Friday, February 9, 2018

నిత్య సుమంగళి నీవమ్మా

చిత్రం :  ఆడబ్రతుకు (1965)
సంగీతం :  విశ్వనాథన్ రామమూర్తి
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  సుశీల   



సాకీ :


ప్రేమే నీకు మాంగల్యం అది జన్మజన్మల అనుబంధం
చావు పుట్టుకల కందని బంధం..దానికి లేదు వైధవ్యం
దానికి లేదు వైధవ్యం...



పల్లవి :


నిత్య సుమంగళి నీవమ్మా
నీకు అమంగళమేదమ్మా
నిత్య సుమంగళి నీవమ్మా
నీకు అమంగళమేదమ్మా
ప్రేమకు మృత్యువు లేదమ్మా
పెట్టిన బొట్టూ పోదమ్మా..పెట్టిన బొట్టూ పోదమ్మా 



చరణం 1 :



పది మాసాలు మోసావే... ప్రాణంగా కనిపెంచావే
విడనాడి వెళుతున్నావా... కడసారి లాలించేవా
ఎవరో నిను ముద్దాడేరూ... ఎక్కడ అమ్మాని అడిగేరు
నాన్నను చేరగ పోయెనని... నవ్వుతూ చెప్పరా నా తండ్రి
నవ్వుతూ చెప్పరా నా తండ్రి....



చరణం 2 :



తల్లిని కాను తనయను కాను... ఎవరికి నేను కోడలు కాను
దేవుడు లేక కోవెల లేదు... నా దైవం లేక నే లేను
నా దైవం లేక నే లేను






No comments:

Post a Comment