చిత్రం : అల్లరి ప్రియుడు (1993) సంగీతం : కీరవాణి గీతరచయిత : వెన్నెలకంటి నేపథ్య గానం : బాలు, చిత్ర
పల్లవి :
ప్రణయమా నీ పేరేమిటి ... ప్రళయమా ప్రణయమా నీ పేరేమిటి... ప్రళయమా గమ్యం తెలియని పయనమా ప్రేమకు పట్టిన గ్రహణమా తెలుపుమా తెలుపుమా.. తెలుపుమా
ప్రణయమా నీపేరేమిటి... ప్రళయమా
చరణం 1 :
ప్రేమ కవితా గానమా... నా ప్రాణమున్నది శ్రుతి లేక గేయమే ఎద గాయమైనది... వలపు చితిని రగిలించగా తీగచాటున రాగమా... ఈ దేహమున్నది జత లేక దాహమారని స్నేహమై... ఎద శిథిల శిశిరమై మారగా
ఓ హృదయమా... ఇది సాధ్యమా... రెండుగ గుండే చీలునా... ఇంకా ఎందుకు శోధన రెండుగ గుండే చీలునా... ఇంకా ఎందుకు శోధన
తెలుపుమా తెలుపుమా తెలుపుమా ప్రణయమా నీ పేరేమిటి... ప్రళయమా
చరణం 2 :
ప్రేమసాగర మధనమే... జరిగింది గుండెలో ఈ వేళ రాగమన్నది త్యాగమైనది... చివరికెవరికీ అమృతం తీరమెరుగని కెరటమై... చెలరేగు మనసులో ఈ వేళ అశ్రుధారలే అక్షరాలుగా... అనువదించెనా జీవితం
ఓ ప్రాణమా... ఇది న్యాయమా రాగం అంటే త్యాగమా... వలపుకు ఫలితం శూన్యమా రాగం అంటే త్యాగమా... వలపుకు ఫలితం శూన్యమా
తెలుపుమా తెలుపుమా తెలుపుమా ప్రణయమా నీ పేరేమిటి... ప్రళయమా ప్రణయమా నీ పేరేమిటి... ప్రళయమా
No comments:
Post a Comment