Showing posts with label దాశరథి. Show all posts
Showing posts with label దాశరథి. Show all posts
Tuesday, July 28, 2020
పువ్వులో గువ్వలో
చిత్రం : ఇద్దరు అమ్మాయిలు (1970)
అమ్మా...
పువ్వులో గువ్వలో వాగులో తీగలో
కొమ్మ కొమ్మ పై కుసుమంలో కమ్మని తేనెవు నీవే.. నీవే
అంతట నీవేనమ్మా... అన్నిట నీవేనమ్మ
సీతకోకచిలుకలతో చేరి వసంతాలాడేను
అంతట నీవేనమ్మా... అన్నిట నీవేనమ్మ
నీ చల్లని నీడే నా ఇల్లు
అంతట నీవేనమ్మా... అన్నిట నీవేనమ్మ
Thursday, June 25, 2020
చిలిపికనుల చిన్నదానా
చిత్రం : మంచి రోజు (1970)
సంగీతం : ఎం.బి.శ్రీరాం
గీతరచయిత : దాశరథి
నేపథ్య గానం : రామకృష్ణ, సుశీల
పల్లవి :
చిలిపికనుల చిన్నదానా సిగ్గు నీకెందుకే
చిలిపికనుల చిన్నవాడా... సిగ్గు నీవల్లనే
బిడియపడిన లేత వలపు... బిగువు వీడిందిలే
చిలిపికనుల చిన్నదానా సిగ్గు నీకెందుకే
చిలిపికనుల చిన్నవాడా... సిగ్గు నీవల్లనే
చరణం 1 :
చల్లనివేళల లోలోన దాగని తాపాలు
వెచ్చనికౌగిట ఏవేవో తియ్యని సౌఖ్యాలు
మేను మేను మేళవించి లీనమవుదాములే
చిలిపికనుల చిన్నదానా సిగ్గు నీకెందుకే
చిలిపికనుల చిన్నవాడా... సిగ్గు నీవల్లనే
చరణం 2 :
మధుమయ ప్రణయం మోహాల దాహం తీర్చాలి
వలపుల సంకెల కలకాల బంధము కావాలి
కమ్మనైనా సుఖములోన కరిగిపోవాలిలే
చిలిపికనుల చిన్నదానా సిగ్గు నీకెందుకే
చిలిపికనుల చిన్నవాడా... సిగ్గు నీవల్లనే
బిడియపడిన లేత వలపు... బిగువు వీడిందిలే
Wednesday, June 24, 2020
నీకోసమని నే వేచినానే
చిత్రం : మంచి రోజు (1970)
సంగీతం : ఎం.బి.శ్రీరాం
గీతరచయిత : దాశరథి
నేపథ్య గానం : పి. బి. శ్రీనివాస్
పల్లవి :
నీకోసమని నే వేచినానే
ఉరింపులు ఇక చాలునే
ఈ బిగువేలనే నా మాటవిని
మోముగని పులకించని... నీ మోముగని పులకించని
నీకోసమని నే వేచినానే
ఉరింపులు ఇక చాలునే
చరణం 1 :
నీ కనుపాపలలో నా రూపం
ఈ కోపము మాని నను చూడని
నీ నవ్వులు కురిసే వెన్నెలలో
మధుపానము చేసి ననుపాడని
నీకోసమని నే వేచినానే
ఉరింపులు ఇక చాలునే
చరణం 2 :
అనురాగసుమాలే వెదజల్లి
నీ బ్రతుకుబాటలో పయనించని
మన మనసులు రెండు ముడివేసి
బిగికౌగిలి గదిలో శయనించని
నీకోసమని నే వేచినానే
ఉరింపులు ఇక చాలునే
ఈ బిగువేలనే నా మాటవిని
మోముగని పులకించని... నీ మోముగని పులకించని
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4672
Saturday, June 13, 2020
అమ్మలారా... ఓ అయ్యలారా
చిత్రం : భలే పాప (1971)
సంగీతం : ఆర్. సుదర్శనం
గీతరచయిత : దాశరథి
నేపథ్య గానం : సుశీల
పల్లవి :
అమ్మలారా... ఓ అయ్యలారా...
అమ్మలారా... ఓ అయ్యలారా...
మా అమ్మనెవరైనా చూశారా... ... చూశారా
అమ్మలారా ఓ అయ్యలారా...
మా అమ్మనెవరైనా చూశారా... చూశారా
చరణం 1 :
లాలలు పోసి... జోలలు పాడి
పాలబువ్వ తినిపించే మా అమ్మా
నాన్న వస్తాడన్నాది... ముద్దులు ఇస్తాడన్నాది
ఒక మాటైన చెప్పకా మాయమైపోయింది
అమ్మలారా... ఓ అయ్యలారా...
మా అమ్మనెవరైనా చూశారా...చూశారా
చరణం 2 :
ఓ బుజ్జి తువ్వాయి... నీకుంది అమ్మా
ఓ గువ్వ పాపాయి... నీకుంది అమ్మా
ఓ బుజ్జి తువ్వాయి... నీకుంది అమ్మా
ఓ గువ్వ పాపాయి... నీకుంది అమ్మా
ఓ బొజ్జ గణపయ్య... నీకూ అమ్ముంది
ఓ బొజ్జ గణపయ్య... నీకూ అమ్ముంది
మీ అమ్మనడగవా... మా అమ్మ ఏదని
అమ్మలారా... ఓ అయ్యలారా...
