చిత్రం : గుడిగంటలు (1965)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : నార్ల చిరంజీవి
నేపధ్య గానం : జానకి
పల్లవి :
నీ కనుదోయిని నిద్దురనై...
నీ కనుదోయిని నిద్దురనై... మనసున పూచే శాంతినై
నీ కనుదోయిని నిద్దురనై... మనసున పూచే శాంతినై
యడబాయని నీడగా తోడవుతా... నీ కలలకు నేనే జోడవుతా ...
నీ కనుదోయిని నిద్దురనై... మనసున పూచే శాంతినై
చరణం 1 :
నీ కలలన్నీ నావోయి... నా యవ్వన రాగం నీదోయి
వలపుల గుడిలో గంటలు మ్రోగే
జంటగరమ్మని పిలిచాయి... ఇరువునీ పిలిచాయి
నీ కనుదోయిని నిద్దురనై... మనసున పూచే శాంతినై
చరణం 2 :
కాటుక కళ్లే కానుకగా... నా బుగ్గలసిగ్గే హారతిగా
హృదయము నీకె అంకితమోసగే
నీ బిగికౌగిలి చేరెదను... ఒరిగెదను... కరిగెదను...
నీ కనుదోయిని నిధ్ధురనై... మనసున పూచే శాంతినై
యెడబాయని నీడగ తోడవుతా... నీ కలలకు నేనే జోడవుతా
ఆహాహాహాహ ఆహాహ హాహాహహ ఆ ఆహాహహా ....
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=71
సరిచూడగలరు.
ReplyDeleteచరణం 1 :
.....
.....
జంటగరమ్మని ...
corrected mahesh gaaru!!
Delete