Wednesday, February 21, 2018

తూలీ సోలెను తూరుపు గాలి




చిత్రం :  అడుగుజాడలు (1966)
సంగీతం :  మాస్టర్ వేణు
గీతరచయిత : శ్రీ శ్రీ
నేపథ్య గానం : ఘంటసాల, బి.వసంత  




పల్లవి :


తూలీ సోలెను తూరుపు గాలి...
తూలీ సోలెను తూరుపు గాలి... గాలివాటులో సాగెను నావ
తూలీ సోలెను తూరుపు గాలి...  గాలివాటులో సాగెను నావ


నావను నడిపే మాలిని నేనే... నావను నడిపే మాలిని నేనే
నన్నే నడిపే దేవత నీవే …


తూలీ సోలెను తూరుపు గాలి
హైలెస్సా....హైలెస్సా....హైలెస్సా....



చరణం 1 :



గాలి విసరి నీ కురులే చేదరీ...  నీలి మబ్బులే గంతులు వేసే
బెదరు పెదవుల నవ్వులు చూసి
బెదరు పెదవుల నవ్వులు చూసి
చిరు కెరటాలే చిందులు వేసే
చిరు కెరటాలే చిందులు వేసే

తూలీ సోలెను తూరుపు గాలి




చరణం 2 :



చెలి కన్నులలో చీకటి చూచీ జాలి జాలిగా కదలెను నావ
చీకటి ముసరిన జీవితమల్లే...
చీకటి ముసరిన జీవితమల్లే
నీ కన్నులతో వెదకెద త్రోవ...
నీ కన్నులతో వెదకెద త్రోవ



తూలీ సోలెను తూరుపు గాలి...  గాలివాటులో సాగెను నావ
నావను నడిపే మాలిని నేనే... నావను నడిపే మాలిని నేనే
నన్నే నడిపే దేవత నీవే...
తూలీ సోలెను తూరుపు గాలి


హైలేసా హైలేసా హైలే హైలేసా...
హైలేసా హైలేసా హైలే హైలేసా





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=604

No comments:

Post a Comment