Thursday, July 13, 2017

ఓరబ్బీ చెబుతాను

చిత్రం :  ఖైదీ బాబాయ్ (1974)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  సినారె
నేపథ్య గానం :  ఘంటసాల, జానకి



పల్లవి :


ఓరబ్బీ చెబుతాను... ఓలమ్మీ చెబుతాను
పండగ పూట ఒక నిండు నిజం చెబుతాను


ఏం చెబుతావు?


వాడు పగవాడు కాడు...  మంచి మగవాడని
వాడు పగవాడు కాడు...  మంచి మగవాడని

ఓరబ్బీ చెబుతాను... ఓలమ్మీ చెబుతాను
పచ్చాని పైరుమీద బాసచేసి చెబుతాను


ఏం చెబుతావు?


ఇది పల్లెకాదు చల్లని రేపల్లెయని
ఇది పల్లెకాదు చల్లని రేపల్లెయని

ఓరబ్బీ చెబుతాను... ఓలమ్మీ చెబుతాను



చరణం 1 :


చెడ్డపనికి ఉంటుంది  చెరసాలశిక్ష
మంచి పనికి ఉంటుంది  మరోరకం శిక్ష
హోయ్...  చెడ్డపనికి ఉంటుంది  చెరసాలశిక్ష
మంచి పనికి ఉంటుంది  మరోరకం శిక్ష


ఈ శిక్ష నీకు వేసి...  మా కక్ష తీర్చుకోంటే
ఈ శిక్ష నీకు వేసి...  మా కక్ష తీర్చుకోంటే
నీవేమంటావు?....    


నాయాల్ది... ఈ శిక్షయే శ్రీరామ రక్షయని
ఈ చెరసాలే మరుజన్మకు ఉండాలని... కోరుకొంటానూ ఇంకేమంటాను


ఓరబ్బీ చెబుతాను... ఓలమ్మీ చెబుతాను



చరణం 2 :



ఈ పల్లె నన్ను మన్నించి తనవాడంటున్నది
ఒక తల్లి మనసు నన్నింక పగవాడనుచున్నది
ఈ పల్లె నన్ను మన్నించి తనవాడంటున్నది
ఒక తల్లి మనసు నన్నింక పగవాడనుచున్నది


ఈ తప్పు ఎవరిదంటే... ఇది తప్పే కాదంటే
ఈ తప్పు ఎవరిదంటే... ఇది తప్పే కాదంటే
నువ్వేమంటావు?
ఓలమ్మో.... ఇది విధిచేతిలోని  వింతవేటయని
దీని తుదిగెలుపు నీదినాది కానేకాదని... అనుకొంటానూ.... ఇంకేమంటానూ



ఓరబ్బీ చెబుతాను... ఓలమ్మీ చెబుతాను
పండగ పూట ఒక నిండు నిజం చెబుతాను


ఏం చెబుతావు?


వాడు పగవాడు కాడు...  ఇంక  మనవాడని
వాడు పగవాడు కాడు...  ఇంక  మనవాడని

ఓరబ్బీ చెబుతాను... ఓలమ్మీ చెబుతాను




No comments:

Post a Comment