మా అమ్మనెవరైనా చూశారా...చూశారా
అందాల జలపాతం
చిత్రం : భలే పాప (1971)
సంగీతం : ఆర్. సుదర్శనం
గీతరచయిత : దాశరథి
నేపథ్య గానం : సుశీల
పల్లవి :
అందాల జలపాతం చిందించు జల్లులలో
ఆనాడు ఒంటరిగా జలకాలాడానూ.. పులకించిపోయానూ
పొంగారు యెదమీది కొంగునే తీసానూ...
చాటుగా గమనించే కళ్ళనే చూసానూ
నా ఒళ్ళు జల్లనగా నన్ను నే మరిచానూ
అందాల జలపాతం చిందించు జల్లులలో
ఆనాడు ఒంటరిగా జలకాలాడానూ... పులకించిపోయానూ
చరణం 1 :
శ్రీదేవి కోవెలలో సిందూర తిలకమునే...
శ్రీదేవి కోవెలలో సిందూర తిలకమునే...
దీపాల కాంతులలో దిద్దుకొను సమయానా
ఆ కళ్ళే చూశానూ... ఆశలో తేలానూ
ఆ కళ్ళే చూశానూ... ఆశలో తేలానూ
మోజుతో రతనాలా గాజులే కొనువేళా
చేతిలో చైవేసీ చెంతకే చేరాడు
అమ్మమ్మ నా మేనూ చెమ్మగిల్లి పోయిందీ
ఓయమ్మొ నా వయసూ ఉరకలే వేసిందీ
చరణం 2 :
సిరిమల్లె పూలన్నీ చేజారిపొయాయి
పరుగులే తీశాయి పాదాల వాలాయి
మా కళ్ళు కలిశాయి మనసులే విరిశాయి
చిక్కని చీకటిలో . .....
చిక్కని చీకటిలో... చుక్కల్ల వెలుగులలో
చెక్కిళ్ళు ఏకమై మక్కువలు పెరిగాయీ
నా స్వామి కౌగిలిలో నే కరిగిపోయాను
నన్ను నే కానుకగా అర్పించుకున్నాను
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7271
Thursday, May 28, 2020
వారానికి ఏడు రోజులు
చిత్రం : ఆడంబరాలు-అనుబంధాలు (1974)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : దాశరథి
నేపథ్య గానం : సుశీల, బాలు
పల్లవి :
ఆషాడమాసానా... ఆకాశతీరాన
అడుగులో అడుగిడి... అంతలో తడబడి
నీలాల ఓ..మేఘమాలికా
వారానికి ఏడు రోజులు ఎందుకనీ
రోజుకు ఇన్నిఝాములు ఎందుకనీ
చెప్పవే చెప్పవే... చెప్పవే..
నా మాట...మావారితో
చెప్పవే.. నా మాట మావారితో
వేరెవ్వరూ లేని..వేళలో..ఆ వేళలో..
చెప్పవే.. . నా మాట నా చెలియతో
వేరెవ్వరూ లేని..వేళలో..ఆ వేళలో..
చెప్పవే నామాట..నా చెలియతో..ఓ.. ఓ
చరణం 1 :
మగత నిదురలో నేనుంటే
నా మదిలో మెదిలేది తానేననీ
మగత నిదురలో నేనుంటే
నామదిలో మెదిలేది తానేననీ
కలవరపడి నే నెటు చూసినా
కలకల నవ్వేది తానేననీ
కొలిచే దేవుని రూపంలో.. నిలిచే దేవుడు తానేననీ..
చెప్పవే చెప్పవే..నామాట మావారితో..
చరణం 2 :
మల్లెలోనీ తెల్లదనం... తన మనసులోనే చూశాననీ
మల్లెలోనీ తెల్లదనం... తన మనసులోనే చూశాననీ
ఆ మనసులోనీ మంచితనం... తన కనులలోనే చూశాననీ
అందానికీ అనురాగానికీ...
అందానికీ అనురాగానికీ... అవధులు తనలోనే చూశాననీ..
చెప్పవే చెప్పవే చెప్పవే నామాట..నా చెలియతో
వేరెవ్వరూ లేని వేళలో... ఆ వేళలో
చెప్పవే నామాట మావారితో..
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3130
ఏనాటి వరమో...
చిత్రం : ఆడంబరాలు-అనుబంధాలు (1974)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : దాశరథి
నేపథ్య గానం : సుశీల
పల్లవి :
ఏనాటి వరమో... ఏ నోము ఫలమో
ఎనలేని ప్రేమా... విడలేని మమతా
ఎనలేని ప్రేమా... విడలేని మమతా
విలసిల్లు ఇల్లే... మన స్వర్గసీమా
ఏనాటి వరమో... ఏ నోము ఫలమో
ఓ.. ఓ... ఓ..
చరణం 1 :
అనురాగ ఫలితం అందాలపాప
చిందించు నవ్వే ముత్యాలమూట..
అనురాగ ఫలితం అందాలపాప
చిందించు నవ్వే ముత్యాలమూట..
వలపుల పంట... వజ్రాల జంట
వలపుల పంట... వజ్రాల జంట
మా ముద్దు పాపలే... ఇద్దరి నయనాలు..
ఇద్దరి నయనాలు..
ఏనాటి వరమో... ఏ నోము ఫలమో..
చరణం 2 :
పెనవేసుకొన్నా అనురాగ లతలు
చిగురించి విరబూసి అలరారు వేళా
పెనవేసుకొన్నా అనురాగలతలు
చిగురించి విరబూసి అలరారువేళా
కలలన్ని నిజమై కనిపించు నాడు
ధన్యమై నిలిచేను మనజీవితాలూ..మన జీవితాలూ..
ఏనాటి వరమో... ఏ నోము ఫలమో
ఎనలేని ప్రేమా... విడలేని మమతా
విలసిల్లు ఇల్లే... మన స్వర్గసీమా
ఏనాటి వరమో... ఏ నోము ఫలమో..
నీ రూపం హృదయంలో
చిత్రం : ఆడంబరాలు-అనుబంధాలు (1974)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : దాశరథి
నేపథ్య గానం : సుశీల
పల్లవి :
నీ రూపం హృదయంలో నిరతము నిలిపేనా
నీ రూపం హృదయంలో నిరతము నిలిపేనా
నీ నామం కలకాలం..వీణపై మీటనా... ప్రభూ
నీ రూపం హృదయంలో నిరతము నిలిపేనా
చరణం 1 :
ఆలయశిఖరంపై..అదిగో..ఓ.. ఓ.. ఆశల తొలి కిరణం
ఆలయశిఖరంపై..అదిగో..ఓ.. ఓ.. ఆశల తొలి కిరణం
విరిసిన కన్నులలో....ఓ.. ఓ.. మెరిసెను నీ చరణం
విరిసిన కన్నులలో....ఓ.. ఓ.. మెరిసెనునీ చరణం
నీ నామం కలకాలం... వీణపై మీటనా.. ఆ.. ఆ... ఆ
నీ రూపం హృదయంలో..నిరతము నిలిపేనా..ఆఆఆ
చరణం 2 :
నీ గుడివాకిటిలో..స్వామీ..ఈ.. ఈ.. నిలుచుటే భాగ్యమురా..
నీ గుడివాకిటిలో..స్వామీ..ఈ.. ఈ.. నిలుచుటే భాగ్యమురా..
నీ పద సన్నిధిలో..ఓ.. ఓ..బ్రతుకే కానుకరా
నీ పద సన్నిధిలో..ఓ.. ఓ..బ్రతుకే కానుకరా
నీ నామం కలకాలం... వీణపై మీటనా.. ఆ.. ఆ... ఆ
నీ రూపం హృదయంలో..నిరతము నిలిపేనా..ఆఆఆ
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3128
Wednesday, May 20, 2020
నీపైన నాకెంతో
చిత్రం : అభిమానవతి (1975)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : దాశరథి
నేపథ్య గానం : బాలు
పల్లవి :
నీపైన నాకెంతో అనురాగముందని...
నీపైన నాకెంతో అనురాగముందని...
నిను వీడి క్షణమైన నేనుండలేనని...
ఎలా.. ఎలా.. నీకెలా తెలిపేది
ఎలా.. ఎలా.. నీకెలా తెలిపేది
చరణం 1 :
నీలినింగిలో కోటి తారలు మాలలల్లి తేనా
అందమైన ఆ చందమామ నీ కురుల తురమవలెనా
నీలినింగిలో కోటి తారలు మాలలల్లి తేనా
అందమైన ఆ చందమామ నీ కురుల తురమవలెనా
అణువణువున నీవే వ్యాపించినావని...
అణువణువున నీవే వ్యాపించినావని...
ఎలా.. ఎలా.. నీకెలా తెలిపేది
నీపైన నాకెంతో అనురాగముందని...
నిను వీడి క్షణమైన నేనుండలేనని...
ఎలా.. ఎలా.. నీకెలా తెలిపేది
చరణం 2 :
వలపు తెలియనీ మనసులోనికి ఎందుకోసమని వచ్చావు
మనసు దోచుకొని మమత పంచుకొని మరలివెళ్ళిపోతున్నావు
వలపు తెలియనీ మనసులోనికి ఎందుకోసమని వచ్చావు
మనసు దోచుకొని మమత పంచుకొని మరలివెళ్ళిపోతున్నావు
నిన్నే హృదయాన నిలిపాను నేనని...
నిన్నే హృదయాన నిలిపాను నేనని...
ఎలా.. ఎలా.. నీకెలా తెలిపేది
నీపైన నాకెంతో అనురాగముందని...
నిను వీడి క్షణమైన నేనుండలేనని...
ఎలా.. ఎలా.. నీకెలా తెలిపేది
ఎలా.. ఎలా.. నీకెలా తెలిపేది
Thursday, May 7, 2020
ముత్యాల ఏటిలో
చిత్రం : పగడాల పడవ (1979)
సంగీతం : ఘంటసాల విజయ్ కుమార్
గీతరచయిత : దాశరథి
నేపథ్య గానం : సుశీల
పల్లవి :
ముత్యాల ఏటిలో పగడాల పడవా
ముత్యాల ఏటిలో పగడాల పడవా
పగడాల పడవలో బంగారు పిల్లా...
