Saturday, April 1, 2017

ఓ బాటసారి...ఇది జీవిత రహదారి

చిత్రం :  ఇల్లాలు (1981)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత  :
నేపధ్య గానం  : ఏసుదాసు,  శైలజ 




పల్లవి :



ఓ బాటసారి...ఇది జీవిత రహదారి
ఓ బాటసారి...ఇది జీవిత రహదారి 


ఎంత దూరమో... ఏది అంతమో
ఎవరు ఎరుగని దారి ఇది
ఒకరికె సొంతం కాదు ఇది 


ఓ బాటసారి... ఇది జీవిత రహదారి..



చరణం 1 :



ఎవరు ఎవరికి తోడౌతారో.... ఎప్పుడెందుకు విడిపోతారో
మమతను కాదని వెళతారో... మనసే చాలని ఉంటారు
ఎవ్వరి పయనం ఎందాకో...
అడగదు ఎవ్వరిని... బదులే దొరకదని
అడగదు ఎవ్వరిని... బదులే దొరకదని


చరణం 2 :



కడుపుతీపికి రుజువేముందీ... అంతకు మించిన నిజమేముందీ...
కాయే చెట్టుకు బరువైతే.... చెట్టును భూమి మోస్తుందా..
ఇప్పుడు తప్పులు తెలుసుకొనీ... జరిగేదేమిటనీ..క్షమించదెవ్వరినీ


చరణం 3 :



తెంచుకుంటివి అనుబంధాన్ని... పెంచుకున్నదొక హృదయం దాన్ని..
అమ్మలిద్దరు వుంటారని అనుకోలేని పసివాడ్ని
బలవంతాన తెచ్చుకొని... తల్లివి కాగలవా? ... తనయుడు కాగలడా?


చరణం 4 :



అడ్డ దారిలో వచ్చావమ్మా... అనుకోకుండా కలిసావమ్మ
నెత్తురు పంచి ఇచ్చావూ... నిప్పును నీవే మింగావూ
ఆడదాని ఐశ్వర్యమేమిటో...ఇప్పుడు తెలిసింది..కథ ముగిసేపొయింది
ఇప్పుడు తెలిసింది..కథ ముగిసేపొయింది 


ఓ..బాటసారీ..ఇది జీవిత రహదారీ






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2663

1 comment: