Friday, July 14, 2017

సూసిన కొద్దీ నిన్నే

చిత్రం :  ఖైదీ బాబాయ్ (1974)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  సుశీల   




పల్లవి : 



సూసిన కొద్దీ నిన్నే సూడాలని ఉంది
దాచినవన్నీ నీకే ఇవ్వాలని ఉంది


వగలమారి మావా..పగటి సందమావా
వగలమారి మావా..పగటి సందమావా  


సూసిన కొద్దీ నిన్నే సూడాలని ఉంది
దాచినవన్నీ నీకే ఇవ్వాలని ఉంది


వగలమారిమావా..పగటి సందమావా
వగలమారిమావా..పగటి సందమావా    




చరణం 1 :




నీ కండలు తిరిగిన ఒళ్ళు సూసీ..కలవరపడ్డది నా మనసు
నీ కోరమీసం అంచులు సూసీ..గుబగుబలాడెను నా వయసు
నీ కండలు తిరిగిన ఒళ్ళు సూసీ..కలవరపడ్డది నా మనసు
నీ కోరమీసం అంచులు సూసీ..గుబగుబలాడెను నా వయసు


పొద్దంతా..ఊరంతా..నా వంకే సూస్తుంటే
పొద్దంతా..ఊరంతా..నా వంకే సూస్తుంటే
రేతిరంత నీకోసం రెపరెపలాడెను..నా సొగసు


వగలమారిమావా..పగటి సందమావా
వగలమారిమావా..పగటి సందమావా    




చరణం 2 :



పోట్ల గిత్తలాగా నువ్వూ పొలంగట్టున పోతుంటే
ఆ గట్టు మీది గరికనై నీ కాళ్ళనే ముద్దాడనా
పోట్ల గిత్తలాగా నువ్వూ పొలంగట్టున పోతుంటే
ఆ గట్టు మీది గరికనై నీ కాళ్ళనే ముద్దాడనా


మేడిపట్టి నువ్వూ..బీడు దున్నుతుంటే
మేడిపట్టి నువ్వూ..బంజరు బీడు దున్నుతుంటే
ఆ మేడినై నీ చేతిలో వేడెక్కిపోనా


వగలమారిమావా..పగటి సందమావా
వగలమారిమావా..పగటి సందమావా    




చరణం 3 :



నీడలాగా నిన్నే..ఎంటాడుతుంటాను
సుక్కల్లో దాక్కున్నా..పక్కనే ఉంటాను
నీడలాగా నిన్నే..ఎంటాడుతుంటాను
సుక్కల్లో దాక్కున్నా..పక్కనే ఉంటాను
సందె సికటిలోన..సాములోరి గుడికాడ
సంబరాలు సేసుకుందాం..సయ్యాటలాడుకుందాం  



వగలమారిమావా..పగటి సందమావా
వగలమారిమావా..పగటి సందమావా




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2238

No comments:

Post a Comment