Tuesday, December 19, 2017

ఏయ్ బావయ్యా... పిలక బావయ్య

చిత్రం :  పల్లెటూరి బావ (1973)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల 



పల్లవి :


ఏయ్... బావయ్యా... పిలక బావయ్య
నీ చిలకమ్మ పిలిచింది రావయ్యా 
ఏయ్... బావయ్యా... పిలక బావయ్య
నీ చిలకమ్మ పిలిచింది రావయ్యా 
హాట్ గా స్వీట్ గా  ఆడగా.. పాడగా...  రా..  రా.. వా


ఏయ్... బావయ్యా... పిలక బావయ్య
నీ చిలకమ్మ పిలిచింది రావయ్యా


రానా...  రానా...
నువ్వు రమ్మంటే...  రాకుండా వుంటానా ?
నువ్వు వద్దన్నా...  నేనూరుకుంటానా...
నువ్వు వెయ్యమంటే...
చిందు వెయ్యమంటే...  వెయ్యకుండా వుంటానా?  

రమ్మంటే...  రాకుండా వుంటానా ?
నువ్వు వద్దన్నా నేనూరుకుంటానా...   


       

చరణం 1 :



ఓ...బుజ్జిబావా...  అయ్యో నా పిచ్చి బావా
ఓ...బుజ్జిబావా...  అయ్యో నా చిట్టి బావా

రాక్ తెలుసా... షేక్ తెలుసా
రాక్ తెలుసా... షేక్ తెలుసా
రుంబా.. సాంబా... కాంగో.. మాంగో.. గో గో.. బీటు తెలుసా


తైయకు తాధిమి తా
మా కోలాటం ముందు... నీ గో గో ఆట బందు
మా చెక్క భజనముందు... నీ షేకు రాకు తలకిందు


నే డప్పుల డ్యాన్సు చేస్తే... నా పెద్దపులేశం చూస్తే
నే డప్పుల డ్యాన్సు చేస్తే... నా పెద్దపులేశం చూస్తే
నువ్వు బిత్తరపోతావే పిల్లా... చిత్తయి పోతావే



నువ్వు రమ్మంటే...  రాకుండా వుంటానా ?
నువ్వు వద్దన్నా...  నేనూరుకుంటానా... 



చరణం 2 :




ఓ..  బుజ్జిబావ... అయ్యో... నా పిచ్చి బావ
ఇకనైనా కత్తిరించు పిలకజుట్టూ
ఎందుకబ్బా ఇంత నాటు పంచెకట్టూ
ఇకనైనా కత్తిరించు పిలకజుట్టూ
ఎందుకబ్బా ఇంత నాటు పంచెకట్టూ 


సూటు వేసుకో.. షోకు చేసుకో..
యాస మార్చుకో.. ఇంగ్లీషు నేర్చుకో


మా పంచెకట్టులో వున్న సుఖం... మీ ఇరుకు ప్యాంటులో వుంటుందా?
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
మా పంచెకట్టులో వున్న సుఖం... మీ ఇరుకు ప్యాంటులో వుంటుందా?
నా పిలకజుట్టులో వున్న సొంపు... నీ గరిక జుట్టులో వుంటుందా?


ఓ బుల్లెమ్మా... చీరకట్టి... కాటుకబెట్టి
చేమంతులు... నీ సిగలో చుట్టి
చీరకట్టి... కాటుకబెట్టి
చేమంతులు... నీ సిగలో చుట్టి
సిరులు పొంగగా... తెలుగు పడుచుగా... సిగ్గూ  బిడియం నేర్చుకో



నువ్వు రమ్మంటే...  రాకుండా వుంటానా ?
నువ్వు వద్దన్నా నేనూరుకుంటానా...
నువ్వు వెయ్యమంటే...
చిందు వెయ్యమంటే...  వెయ్యకుండా వుంటానా?
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. 






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1699

No comments:

Post a Comment