ఆ పిల్ల పాడింది అందాల పాట
ఆ పాట పలికింది అందరి నోటా
ముత్యాల ఏటిలో పగడాల పడవా... పగడాల పడవా
చరణం 1 :
పొంగింది వయసు దూకింది మనసు... ఏదో కోరిక ఉంది
ఈ లేత సొగసు దోచేటి రాజు కావాలంటూ ఉంది
పొంగింది వయసు దూకింది మనసు... ఏదో కోరిక ఉంది
ఈ లేత సొగసు దోచేటి రాజు కావాలంటూ ఉంది
ఈ ఒంటిదాన్ని ఏ కొంటెగాడో కవ్వించాలని ఉంది
సుడిగాలిలాగా సెలయేటిలాగా పరిగెట్టాలని ఉంది
ముత్యాల ఏటిలో పగడాల పడవా... పగడాల పడవా
చరణం 2 :
ఈ తోట నాది... ఈ బాట నాది... ఈ లోకం నాదేలే
ఈ పూలు నావి... ఆ పళ్ళు నావి... ఈ అందం నాదేలే
ఈ తోట నాది... ఈ బాట నాది... ఈ లోకం నాదేలే
పూలన్నీ నావి... పళ్ళన్నీ నావి... అందాలు నావేలే
రివ్వున ఎగిరే ఆ గువ్వతోటి పోటీ చేసేను
కౌగిలిలోనా ఉయ్యాలలూగి కరిగించేసేను... నే కరిగించేసేను
ముత్యాల ఏటిలో పగడాల పడవా
పగడాల పడవలో బంగారు పిల్లా...
ముత్యాల ఏటిలో పగడాల పడవా... పగడాల పడవా
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7371
Tuesday, January 1, 2019
జాజిరి జాజిరి జక్కల మామా
చిత్రం : బంగారు గాజులు (1968)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత :
నేపథ్య గానం : ఎల్. ఆర్. ఈశ్వరి
పల్లవి :
జాజిరి జాజిరి జక్కల మామా... చించించున్
జింగిరి జింగిరి జిత్తుల మామా... చించించున్
కాకర చెట్టు మేకలు మేసే... చించించున్
జాజిరి జాజిరి జక్కల మామా... చించించున్
జింగిరి జింగిరి జిత్తుల మామా... చించించున్
కాకర చెట్టు మేకలు మేసే... చించించున్
చరణం 1 :
నీ దేశం బంగరు బర్మా... చించించాంచూం
నీ భాసే తెలియదు... ఖర్మా
నీ దేశం బంగరు బర్మా... చించించాంచూం
నీ భాసే తెలియదు... ఖర్మా
సరదాగా నిన్నుచూస్తేనే... తరించేను మా జన్మ
రతనాలే తెచ్చవో... జతగోరే వచ్చావో..
రతనాలే తెచ్చవో... జతగోరే వచ్చావో
మొజుంటే ముందుకు రావోయ్... చించించున్
జాజిరి జాజిరి జక్కల మామా... చించించున్
జింగిరి జింగిరి జిత్తుల మామా... చించించున్
కాకర చెట్టు మేకలు మేసే... చించించున్
చరణం 2 :
వంటింట్లో కుందేలుందీ... వాకిట్లో తోడేలుందీ
గురిపెట్టి చూసావంటే... గుండె ఝల్లు మంటుందీ
వంటింట్లో కుందేలుందీ... వాకిట్లో తోడేలుందీ
గురిపెట్టి చూసావంటే... గుండె ఝల్లు మంటుందీ
నీ మీసం బాగుందీ... నీ వేషం బాగుందీ
నీ మీసం బాగుందీ... నీ వేషం బాగుందీ..
తొడగొట్టి దూసుకుపోవోయ్..చించించున్
జాజిరి జాజిరి జక్కల మామా... చించించున్
జింగిరి జింగిరి జిత్తుల మామా... చించించున్
కాకర చెట్టు మేకలు మేసే... చించించున్
చరణం 3 :
చెయ్ తిరిగిన మా బాసు... చెయ్యడులే తిరకాసు
చెయ్ తిరిగిన మా బాసు... చెయ్యడులే తిరకాసు
చెల్లుతుందీ వరహాలుగా... అతనిచేతి అరకాసు
వ్యవహారం చేస్తావో... ఎగనామం పెడతావో
వ్యవహారం చేస్తావో..ఎగనామం పెడతావో
ఏదైనా నీదేభారం... చించించున్
జాజిరి జాజిరి జక్కల మామా... చించించున్
జింగిరి జింగిరి జిత్తుల మామా... చించించున్
కాకర చెట్టు మేకలు మేసే... చించించున్
http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1343
Tuesday, August 14, 2018
అందరికీ ఒక్కడే దేవుడు
చిత్రం : ఒకే కుటుంబం (1970)
సంగీతం : కోదండపాణి
గీతరచయిత : దాశరథి
నేపథ్య గానం : ఘంటసాల
పల్లవి :
అందరికీ ఒక్కడే దేవుడు
అందరికీ ఒక్కడే దేవుడు
కొందరికి రహీము.. కొందరికి రాముడు
కొందరికి రహీము.. కొందరికి రాముడు
ఏ పేరున పిలిచినా దేవుడు ఒక్కడే... దేవుడొక్కడే
అందరికీ ఒక్కడే దేవుడు
చరణం 1 :
పూలలో ఉన్నాయి వేలరకాలు
పక్షులలో ఉన్నాయి లక్షవిధాలు
పూలలో ఉన్నాయి వేలరకాలు
పక్షులలో ఉన్నాయి లక్షవిధాలు
రేకులు ఉంటేనే పువ్వంటాము... రెక్కలు ఉంటేనే పక్షంటాము
మతాలు ఏవైనా కులాలు వేరైనా... మంచిమనసు ఉంటేనే మనిషంటాము
మనుషులమై మనమంతా కలిసుంటాము
అందరికీ ఒక్కడే దేవుడు
కొందరికి రహీము.. కొందరికి రాముడు
అందరికీ ఒక్కడే దేవుడు
చరణం 2 :
పై వేషం చూసి నీవు భ్రమపడరాదు
మేడిపండు మెరుగంతా మేలిమికాదు
పై వేషం చూసి నీవు భ్రమపడరాదు
మేడిపండు మెరుగంతా మేలిమికాదు
ఎక్కడో దేవునికై ఎందుకు వెదికేవు?
