చిత్రం : ఇల్లాలు ప్రియురాలు (1984) సంగీతం : చక్రవర్తి గీతరచయిత : వేటూరి నేపథ్య గానం : బాలు
పల్లవి :
ఆదివారం అర్థాంగికీ... సాయంకాలం సరసానికీ బాబూ నీకో దండం... తల్లీ చెప్పకు అడ్డం వారం దాకా అడగను మళ్ళీ వరమియ్యవా
ఆదివారం శ్రీవారికీ... సాయంకాలం సినిమాలకీ బాబూ నీకో దండం వద్దీ తొందరమేళం వారం దాకా దూరంగుండే వరమివ్వనా
ఆదివారం అర్థాంగికీ.. సాయంకాలం సినిమాలకీ
చరణం 1 :
రాత్రీ పగలు పిల్లకు అలకే తీర్చానుగా రత్నాలంటి పిల్లల తల్లిని చేశారుగా సందేళ చలిపుట్టి సరదాగా రమ్మంటే వందేళ్ళ జతకట్టి వంచారూ నా మెడనే ఆ పెళ్ళి రోజులన్నీ మోజు తీరా ఒక్కసారీ రానీవమ్మా వేళా పాళా లేదూ... ఈ వెర్రికి మందే లేదూ ఈ కాపురమెట్టా చేయాలమ్మా కౌగిళ్ళలో
ఆదివారం అర్థాంగికీ... సాయంకాలం సరసానికీ బాబూ నీకో దండం వద్దీ తొందరమేళం వారం దాకా దూరంగుండే వరమివ్వనా
చరణం 2 :
చంటోడు అవుతున్నాడూ ఇంటాయనా వంటా వార్పూ అన్నీ సున్నా నారాయణా పసివాళ్ళూ చూస్తారూ... పరువంతా తీస్తారూ పరువంలో పడ్డాకా ఈ దరువే వేస్తారూ వాళ్ళమ్మా నాన్న ఆడే ఆట వాళ్ళు నేర్చుకుంటారంతేనమ్మా చీకటి పడితే చింత... వెన్నెల వేళకు వంకా నే వారందాకా ఆగాలంటే ఎట్టాగమ్మా
ఆదివారం శ్రీవారికీ... సాయంకాలం సినిమాలకీ బాబూ నీకో దండం వద్దీ తొందరమేళం వారం దాకా దూరంగుండే వరమివ్వనా
ఆదివారం అర్థాంగికీ... సాయంకాలం సరసానికీ బాబూ నీకో దండం... తల్లీ చెప్పకు అడ్డం వారం దాకా అడగను... మళ్ళీ వరమియ్యవా
No comments:
Post a Comment