Saturday, January 12, 2019

గులాబీల తావులీనే

చిత్రం :  చరణదాసి (1956)
సంగీతం : ఎస్.రాజేశ్వర రావు
గీతరచయిత :  సముద్రాల (సీ)
నేపథ్య గానం :  ఘంటసాల, లీల 



పల్లవి :


ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..


గులాబీల తావులీనే కులాసాల జీవితాల
విలాసాలివే... వికాసాలివే
ఇదే ప్రేమ జీవితాల వరాలౌను ప్రేయసి
గులాబీల తావులీనే కులాసాల జీవితాల
విలాసాలివే... వికాసాలివే


ఇదే ప్రేమ జీవితాల వరాలౌను ప్రేయసి
మానస సీమల... మాయని ప్రేమల
మాధురులెపుడూ మారవుగా


మారవులే... మారవులే... ప్రమాణముగా...
మారవులే... ప్రమాణముగా
జీవన తారవు దేవివి నీవే
జీవన తారవు దేవివి నీవే


గులాబీల తావులీనే...  కులాసాల జీవితాల
మనజాలినా... అదే చాలులే
ఇదే ప్రేమ జీవితాల...  వరించే వరాలుగా
ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఆ.. ఆ.. ఆ.. ఆ..  

No comments:

Post a Comment