స్వరాల పల్లకి
Guest Book
[Sign My Guestbook]
[View My Guestbook]
Powered by E-Guestbooks Server
.
Tuesday, January 1, 2019
ఏరుపక్క..మావూరమ్మ
చిత్రం : మల్లెమొగ్గలు (1986)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, జానకి
పల్లవి :
ఆఆఆఆఆ..ఆఆఆఅ..ఆఆఅ ఆ
అ ఆ ఆ ఆ ఆ ఆఆఆఆ..ఆ ఆ ఆ అ
ఏరుపక్క మావూరమ్మ... ఊరుపక్క మాగాణమ్మ
ఏరుపక్క మావూరమ్మ... ఊరుపక్క మాగాణమ్మ
ఏరు కాళింది ఊరు వ్రేపల్లె
ఏరు కాళింది ఊరు వ్రేపల్లె
వేణువందుకే.... మోగిందమ్మ
వెన్నదాచకే... కన్నె గోపెమ్మ
వెన్నదాచకే... కన్నె గోపెమ్మ
ఏరుపక్క మావూరమ్మ... ఊరుపక్క మాగాణమ్మ
ఏరుపక్క మావూరమ్మ... ఊరుపక్క మాగాణమ్మ
చరణం 1 :
మువ్వగోపాలా... రారా అంటూ
మువ్వగోపాలా... రారా అంటూ
మువ్వ మువ్వకీ... పిలుపేనమ్మ
ముద్దు గోవిందా....రా రమ్మంటూ
ముగ్గు ముగ్గునా... కవితేనమ్మ
జారు పైటలా.... జావళి వింటే
జాను తెనుగులే... పండేనమ్మ
జాను తెనుగులే... పండేనమ్మ
ఏరుపక్క మావూరమ్మ... ఊరుపక్క మాగాణమ్మ
ఏరుపక్క మావూరమ్మ... ఊరుపక్క మాగాణమ్మ
చరణం 2 :
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సువ్వి గోపాలా... సువ్వి అంటూ
సువ్వి గోపాలా... సువ్వి అంటూ
పాలపొంగులే... పలికేనమ్మ
గుమ్మడెక్కడే... గుమ్మాఅంటూ
చల్ల చిందులే... సణిగేనమ్మ
కొమ్మ కొమ్మకీ కొత్త పల్లవి... కోకిలమ్మలే పాడేనమ్మ
కోకిలమ్మలే... పాడేనమ్మ
ఏరుపక్క మావూరమ్మ... ఊరుపక్క మాగాణమ్మ
ఏరుపక్క మావూరమ్మ... ఊరుపక్క మాగాణమ్మ
ఏరు కాళింది ఊరు వ్రేపల్లె
ఏరు కాళింది ఊరు వ్రేపల్లె
వేణువందుకే.... మోగిందమ్మ
వెన్నదాచకే... కన్నె గోపెమ్మ
వెన్నదాచకే... కన్నె గోపెమ్మ
ఏరుపక్క మావూరమ్మ... ఊరుపక్క మాగాణమ్మ
ఏరుపక్క మావూరమ్మ... ఊరుపక్క మాగాణమ్మ
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment