Showing posts with label కుమారరాజా (1978). Show all posts
Showing posts with label కుమారరాజా (1978). Show all posts

Friday, December 28, 2018

అగ్గిని నేనూ

చిత్రం : కుమారరాజా (1978)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, రామకృష్ణ 

పల్లవి :

అగ్గిని నేనూ... సుడిగాలిని నేనూ
అగ్గిని నేనూ... సుడిగాలిని నేనూ

అన్నదమ్ములం కలిశాము... ఉన్నదమ్ములే చూపిస్తాం
అన్నదమ్ములం కలిశాము... ఉన్నదమ్ములే చూపిస్తాం
అగ్గిని నేనూ... సుడిగాలిని నేనూ

చరణం 1 :

అడవిలో సీత కడుపున..పుట్టిన కవలలం
మేము..లవకుశులం
అయోధ్య రాముని సీతను కలిపే
ఆంజనేయులం..వీరాంజనేయులం

అడవిలో సీత కడుపున పుట్టిన కవలలం
మేము..లవకుశులం
అయోధ్య రాముని..సీతను కలిపే
ఆంజనేయులం... వీరాంజనేయులం

అగ్గిని నేనూ..సుడిగాలిని నేనూ
అన్నదమ్ములం కలిశాము..ఉన్నదమ్ములే చూపిస్తాం
అన్నదమ్ములం కలిశాము..ఉన్నదమ్ములే చూపిస్తాం
అగ్గిని నేనూ... సుడిగాలిని నేనూ 

చరణం 2 :

అన్యాయానికి అధర్మానికి శత్రువులం
అనురాగానికి అభిమానానికి సేతువులం
అన్యాయానికి అధర్మానికి శత్రువులం
అనురాగానికి అభిమానానికి సేతువులం

మంచికి బానిసలం... వంచితులకు బంధువులం
మంచికి బానిసలం... వంచితులకు బంధువులం
అగ్నిహోత్రమే భగ భగ మండే... ఫాలనేత్రులం
కఠిన చిత్తులకు... మదోన్మత్తులకు కాళరాత్రులం

అగ్గిని నేనూ..సుడిగాలిని నేనూ
అన్నదమ్ములం కలిశాము... ఉన్నదమ్ములే చూపిస్తాం
అన్నదమ్ములం కలిశాము... ఉన్నదమ్ములే చూపిస్తాం
అగ్గిని నేనూ... సుడిగాలిని నేనూ

చరణం 3 :

తల్లి ఋణం తీరుస్తాం... తండ్రి చెఱను విడిపిస్తాం
దెబ్బకు దెయ్యం దించేస్తాం... అబ్బకు బిడ్డల మనిపిస్తాం

ఇదే మా శపధం... ఇదే మా శపధం... ఇదే మా శపథం
ఇదే మా శపధం... ఇదే మా శపధం... ఇదే మా శపథం 

http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3184

ఈ జీవితం వసంతం

చిత్రం : కుమారరాజా (1978)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు

పల్లవి :

సీతాకోక చిలుకలు... స్వాతివాన చినుకులు
తడిమిన కొద్దీ తళుకులు... పడు చందాల పలుకులు
సీతాకోక చిలుకలు...స్వాతివాన చినుకులు
తడిమిన కొద్దీ తళుకులు... పడు చందాల పలుకులు

ఈ జీవితం వసంతం... యవ్వనం ప్రేమగీతం
ఈ జీవితం వసంతం... యవ్వనం ప్రేమగీతం

ఆరు ఋతువులు... పూల ఋతువులే
అన్ని పెదవుల... ప్రేమ మధువులే

అనుభవించరా..పదే పదే.. పదే పదే... పదే పదే..
ఈ జీవితం వసంతం... యవ్వనం ప్రేమగీతం 

చరణం 1 :

లలల లాల లలలాల..లలలలాలా లాలా
లైఫ్ అనేది... ఒక ఛాన్స్ రా
లైఫుకు లైఫ్ రొమాన్స్ రా
లైఫ్ అనేది... ఒక ఛాన్స్ రా
లైఫుకు లైఫ్ రొమాన్స్ రా
స్వీటీలందరి బ్యూటీ చూసే డ్యూటీ నీదిరా
అది పడుచోళ్ళ నీతిరా

సీతాకోక చిలుకలు..ఓహో..
స్వాతివాన చినుకులు..అహా
తడిమిన కొద్దీ తళుకులు..ఏహే..పడు చందాల పలుకులు 

ఈ జీవితం వసంతం... యవ్వనం ప్రేమగీతం 

చరణం 2 :

లలల లాల లలలాల..లలలలాలా లాలా

రామచిలుకనే తెచ్చుకో... ప్రేమపలుకులే నేర్పుకో
వెచ్చగ మచ్చిక చేసుకో... అచ్చిక బుచ్చిక లాడుకో
రామచిలుకనే తెచ్చుకో... ప్రేమపలుకులే నేర్పుకో
వెచ్చగ మచ్చిక చేసుకో..అచ్చిక బుచ్చిక లాడుకో

నీపులకరింతలే పూవులై... ఆ పువ్వులే పడుచు నవ్వులై
నీపులకరింతలే పూవులై... ఆ పువ్వులే పడుచు నవ్వులై
ఆ నవ్వులే పూలబాటలై... సాగిపో... బాటసారీ..
చెప్పుకోవోయ్..నీవు సారీ..

సీతాకోక చిలుకలు..ఓహో..స్వాతివాన చినుకులు..అహా
తడిమిన కొద్దీ తళుకులు... ఏహే..పడుచందాల పలుకులు

ఈ జీవితం వసంతం... యవ్వనం ప్రేమగీతం
యవ్వనం ప్రేమగీతం... యవ్వనం ప్రేమగీతం

http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3698

Sunday, October 23, 2016

విచ్చుకున్నా గుచ్చుకున్నా

చిత్రం : కుమారరాజా (1978)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, సుశీల 

పల్లవి : 

విచ్చుకున్నా గుచ్చుకున్నా...  మొగలిపువ్వు అందమే
విచ్చుకున్నా గుచ్చుకున్నా...  మొగలిపువ్వు అందమే
నువ్వు  కస్సుమన్నా బుస్సుమన్నా మొదటిరాత్రి బంధమే.. బంధమే

తలుపు గడియ అన్నది తెరుచుకోనని
కౌగిలింత అన్నది కమ్ముకోమని
తలుపు గడియ అన్నది తెరుచుకోనని
కౌగిలింత అన్నది కమ్ముకోమని 

కొత్త చీర నలగాలని కోరుకున్నది
ఆ.. కొత్త చీర నలగాలని కోరుకున్నది
విరిపానుపు చెరగకుంటే.. పరువే కాదన్నది

విచ్చుకున్నా గుచ్చుకున్నా...  మొగలిపువ్వు అందమే
నువ్వు  కస్సుమన్నా బుస్సుమన్నా మొదటిరాత్రి బంధమే.. బంధమే
విచ్చుకున్నా గుచ్చుకున్నా...  మొగలిపువ్వు అందమే

చరణం 2 :

వయసు చూస్తే ఆగనన్నది.. మనసు చూస్తే ఆకలన్నది
పిల్లనడుమే ఊగుతున్నది.. పిల్లగాలి రేగమన్నది
వయసు చూస్తే ఆగనన్నది.. హాయ్..  మనసు చూస్తే ఆకలన్నది
పిల్లనడుమే ఊగుతున్నది.. పిల్లగాలి రేగమన్నది

అద్దె మొగుననుకోకు... ముద్దుకు తగననుకోకు
అద్దె మొగుననుకోకు... ముద్దుకు తగననుకోకు
ముద్దివ్వను పొమ్మనకు...  అద్దెకు బకాయి పడకు

అద్దెకొచ్చి ముద్దులంటే... అర్ధరాత్రి అల్లరే..అహ..హ..
హద్దు దాటి హద్దుకుంటే ఒళ్ళు కాస్త పచ్చడే.. పచ్చడే

విచ్చుకున్నా గుచ్చుకున్నా... ఆ..   మొగలిపువ్వు అందమే... అహా..
నువ్వు కస్సుమన్నా బుస్సుమన్నా మొదటిరాత్రి బంధమే.. బంధమే
విచ్చుకున్నా గుచ్చుకున్నా...  మొగలిపువ్వు అందమే
అహహహహా... 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3663

Monday, October 5, 2015

నీ మాట వింటే మదిలో

చిత్రం: కుమారరాజా (1978) 

సంగీతం: కె.వి. మహదేవన్ 

గీతరచయిత: వేటూరి 

నేపథ్య గానం: రామకృష్ణ, సుశీల 

పల్లవి : 