పక్కనున్న మానవుని ఎందుకు మరిచేవు?
మానవసేవే మాధవసేవ... బాధపడే సోదరులను ఆదుకునేను
మనుషులమై మనమంతా కలిసుంటాము
అందరికీ ఒక్కడే దేవుడు
కొందరికి రహీము.. కొందరికి రాముడు
అందరికీ ఒక్కడే దేవుడు
చరణం 3 :
కష్టపడే నీతిపరుని కడుపు నిండదు
దోచుకునే దొరగారికి తృప్తి ఉండదు
కష్టపడే నీతిపరుని కడుపు నిండదు
దోచుకునే దొరగారికి తృప్తి ఉండదు
స్వార్థపరుల ఆట మనం కట్టిస్తాము... శ్రమజీవుల కష్టఫలం ఇప్పిస్తాము
స్వార్థపరుల ఆట మనం కట్టిస్తాము... శ్రమజీవుల కష్టఫలం ఇప్పిస్తాము
అహింస బోధిస్తాం ప్రశాంతి సాధిస్తాం... లోకంలో ఆకలే లేకుండా చేస్తాము
మనుషులమై మనమంతా కలిసుంటాము
అందరికీ ఒక్కడే దేవుడు
కొందరికి రహీము.. కొందరికి రాముడు
అందరికీ ఒక్కడే దేవుడు
Monday, August 13, 2018
ఒకరి మనసు ఒకరికి
చిత్రం : నిండు సంసారం (1968)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : దాశరథి
నేపథ్య గానం : సుశీల, ఘంటసాల
పల్లవి :
ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే... తెలుసులే
అణగి ఉన్న ఆశలు ఈనాడు తీరునులే...
ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే... తెలుసులే
అణగి ఉన్న ఆశలు ఈనాడు తీరునులే...
చరణం 1 :
తొందరంత నాదని తొలగి తొలగిపోయావు
నిలకడ మీదైనా నిజం తెలుసుకున్నావు
ఆరాలు తీరెలే... దూరాలు కరిగెలే
ఇరువురి హృదయాలు తీరాలు చేరెలే
ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే... తెలుసులే
అణగి ఉన్న ఆశలు ఈనాడు తీరునులే...
చరణం 2 :
చల్లని చిరుగాలికి అల్లుకున్న తీగలమై...
చల్లని చిరుగాలికి అల్లుకున్న తీగలమై...
కల్లకపటమెరుగక కలిసిపోదాములే
నల్లని నీ కురులలో తెల్లని పూమాలవలే...
చీకటివెలుగులలో ఏకముగా ఉందాము
ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే... తెలుసులే
అణగి ఉన్న ఆశలు ఈనాడు తీరునులే...
చరణం 3 :
ఇన్నినాళ్ళ నా పరువం నిన్ను చేరుకుందిలే
నీ కన్నుల వెన్నెలలో నిగనిగలాడిందిలే ...
కన్నులలో పాపలా నిన్ను దాచుకున్నాను
ఎన్నెన్ని జన్మలకు నిన్ను విడువలేనులే
ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే... తెలుసులే
అణగి ఉన్న ఆశలు ఈనాడు తీరునులే..
Labels:
(న),
NTR,
ఘంటసాల,
దాశరథి,
నిండు సంసారం (1968),
మాస్టర్ వేణు,
సుశీల
Wednesday, August 8, 2018
ఓహో గులాబి బాలా
చిత్రం: మంచిమనిషి (1964)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు/టి. చలపతిరావు
గీతరచయిత: దాశరథి
నేపథ్య గానం: పి. బి. శ్రీనివాస్
పల్లవి :
ఓ గులాబీ... ఓ గులాబీ
వలపు తోటలో విరిసిన దానా..
లేత నవ్వులా వెన్నెల సోనా..
ఓహో గులాబి బాలా... అందాల ప్రేమ మాలా
సొగసైన కనులదానా... సొంపైన మనసుదానా
నీ వారెవరో తెలుసుకో... తెలుసుకో..తెలుసుకో
ఓహో గులాబి బాలా... అందాల ప్రేమ మాలా
చరణం 1 :
కొంటె తుమ్మెదలవలెచెవూ... తుంటితేనెలందించెవూ..
కొంటె తుమ్మెదలవలెచెవూ... తుంటితేనెలందించెవూ..
మోసం చేసీ మీసం దువ్వే మోసకారులకు లోంగేవూ... లోంగేవూ..
ఓహో గులాబి బాలా... అందాల ప్రేమ మాలా..
చరణం 2 :
రూపం చూసీ వస్తారు... చూపులగాలం వేస్తారు
రూపం చూసీ వస్తారు... చూపులగాలం వేస్తారు
రేకులుచిదిమీ... సొగసులు నునిమీ..
