Tuesday, January 1, 2019

వచ్చిందమ్మా దోర దోర వయసు

చిత్రం :  కన్నతల్లి  (1972)

సంగీతం :  కె. వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం :  సుశీల,   జె.వి. రాఘవులు

పల్లవి :


వచ్చిందమ్మా దోర దోర వయసు
తెచ్చిందమ్మా కొత్తకొత్త సొగసు
ఏదో తిక్కతిక్కగా వుంది...
లోపల తికమక పెడుతూ వుంది....
వచ్చిందమ్మా దోర దోర వయసు
తెచ్చిందమ్మా కొత్తకొత్త సొగసు
ఏదో తిక్కతిక్కగా వుంది
లోపల తికమక పెడుతూ వుంది.... 



చరణం 1 :


నిమిషంసేపు మనసొకచోట నిలవనంటుందీ
నిన్ననచ్చినది నేడుపాతదై చప్పగవుంటుందీ
నిమిషంసేపు మనసొకచోట నిలవనంటుందీ
నిన్ననచ్చినది నేడుపాతదై చప్పగవుంటుందీ


అల్లరల్లరిగ తిరగాలంటే సరదాగుంటుందీ
హద్దులన్నా పెద్దలన్న కోపంవస్తుందీ
పైట నిలవదూ...  పక్క కుదరదూ
పగలు తరగదూ...  రాత్రి గడవదూ
ఏదో గుబులుగుబులుగా వుందీ
ఎదలో గుబగుబమంటుందీ


వచ్చిందమ్మా దోర దోర వయసు
తెచ్చిందమ్మా కొత్తకొత్త సొగసు
ఏదో తిక్కతిక్కగా వుంది
లోపల తికమక పెడుతూ వుంది.... 



చరణం 2 :


ఒంటరిగా నువు వున్నావంటె అలాగే వుంటుందీ
జంట కుదిరితే ఆ తిక్కే ఎంతో తీయనవుతుందీ
ఒంటరిగా నువు వున్నావంటె అలాగే వుంటుందీ
జంట కుదిరితే ఆ తిక్కే ఎంతో తీయనవుతుందీ


కళ్ళుకలిస్తే గుండె ఎందుకో ఝల్లుమంటుందీ
నీ కౌగిలిలోనా కన్నెతనం కరిగేపోతుందీ
నినుమెచ్చాను మనసిచ్చాను
నిలువున దోచి నీకే యిచ్చాను
ఏదో హాయిహాయిగా వుందీ
ఎక్కడికో తేలితేలి పోతుందీ
హాయిహాయిగా... వుందీ
తేలితేలి....పోతుందీ


వచ్చిందమ్మా దోరదోర వయసు
తెచ్చిందమ్మా కొత్తకొత్త సొగసు
పెద్దలులేక హద్దులు తెలియక
చిందరవందర అయింది బ్రతుకు
అమ్మా... అమ్మా... అమ్మా

No comments:

Post a Comment