Tuesday, January 8, 2019

మందర మాట విని

చిత్రం : కలసి వుంటే కలదు సుఖం (1961)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : కొసరాజు
నేపథ్య గానం :  ఘంటసాల, సుశీల

పల్లవి :

మందర  మాట విని...  మౌడ్యమున కైకేయి రామలక్ష్మణులను అడవికి పంపే కదా
శకుని మాయలు నమ్మి జూదమున ఓడించి... కౌరవులు పాండవుల కష్ట పెట్టిరిగా
పరుల బోధలు  లొంగి పండు వంటి సంసారాన్ని... భాగాలుగా చీల్చి పంచుచుండిరి కదా

కలిసి వుంటే కలదు సుఖం... వేరు పడితే తీరని దుఖం
చెడు బోధలు  విన్నారంటే... ఎవరికైన తప్పదు కష్టం

కలిసి వుంటే కలదు సుఖం... వేరు పడితే తీరని దుఖం
చెడు బోధలు  విన్నారంటే... ఎవరికైన తప్పదు కష్టం

రణం 1 :

చిట్టి చీమలన్నీ మూగి...  పెద్దపుట్ట పెట్టునురా
చిట్టి చీమలన్నీ మూగి...  పెద్దపుట్ట పెట్టునురా
శిల్పులంతా కట్టుగా వుండే...  తాజ్ మహలు కట్టిరిరా

జనులెందరో త్యాగము చేసి స్వరాజ్యము తెచ్చిరిరా
తగవులతో తన్నుక చస్తే పతనము ప్రాప్తించునురా 

కలిసి వుంటే కలదు సుఖం... వేరు పడితే తీరని దుఖం

చరణం 2 :

పది కట్టెలు ఒక్కటిగా వుంటే పట్టి విరువ లేరురా
పది కట్టెలు ఒక్కటిగా వుంటే పట్టి విరువ లేరురా
ఒక కట్టెగా ఉంటేనే వికలము చేసేరురా

కర్ణుడొకడు చేరక పోతే భారతమే పూజ్యము రా
యాదవులే ఒక్కటిగా ఉంటే నాశనమై ఉండరు రా

కలిసి వుంటే కలదు సుఖం... వేరు పడితే తీరని దుఖం
కలిసి వుంటే కలదు సుఖం... వేరు పడితే తీరని దుఖం

http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=620

No comments:

Post a Comment