చివరకు ద్రోహం చేస్తారు... చివరకు ద్రోహం చేస్తారు
ఓహో గులాబి బాలా... అందాల ప్రేమ మాలా
సొగసైన కనులదానా... సొంపైన మనసుదానా
నీ వారెవరో తెలుసుకో... తెలుసుకో..తెలుసుకో
ఓహో గులాబి బాలా... అందాల ప్రేమ మాలా
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=140
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు/టి. చలపతిరావు
గీతరచయిత: దాశరథి
నేపథ్య గానం: పి. బి. శ్రీనివాస్
పల్లవి :
ఓ గులాబీ... ఓ గులాబీ
వలపు తోటలో విరిసిన దానా..
లేత నవ్వులా వెన్నెల సోనా..
ఓహో గులాబి బాలా... అందాల ప్రేమ మాలా
సొగసైన కనులదానా... సొంపైన మనసుదానా
నీ వారెవరో తెలుసుకో... తెలుసుకో..తెలుసుకో
ఓహో గులాబి బాలా... అందాల ప్రేమ మాలా
చరణం 1 :
కొంటె తుమ్మెదలవలెచెవూ... తుంటితేనెలందించెవూ..
కొంటె తుమ్మెదలవలెచెవూ... తుంటితేనెలందించెవూ..
మోసం చేసీ మీసం దువ్వే మోసకారులకు లోంగేవూ... లోంగేవూ..
ఓహో గులాబి బాలా... అందాల ప్రేమ మాలా..
చరణం 2 :
రూపం చూసీ వస్తారు... చూపులగాలం వేస్తారు
రూపం చూసీ వస్తారు... చూపులగాలం వేస్తారు
రేకులుచిదిమీ... సొగసులు నునిమీ..
చివరకు ద్రోహం చేస్తారు... చివరకు ద్రోహం చేస్తారు
ఓహో గులాబి బాలా... అందాల ప్రేమ మాలా
సొగసైన కనులదానా... సొంపైన మనసుదానా
నీ వారెవరో తెలుసుకో... తెలుసుకో..తెలుసుకో
ఓహో గులాబి బాలా... అందాల ప్రేమ మాలా
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=140
Tuesday, August 7, 2018
చలిచలిగా ఉందిరా
చిత్రం : మా ఇద్దరి కథ (1977)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : సుశీల, రామకృష్ణ
పల్లవి :
చలిచలిగా ఉందిరా... ఓయ్ రామా... ఓయ్ రామా
గిలిగిలి పెడుతోందిరా... ఓయ్ రామా... ఓయ్ రామా
చలిచలిగా ఉందిరా... ఓయ్ రామా... ఓయ్ రామా
గిలిగిలి పెడుతోందిరా... ఓయ్ రామా... ఓయ్ రామా
కట్టు తప్పిపోయింది నా మనసు
గట్టు దాటిపోయింది నా వయసు
వేడి వేడి కౌగిలింత కోరిందీ
చలిచలిగా ఉందిరా... ఓయ్ రామా... ఓయ్ రామా
గిలిగిలి పెడుతోందిరా... ఓయ్ రామా... ఓయ్ రామా
పిచ్చివాణ్ణి చేస్తుంది నీ సొగసు
కొత్త రుచులు కోరింది నీ వయసు
ముందు వెనక లాగింది నా మనసూ
చలిచలిగా ఉందిరా... ఓయ్ రామా... ఓయ్ రామా
గిలిగిలి పెడుతోందిరా... ఓయ్ రామా... ఓయ్ రామా
చరణం 1 :
వానజల్లు పడుతుంటే... ఒళ్ళు ఝల్లుమంటుంటే
ఎదురుగా నువ్వుంటే... నేను నిలువలేకుంటే
ఒంటరిగా ఈ రేయి... ఘడియైనా గడిపేది
ఎలా... ఎలా... ఎలా ఎలా ఎలా
గాలివాన వడి తెలుసు... కన్నెపిల్ల వేడి తెలుసు
ఇద్దరమూ ఒకటైతే... ఏమౌతుందో తెలుసు
వెరపైనా లేకుండా... పడుచుదనం త్వరపడితే
ఎలా... అబ్భ.. ఎలా... ఎలా ఎలా ఎలా ఎలా ఎలా
చలిచలిగా ఉందిరా... ఓయ్ రామా... ఓయ్ రామా
గిలిగిలి పెడుతోందిరా... ఓయ్ రామా... ఓయ్ రామా
చరణం 2 :
తనువు తడిసిపోతుంటే... తపన పెరిగిపోతుంటే
ఉరుములతో మెరుపులతో... ఉలికి ఉలికిపడుతుంటే
నేనేమో రమ్మంటే... నీవేమో రాకుంటే
ఎలా... ఎలా... ఎలా ఎలా ఎలా
పైట చెంగు పైకెగసి... పైన పైనపడుతున్నా
కురులలోన ముత్యాలు... మరి మరి ఊరిస్తున్నా
మాటలతో కవ్విస్తూ... చూపులతో వారిస్తే
ఎలా... ఎలా... అబ్భ.. ఎలా ఎలా ఎలా...
