కీలు
అబ్బదానిసోకు జబ్బలదాకా జుమ్కీలు


చరణం 2 : 



చింతచెట్టు చిగురు చూడు
చిన్నదాని సోకు చూడు
చింతచెట్టు చిగురు చూడు
చిన్నదాని సోకు చూడు     
జనప చేను కోతలోన జబ్బజబ్బ కలుపుకుంటు
జతగాళ్లు చూడకుండా కితకితలెట్టిందే

లవు లవు లబ్జనక అబ్బదానిసోకు
జబ్బల దాకా జుమ్కీలు
అబ్బదాని సోకు జబ్బలదాకాజుమ్కీలు  



ఎవ్వరన్నారు ఎందుకంటారు

చిత్రం : ఐ లవ్ యూ (1979)

సంగీతం :  సత్యం

గీతరచయిత : సినారె

నేపథ్య గానం : బాలు



పల్లవి : 


ఎవ్వరన్నారు ఎందుకంటారు మనిషినే కానని
ఎవరు మొరిగినా రుజువు చేయనా మగతనం నాదని
మనషే  నేనని రుజువే చేయనా... ఆ
మనషే  నేనని రుజువే చేయనా
who said it I am not a man
who said it I say who said it


చరణం 1 :


నాలో మృగమునణచి నన్ను మనిషిని చేసింది నువ్వే
నన్నే మృగము చేసి నేడు వేటాడుతున్నది నువ్వే   
నాలో మృగమునణచి నన్ను మనిషిని చేసింది నువ్వే
నన్నే మృగము చేసి నేడు వేటాడుతున్నది నువ్వే


కుబుసం విడిచిన సర్పం జోకొడితేె ఆగునా
కుబుసం విడిచిన సర్పం జోకొడితే ఆగునా
పులి లేచిందా... కసిరేగిందా అదిలిస్తే ఆగునా


Yes I am a tiger... I am a beast
ఎవ్వరన్నారు ఎందుకంటారు మనిషినే కానని
ఎవరు మొరిగినా రుజువు చేయనా మగతనం నాదని
మనషే నేనని రుజువే చేయనా... ఆ
మనషే నేనని రుజువే చేయనా 



చరణం 2 : 



మమత వట్టి మగత అది తలకెక్కితే నల్లమందు
మనసు కంటి నలుసు అది ఎదురొస్తే నీ చూపు బందు
మమత వట్టి మగత అది తలకెక్కితే నల్లమందు
మనసు అది కంటి నలుసు అది ఎదురొస్తే  నీ చూపు బందు


ప్రేమకు గోరికట్టి... శిలలాగా సాగరా
ప్రేమకు గోరికట్టి... శిలలాగా సాగరా
ఋషికావద్దు రుచి వదలొద్దు మనషంటే వాడురా

yes I am demon... I am demon
who said it I am not a man
who said it I am not a man
I am a tiger... I am a tiger...       



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9054

నాజూకు నాలో ఉంది

చిత్రం : ఐ లవ్ యూ (1979)
సంగీతం :  సత్యం
గీతరచయిత : ఆరుద్ర
నేపథ్య గానం :  జానకి



పల్లవి : 


నాజూకు నాలో ఉంది చూడరా
నాలాంటి చిన్నది వేరే లేదురా
వొళ్ళంతా వయ్యారం పొంగేను సింగారం
నానీటు నా గోటు నీ కోసం దాచాను
తీసుకో సత్తా ఉంటే సంకెళ్ళన్ని తెంచుకో
సరదాలన్నీ నాతో నువ్వు పంచుకో
ఆనందాలు ఆవేశాలు తెంచుకో 


చరణం 1 :


ఉర్రూతలూగించేదే ఊర్వశి... ఉవ్విళ్లు ఊరించేదే ప్రేయసి
క్రీగంట చూశానో నా వెంట పడతావు
కొనగోట తాకేను నాజంట కడతావు
హాయిగా లోకులు చూసి నేనేనంటావు మేనకా
ఇంపు సొంపూ ఇస్తా నీకు కానుకా
నీలో బాగా రగిలిస్తాను కోరికా





చరణం 2 :   


బులపాటం ఆడించేయి  కోపమా
ఉబలాటం తీరకపోతే తాపమా
రాగాలు భోగాలు లాలించి తేలించి
పరువాల కెమ్మోవి పానీయం అందిస్తా
అందుకో నీతో నేను పందెం కడతా కాసుకో
అందంతో నే బందీ చేస్తా చూసుకో
పౌరుషముంటే నన్నే సొంతం చేసుకో 


