Showing posts with label దేవుడున్నాడు జాగ్రత్త (1978). Show all posts
Showing posts with label దేవుడున్నాడు జాగ్రత్త (1978). Show all posts
Saturday, July 25, 2020
చీకటిపడితే నాకెంతో భయం
చిత్రం : దేవుడున్నాడు జాగ్రత్త (1978)
చీకటిపడితే నాకెంతో భయం భయం
మిన్నులో ఒక చుక్క... గిన్నెలో ఒకచుక్క
ఏమితెలియని నాలో ఏదో గుబులవుతుంది
మేనుమేను తాకగానే
చిత్రం : దేవుడున్నాడు జాగ్రత్త (1978)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత :
నేపథ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
మేనుమేను తాకగానే ఏదో పులకింత
నేను నీవు లీనమైతే ఏదో చిగురింత
మేనుమేను తాకగానే ఏదో పులకింత
నేను నీవు లీనమైతే ఏదో చిగురింత
చరణం 1 :
యుగయుగాల అనుబంధం ఒక్కసారి మెరిసింది
పొగమంచు మేఘాల... పూలవాన కురిసింది
యుగయుగాల అనుబంధం ఒక్కసారి మెరిసింది
పొగమంచు మేఘాల పూలవాన కురిసింది
హృదయంలో సాగింది ఊహల ఊరేగింపు
హృదయంలో సాగింది ఊహల ఊరేగింపు
పన్నీటి వాగులలో ఈదెను తొలివలపు
ఈదెను తొలివలపు
మేనుమేను తాకగానే ఏదో పులకింత
నేను నీవు లీనమైతే ఏదో చిగురింత
చరణం 2 :
గుండెలలో అనురాగపు కోవెలనే మలచాను
నిండుమనసుతో నిన్నేఅందులోనే నిలిపాను
కోటి కోటి దేవతలే కోరి ఇచ్చే దీవెనలు
ఎడబాటులేని ప్రేమలో ఎన్ని మధురభావనలు... ఎన్ని మధురభావనలు
మేనుమేను... తాకగానే... ఏదో పులకింత
నేను నీవు... లీనమైతే
ఏదో... ఏదో చిగురింత
అందం చూడాలి
చిత్రం : దేవుడున్నాడు జాగ్రత్త (1978)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత :
నేపథ్య గానం : సుశీల
పల్లవి :
అందం చూడాలి... ఆనందం పొందాలి
అందం చూడాలి...
ఆడే పాడే వయసులోనే అనుభవించాలి... అనుభవించాలి
అందం చూడాలి...
అందం చూడాలి... ఆనందం పొందాలి
అందం చూడాలి...
చరణం 1 :
ఉరకల పరుగుల దూకే వయసు...ఎవరు ఆపిన ఆగదు
ఎవరు ఆపిన ఆగదు
పడుచుదనానికి పగ్గం వేయకు... నీలో ఆశలు దాచకు
నీలో ఆశలు దాచకు
నీవు కోరేది నేడు తీరాలి... కోరేది తీరాలి తీరాలి కోరేది
అందం చూడాలి... ఆనందం పొందాలి
అందం చూడాలి...
చరణం 2 :
యవ్వనమన్నది ఎంతో మైకం
యవ్వనమన్నది ఎంతో మైకం...
పోతే తిరిగిరాదురా... పోతే తిరిగిరాదురా
నీకై వచ్చినదెవరో చూడు ఆలసించక లేవరా
ఆలసించక లేవరా
మధువు తాగాలి కథలు మారాలి
తాగాలి మారాలి మారాలి తాగాలి
అందం చూడాలి... ఆనందం పొందాలి
అందం చూడాలి...
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5546
Friday, July 24, 2020
ఎగిరెగిరి పడుతోంది
చిత్రం : దేవుడున్నాడు జాగ్రత్త (1978)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత :
నేపథ్య గానం : సుశీల
పల్లవి :
ఎగిరెగిరి పడుతోంది నా సొగసు
ఎప్పుడెప్పుడంటోంది నా మనసు
జంట కుదిరాక పంట పండాలి
జంటకుదిరాక పంట పండాలి
ఒంటరిగా ఉండలేదు నావయసు
ఒంటరిగా ఉండలేదు నా వయసు
ఎగిరెగిరి పడుతోంది నా సొగసు
ఎప్పుడెప్పుడంటోంది నా మనసు
చరణం 1 :
పెళ్లిమాట నాపెదవి దాటింది
చల్లగాలి అడివంతా చాటింది
కోయిలమ్మ... సన్నాయి
కోయిలమ్మ సన్నాయి మొదలెట్టేను
కోతి బావ తైతక్కాలాడేను
నా కోతి బావ తైతక్కాలాడేను
ఎగిరెగిరి పడుతోంది నా సొగసు
ఎప్పుడెప్పుడంటోంది నా మనసు
చరణం 2 :
నన్ను చూసి నా బావ పొంగుతాడు
నా చేతుల్లో తరవాత లొంగుతాడు
ఆగలేక... ఒడిలోనే
ఆగలేక ఒడిలోనే వాలుతాను
మబ్బంచు హాయిలోనే తేలుతాను
నే మబ్బంచు హాయిలోనే తేలుతాను
ఎగిరెగిరి పడుతోంది నా సొగసు
ఎప్పుడెప్పుడంటోంది నా మనసు
Subscribe to:
Posts (Atom)