Saturday, July 25, 2020

చీకటిపడితే నాకెంతో భయం

చిత్రం : దేవుడున్నాడు జాగ్రత్త (1978)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత :
నేపథ్య గానం :  జానకి 



పల్లవి : 


చీకటిపడితే నాకెంతో భయం భయం
చెట్టాపట్టా లేస్కుంటే నయం నయం
చీకటిపడితే నాకెంతో భయం భయం


ఓ.. ఓ.. ఓ...
నీకోసం వచ్చాను... నిన్ను నమ్ముకొన్నాను
ఈ రాతిరి చేయకురా...  చేయకురా అన్యాయం


చీకటిపడితే నాకెంతో భయం భయం


చరణం 1 :


మిన్నులో ఒక చుక్క... గిన్నెలో ఒకచుక్క
అన్నింటిని మించినది పక్కన చుక్క


పక్కన నేనుంటే దిక్కులు చూస్తావా
పక్కన నేనుంటే దిక్కులు చూస్తావా
నీ టెక్కంత నాముందే వెలిగిస్తావా


చీకటిపడితే నాకెంతో భయం భయం




చరణం 2 :



ఏమితెలియని నాలో ఏదో గుబులవుతుంది
ఎన్నోఎన్నో తెలిసినోడా ఎందుకు బెట్టు


ముద్దొచ్చే నిన్ను చూసి నిద్దర రానంది
ముద్దొచ్చే నిన్ను చూసి నిద్దర రానంది
నువ్వు అలా ఇలా కులికితే అల్లరిపాలావుతా... అమ్మో...


చీకటిపడితే నాకెంతో భయం భయం



No comments:

Post a Comment