Thursday, July 13, 2017

ఎక్కడి వాడో గాని

చిత్రం :  ఖైదీ బాబాయ్ (1974)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  సుశీల  
 



పల్లవి : 



ఎక్కడి వాడో గాని..చక్కని వాడే
ఎక్కడి వాడో గాని..చక్కని వాడే


ఎక్కడి వాడైతేమి..మక్కువ గలవాడే
ఎక్కడి వాడైతేమి..మక్కువ గలవాడే
నా మది దోచిన..చిన్నవాడే
ఓయమ్మ నా మది దోచిన చిన్నవాడే


ఎక్కడి వాడో గాని.. చక్కని వాడే
ఎక్కడి వాడో గాని.. చక్కని వాడే 



చరణం 1 :



సూరీడు ఉండగానే సుక్కలు  సూస్తాడే
వాడు ఎండలోనే ఎన్నెల పంటలు పండిస్తాడే
సూరీడు ఉండగానే సుక్కలు సూస్తాడే
వాడు ఎండలోనే ఎన్నెల పంటలు పండిస్తాడే
ముళ్ళలోనే జాజిమల్లెలూ..ఊ... ఊ
ముళ్ళలోనే జాజిమల్లెలూ..పూయిస్తాడే
వాడు రాళ్ళలోనే తీయని రాగాలు పలికిస్తాడే
 


ఎక్కడి వాడో గాని..చక్కని వాడే
ఎక్కడి వాడో గాని..చక్కని వాడే 



చరణం 2 :


తాను పల్లకిలో... ఊరేగివస్తుంటే
నేను పెళ్ళి పడుచునై ఎదురు చూస్తుంటే
తాను పల్లకిలో... ఊరేగివస్తుంటే
నేను పెళ్ళి పడుచునై ఎదురు చూస్తుంటే


నేను తొలిరాతిరి మొగ్గనై ముడుచుకుంటే
నేను తొలిరాతిరి మొగ్గనై ముడుచుకుంటే
తాను మొగ్గనే పూవులా మలచుకుంటే
అహాహా..ఓహోహో..మ్మ్ మ్మ్ మ్మ్   


ఎక్కడి వాడో గాని..చక్కని వాడే
ఎక్కడి వాడో గాని..చక్కని వాడే 



చరణం 3 : 


తలచుకుంటేనే ఒళ్ళు నిలవకున్నాదే
వాడు తాకితే ఓయమ్మ ఏమై పోతావో
తలచుకుంటేనే ఒళ్ళు నిలవకున్నాదే
వాడు తాకితే ఓయమ్మ  ఏమై పోతావో

పట్టలేక తీగెలాగ..ఆ... ఆ...
పట్టలేక తీగెలాగ... చుట్టుకుంటాను
తట్టుకోని వేడిలోన కాగిపోతానో... మరి కరిగిపోతానో

 

ఎక్కడి వాడో గాని..చక్కని వాడే
ఎక్కడి వాడైతేమి..మక్కువ గలవాడే
నా మది దోచిన..చిన్నవాడే
ఓయమ్మ...  నా మది దోచిన చిన్నవాడే  






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2026

No comments:

Post a Comment