అందుకో నీతో నేను పందెం కడతా కాసుకో
అందంతో బందీచేస్తా చూసుకో
పౌరుషముంటే నన్నే సొంతం చేసుకో  



Friday, June 12, 2020

సూరీడు తూరుపున

చిత్రం : ఆహుతి (1988)
సంగీతం : సత్యం
గీతరచయిత : మల్లెమాల
నేపథ్య గానం : జానకి 


పల్లవి : 



సూరీడు తూరుపున దీపమై వెలుగు
ఆ వెలుగు లోకానికంతటికి వెలుగు
సూరీడు తూరుపున దీపమై వెలుగు
ఆ వెలుగు లోకానికంతటికి వెలుగు 


పుడమి ముత్తైదువ పులకించిపోవ
సిరి బొట్టు పెట్టి...  నే తీర్చినట్టి
ముగ్గులే ముంగిలికి ముత్యాల వెలుగు... ముత్యాల వెలుగు


సూరీడు తూరుపున దీపమై వెలుగు
ఆ వెలుగు లోకానికంతటికి వెలుగు 

చరణం 1 :


హరివిల్లులో లేని సొగసు... నీ చిరునవ్వులో ఉన్నది
సిరివెన్నెలను మించు సిరులు... నీ చిరు బుగ్గలో ఉన్నవి


నీ  ముద్దు మురిపాలు నాకు వైభోగాలు
నీ  ముద్దు మురిపాలు నాకు వైభోగాలు
ఈ అమ్మ ప్రేమకు నువ్వానవాలు... నువ్వానవాలు


సూరీడు తూరుపున దీపమై వెలుగు
ఆ వెలుగు లోకానికంతటికి వెలుగు 



చరణం 2 :


దిగులెందుకో నాకు తెలుసు... నీకు దేవుడే అండగా నిలుచు
ఇది మనసు విరబూయు వయసు.... ఇపుడు నిలపాలి చదువుపై మనసు
బుద్దిగా మసలుతూ శ్రద్దగా చదివి
బుద్దిగా మసలుతూ శ్రద్దగా చదివి...
తేవాలి మనముందు తెలుగుకే వెలుగు.... తెలుగుకే వెలుగు



సూరీడు తూరుపున దీపమై వెలుగు
ఆ వెలుగు లోకానికంతటికి వెలుగు 



Monday, April 27, 2020

ప్రణయ పిపాసి

చిత్రం : అగ్ని సమాధి (1978)
సంగీతం : సత్యం
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం : బాలు, జానకి  



పల్లవి : 


ప్రణయ పిపాసి హృదయ నివాసి
పొంగులుగా రంగులుగా ఒంపులుగా సొంపులుగా
మోహంగా దాహంగా ఉరికి ఉరికి ఒడికి చేరరా


ప్రణయ పిపాసి హృదయ నివాసి
పొంగులుగా రంగులుగా ఒంపులుగా సొంపులుగా
మోహంగా దాహంగా ఉరికి ఉరికి ఒడికి చేరరా 


ప్రణయ పిపాసి హృదయ నివాసి



చరణం 1 :


సెలయేటి రాగాల ఎలదేటి గానాల విన్నాను నీ పాటలెన్నో
హరివిల్లు ఎదలోనా విరిజల్లు జడిలోనా కన్నాను నీ వన్నెలెన్నో


స్వప్నాలెన్నో స్వర్గాలెన్నో... భావలెన్నో భోగాలెన్నో
కలుపుకున్న కనులలోనా నిలిపి చూడగా  



ప్రణయ పిపాసి హృదయ నివాసి
పొంగులుగా రంగులుగా ఒంపులుగా సొంపులుగా
మోహంగా దాహంగా ఉరికి ఉరికి ఒడికి చేరరా 


ప్రణయ పిపాసి హృదయ నివాసి



చరణం 2 :


అనురాగ గిరిలోనా ఆనందశిఖరాన శివతాండవం నీవు కాగా
సగమైన దేహాన సరితూగు వేగాన సతి లాస్యమే నీవు కాగా
జాబిలి వంగీ  సిగలో పువ్వై... ఎదలో ఎరుపే పెదవుల ఎరుపై..
మెరిసిపోయి మురిసిపోయి ముద్దులాడగా


ప్రణయ పిపాసి హృదయ నివాసి
పొంగులుగా రంగులుగా ఒంపులుగా సొంపులుగా
మోహంగా దాహంగా ఉరికి ఉరికి ఒడికి చేరరా 


ప్రణయ పిపాసి హృదయ నివాసి



Saturday, April 18, 2020

ప్రాణాన్నే పసుపుగా

చిత్రం:  అనాదిగా ఆడది (1985)
సంగీతం:  సత్యం
గీతరచయిత:  వేటూరి
నేపథ్య గానం:  జానకి 


సాకీ :


తోడు కావాలని బ్రహ్మ... సృజియించే స్త్రీమూర్తిని
బ్రహ్మముళ్ళతో చెరిసగంగా...  కలిసి బ్రతకమన్నాడు
బ్రహ్మముళ్ళతో చెరిసగంగా...  కలిసి బ్రతకమన్నాడు



పల్లవి :


ప్రాణాన్నే పసుపుగా... రక్తాన్నే కుంకుమగా
ప్రాణాన్నే పసుపుగా... రక్తాన్నే కుంకుమగా
పంచి ఇచ్చు ప్రకృతిరా ఆడది
మన ఆకృతికే ఆలయం ఆడది
మన ఆకృతికే ఆలయం ఆడది


అయినా... అనాదిగా ఆడదానికి ఙరుగుతున్నదేమిటి?


చరణం 1 :


దేముడన్న రామన్న వడేలన్న మాట విని
నమ్ముకున్న సీతమ్మను అడవి పాల్చేసినా..
శీలవతి సీతమ్మ తలవంచెను కానీ..
శీలవతి సీతమ్మ తలవంచెను కానీ..
నోరు విప్పలేదు... ఇది దారుణ మనలేదు
దారుణ మనలేదు..


ప్రాణాన్నే పసుపుగా... రక్తాన్నే కుంకుమగా
ప్రాణాన్నే పసుపుగా... రక్తాన్నే కుంకుమగా
పంచి ఇచ్చు ప్రకృతిరా ఆడది
మన ఆకృతికే ఆలయం ఆడది
మన ఆకృతికే ఆలయం ఆడది


చరణం 2 :



హరిశ్చద్రుడంతటోడు కీర్తిపెంచుకోనూ... ఆలి చంద్రమతిని వీధిలో తెగనమ్మినా
పతి మాటను జవదాటక అమ్ముడాయే గానీ
పతి మాటను జవదాటక అమ్ముడాయే గానీ
నోరు విప్పలేదు.. ఇది దారుణమనలేదు... దారుణమనలేదు


ప్రాణాన్నే పసుపుగా... రక్తాన్నే కుంకుమగా
పంచి ఇచ్చు ప్రకృతిరా ఆడది
మన ఆకృతికే ఆలయం ఆడది
మన ఆకృతికే ఆలయం ఆడది



చరణం 3 :


సహగమనం పేరుతో సజీవంగా కాల్చారు...
కన్యాశుల్కం పేరుతో కన్నెలనే అమ్మారు...
బాల్యవివాహాలతో వితంతువుల చేశారు...
తరతరాలు ఆడదాన్ని అన్యాయమే చేశారు...


ఇంత చేసినా... ఇన్ని చేసినా...
ఓరిమితో సహించింది... కూరిమితో భరించింది


కానీ.. అనాగరికతకు అమానుషానికి మారుపేరైన కట్నం
స్త్రీ జాతిని చితిపై పేర్చి కాల్చుకు తిను వరకట్నం
మనిషిని మనిషే కొని కట్టుకొనే సిగ్గుమాలినా కట్నం
పెళ్ళికి కట్నం... పండుగ కట్నం... చదువుకు కట్నం... ఉద్యోగ కట్నం
కట్నం.. కట్నం.. కట్నం...
ఎన్ని కన్నీళ్ళకైనా ఆరని కాష్టం...
భరించేది ఇంకెన్నాళ్ళు... 


బ్రహ్మ కోరినా సగభాగంగా ఆడది మారేదెప్పుడూ?
ఈ భార్యభర్తల తులాభారం సమానమయ్యేదెప్పుడు?
ఎప్పుడు... ఎప్పుడు... ఎప్పుడు...