చలిచలిగా ఉందిరా... ఓయ్ రామా... ఓయ్ రామా
గిలిగిలి పెడుతోందిరా... ఓయ్ రామా... ఓయ్ రామా
చలిచలిగా ఉందిరా... ఓయ్ రామా... ఓయ్ రామా
గిలిగిలి పెడుతోందిరా... ఓయ్ రామా... ఓయ్ రామా
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=731
Thursday, August 2, 2018
ఇంతేనయా తెలుసుకోవయా
చిత్రం : కథానాయకుడు (1969)
సంగీతం : టి.వి. రాజు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : ఘంటసాల
పల్లవి :
హావ్ హావ్ హావ్ లలలలా
లాల్ల లలలల
హావ్ హావ్ హావ్ లలలలా
లాల్ల లలలల
లా... లా... లా… లలలల
ఇంతేనయా తెలుసుకోవయా
ఈ లోకం ఇంతేనయా
లా లలల లా లలల లా లలల
ఇంతేనయా తెలుసుకోవయా
ఈ లోకం ఇంతేనయా
నీతీ లేదు నిజాయితి లేదు... ధనమే జగమయ్యా
తక్చికి బుంబుం తకచికి బుంబుం
బ బా బి బీ బు బొ బ బ
తక్చికి బుంబుం తకచికి బుంబుం
బ బా బి బీ బు బొ బ బ
చరణం 1 :
డాబులు కొట్టి మోసం చేసి జేబులు నింపేరు
హొ హహహ
డాబులు కొట్టి మోసం చేసి జేబులు నింపేరు
పాపం పుణ్యం పరమార్థాలు పంచకు రానీరు
ఎవరికి వారే యమునా తీరే ఇదే ప్రపంచమయా
ఇంతేనయా తెలుసుకోవయా
ఈ లోకం ఇంతేనయా
జింగించక జింగించక
జింగించక జింగించక
జింగించక జింగించక
జింగించక జింగించక
చరణం 2 :
పైసా తోటి సీసా చేరి జల్సా చేసింది... వావ్వ....
పైసా తోటి సీసా చేరి జల్సా చేసింది
మనసే లేని సొగసే ఉండి మైమరపించింది
పైన పటారం లోన లొటారం ఇదే ప్రపంచమయా
ఇంతేనయా తెలుసుకోవయా
ఈ లోకం ఇంతేనయా
తక్చికి బుంబుం తకచికి బుంబుం
బ బా బి బీ బు బొ బ బ
తక్చికి బుంబుం తకచికి బుంబుం
బ బా బి బీ బు బొ బ బ
చరణం 3 :
మంచిని చేసే మనిషిని నేడు వంచన చేసేరు... ఆహా
మంచిని చేసే మనిషిని నేడు వంచన చేసేరు
గొంతులు కోసే వాడికి నేడు గొడుగులు పట్టేరు
దొంగలు దొరలై ఊళ్ళే దోచిరి ఇదే ప్రపంచమయా
ఇంతేనయా తెలుసుకోవయా
ఈ లోకం ఇంతేనయా
యో.. యో.. య్య...
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=168
Labels:
(క),
కథానాయకుడు (1969),
ఘంటసాల,
టి.వి. రాజు,
దాశరథి
Monday, February 5, 2018
ఇన్నాళ్ళ ఈ మూగ బాధ
చిత్రం : విచిత్ర జీవితం (1978)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు
పల్లవి :
ఇన్నాళ్ళ ఈ మూగ బాధ... ఈనాటితో మాసి పోనీ
నీ నుదుట తిలకమ్ము దిద్ది... నిత్య కల్యాణిగా చూసుకొని
ఇన్నాళ్ళ ఈ మూగ బాధ... ఈనాటితో మాసి పోనీ
నీ నుదుట తిలకమ్ము దిద్ది... నిత్య కల్యాణిగా చూసుకొని
చరణం 1 :
ఎన్నేళ్ళు వేచింది మనసు... కన్నీట సాగింది బ్రతుకు
ఎన్నేళ్ళు వేచింది మనసు... కన్నీట సాగింది బ్రతుకు
ఈనాటి ఏకా౦త సమయం... ఏ రేయి లేనంత మధురం
చెలియా ఈ మౌన వేళ... నన్ను అలవోలే చెలరేగి పోనీ
ఇన్నాళ్ళ ఈ మూగ బాధ... ఈనాటితో మాసి పోనీ
నీ నుదుట తిలకమ్ము దిద్ది... నిత్య కల్యాణిగా చూసుకొని
చరణం 2 :
ఎవరైన ఏ వేళనైనా... మనజాడ గమనించరాదు
ఎవరైన ఏ వేళనైనా... మనజాడ గమనించరాదు
జగమేలు పరమాత్ముడైనా... మన జంట విడదీయరాదు
నీ కళ్ళలో నేను దాగీ... నిన్ను నా గుండెలో దాచుకోనీ
ఇన్నాళ్ళ ఈ మూగ బాధ... ఈనాటితో మాసి పోనీ
నీ నుదుట తిలకమ్ము దిద్ది... నిత్య కల్యాణిగా చూసుకొని
చరణం 3 :
కావాలి ఎన్నెన్నో కనులు... నిను కరువారగా చూసుకోగా
కావాలి ఎన్నెన్నో కనులు... నిను కరువారగా చూసుకోగా
కావాలి ఎంతెంతొ కాలం... తీపికలలన్ని పండించుకోగా
రగిలే ఈ హాయిలోనా... నన్ను బతుకంత జీవించిపోనీ
ఇన్నాళ్ళ ఈ మూగ బాధ... ఈనాటితో మాసి పోనీ
నీ నుదుట తిలకమ్ము దిద్ది... నిత్య కల్యాణిగా చూసుకొని
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1270
చల్లని బాబూ
చిత్రం : విచిత్ర బంధం (1972)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి :
చల్లని బాబూ... నా అల్లరి బాబూ
నా కంటి పాపవు నీవే
మా ఇంటి దీపం నీవే
చల్లని బాబూ... నా అల్లరి బాబూ
చరణం 1 :
పంచవన్నెల రామచిలకను... పలకరించబోయేవు
పంచవన్నెల రామచిలకను... పలకరించబోయేవు
వింతచేష్టల కోతుల చూసి గంతులెన్నో వేసేవు
నీ పలుకులు వింటూ పరుగులు చూస్తూ పరవశమైపోతాను
బాబూ...
చల్లని బాబూ... నా అల్లరి బాబూ
నా కంటిపాపవు నీవే... మా ఇంటి దీపం నీవే
చరణం 2 :
ఎన్నెన్నో ఆశలతోటి ఎదురు చూస్తూ ఉన్నాను
వెచ్చని ఒడిలో నిన్ను దాచి ముచ్చటలెన్నో చెబుతాను
ఎన్నెన్నో ఆశలతోటి ఎదురు చూస్తూ ఉన్నాను
వెచ్చని ఒడిలో నిన్ను దాచి ముచ్చటలెన్నో చెబుతాను
అమ్మా నాన్నల అనురాగంలో అపురూపంగా పెరిగేవు
చల్లని బాబూ... నా అల్లరి బాబూ
నా కంటి పాపవు నీవే మా ఇంటి దీపం నీవే
చరణం 3 :
నీ బాబును తల్లి ఆదరించునని భ్రమపడుతున్నావా
చితికిపోయిన మగువ మనసులో మమతలు వెతికేవా
నీవు చేసిన అన్యాయాన్ని మరచిందనుకున్నవా
నీ ఆలోచనలు అనుబంధాలు అడియాసలుకావా
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6518
Tuesday, January 30, 2018
చల్లని వెన్నెలలో
చిత్రం : శ్రీమంతుడు (1971)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : సుశీల, ఘంటసాల
పల్లవి :
చల్లని వెన్నెలలో... నా ఒడిలో నిదురపో
అల్లరి మానుకొని... నా మదిలో ఒదిగిపో
చల్లని వెన్నెలలో... నా ఒడిలో నిదురపో
అల్లరి మానుకొని... నా మదిలో ఒదిగిపో
చరణం 1 :
కలతలు పోవాలనీ... తొలకరి రావాలనీ
వలపుల జల్లులో... బ్రతుకులు పండాలనీ
వేచిన కన్నులతో... వేసారి ఉన్నాను
చల్లని వెన్నెలలో... నా ఒడిలో నిదురపో
అల్లరి మానుకొని... నా మదిలో ఒదిగిపో
చరణం 2 :
మమతల ఉయ్యాలలో... మనసులు ఊగాలనీ
మల్లెలపందిరిలో... మనువులు కూడాలనీ
కోటిదేవుళ్ళనే... కొంగుచాచి అడిగేను
చల్లని వెన్నెలలో... నా ఒడిలో నిదురపో
అల్లరి మానుకొని... నా మదిలో ఒదిగిపో
చరణం 3 :
నీ కన్నులరేకులలో... నిండుకలలు పూయాలనీ
వాడని ఆ కలలలో... నా నీడ చూచుకోవాలనీ
ఎన్నెన్నో ఆశలతో... ఇన్నాళ్ళు ఉన్నాను..
చల్లని వెన్నెలలో... నా ఒడిలో నిదురపో
అల్లరి మానుకొని... నా మదిలో ఒదిగిపో
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1307
ఆహా ఏమందము
చిత్రం : శ్రీమంతుడు (1971)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : ఘంటసాల
పల్లవి :
ఆహా ఏమందము..ఓహో ఈ చందము
నీ తీయని పెదవుల.... తొణికే మధువులు నావే... హ్హే..
ఆహా ఏమందము... ఓహో ఈ చందము
నీ తీయని పెదవుల తొణికే మధువులు నావే..ర్రా..
చరణం 1 :
చిన్నారి చిలకలెన్నో చేరాయి కోరి నన్ను..హహహా అయితేనేం
అందాల రామ చిలక... అలరించె నేడు నన్ను
ఈ బింకము ఈ పొంకము...
ఈ బింకము ఈ పొంకము... ఏనాడు చూడ లేదే..ఏహేహే..
ఏమందము... ఓహోహో..ఈ చందము
నీ తీయని పెదవుల తొణికే మధువులు నావే..హ్హ..
చరణం 2 :
నీ దారి చూచి చూచి... నిను కోరి వేచి వేచి
మనసేలనో చెలరేగెను...
మనసేలనో చెలరేగెను... నే నిలువలేను రావే..హ్హాహ్హహ్హా..
ఏమందము..ఓహోహో..ఈ చందము
నీ తీయని పెదవుల తొణికే మధువులు నావే..హ్హ..
చరణం 3 :
అరచాటు పైటలోన... అరమోడ్పు కనులలోన
అరచాటు పైటలోన... అరమోడ్పు కనులలోన
ఆ ఒంపులు ఆ సొంపులు...
ఆ ఒంపులు ఆ సొంపులు... నే తాళలేను రావే..ర్రా..
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1215
Subscribe to:
Posts (Atom)