నీ మాట వింటే మదిలో గుడి గంటగా పలికింది
నీ జంట ఒంటరి ఎదలో చలిమంటగా రగిలింది
ఇది జోడు వీణల రాగం.. హృదయాల కుసుమ పరాగం
ఇది జోడు వీణల రాగం.. హృదయాల కుసుమ పరాగం

చరణం 1 :

కలలెన్ని నే కన్నానో.. నాకున్న కన్నులు రెండైనా
అలలెన్ని చెలరేగాయో.. ఏరంటి వయసే ఒకటైన
కలలెన్ని నే కన్నానో.. నాకున్న కన్నులు రెండైనా
అలలెన్ని చెలరేగాయో.. ఏరంటి వయసే ఒకటైన 

కడలేని కడలీ మనసు.. కలిసేటి నది నీ వయసు
కలగన్న కలయిక లోనే.. కరగాలి నీవు నేను
కడలేని కడలీ మనసు.. కలిసేటి నది నీ వయసు
కలగన్న కలయిక లోనే.. కరగాలి నీవు నేను

ఇది రెండు తనువుల ప్రాణం.. ఒకటైన జీవన రాగం
ఇది రెండు తనువుల ప్రాణం.. ఒకటైన జీవన రాగం 

నీ మాట వింటే మదిలో గుడి గంటగా పలికింది
నీ జంట ఒంటరి ఎదలో చలిమంటగా రగిలింది
ఇది జోడు వీణల రాగం.. హృదయాల కుసుమ పరాగం
ఇది జోడు వీణల రాగం.. హృదయాల కుసుమ పరాగం

చరణం 2 :

నీలాల నింగిలో చుక్కా ఏనాడు చెక్కిట పొడిచేను
ఆ తారలే తలంబ్రాలై.. ఏ రోజు తలపై కురిసేను
నీలాల నింగిలో చుక్కా ఏనాడు చెక్కిట పొడిచేను
ఆ తారలే తలంబ్రాలై.. ఏ రోజు తలపై కురిసేను

తొలి పొంగు కోరికలన్నీ మన కొంగు ముడిపెడుతుంటే
ఇల దాటి.. జాబిలి దాటి.. కలవాలి నీవు నేను
తొలి పొంగు కోరికలన్నీ మన కొంగు ముడిపెడుతుంటే
ఇల దాటి.. జాబిలి దాటి.. కలవాలి నీవు నేను

ఇది కాలమాగిన సమయం.. ఏ లోకమెరుగని ప్రణయం
ఇది కాలమాగిన సమయం.. ఏ లోకమెరుగని ప్రణయం

నీ మాట వింటే మదిలో గుడి గంటగా పలికింది
నీ జంట ఒంటరి ఎదలో చలిమంటగా రగిలింది
ఇది జోడు వీణల రాగం.. హృదయాల కుసుమ పరాగం
ఇది జోడు వీణల రాగం.. హృదయాల కుసుమ పరాగం

Tuesday, December 4, 2012

ఆగాలి ఆగాలి ఈ గాలి జోరూ

చిత్రం: కుమారరాజా (1978) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
గీతరచయిత: వేటూరి 
నేపథ్య గానం: బాలు, సుశీల 

పల్లవి: 

ఆగాలి ఆగాలి ఈ గాలి జోరూ.... 
తగ్గాలి కాబోయె శ్రీవారు.. తమరింక కాలేదు మావారు 

ఆగాలి ఆగాలి అమ్మాయీ గారూ.... 
తగ్గాలి కాబోయె శ్రీమతి గారు.. ఆగదింక ఈ గాలి ఈ జోరు 

ఆగాలి ఆగాలి అమ్మాయీ గారు 
తగ్గాలి కాబోయె శ్రీమతి గారు ఆగదింక ఈ గాలి ఈ జోరు 

చరణం 1: 

మాఘమాసం దాకా ఆగలేనూ 
తాళికట్టే దాక తాళలేను ..ఆహా 
మాఘమాసం దాకా ఆగలేనూ 
తాళికట్టే దాక తాళలేను 

మొహమాట పడకు.. నా మోహం పెంచకు 
మొహమాట పడకు.. నా మోహం పెంచకు 
ఈ మోహం ఈ దాహం మోయలేను 
కలలేకంటూ నిదుర కాయలేను 

ఆగాలి ఆగాలి ఈ గాలి జోరూ 
తగ్గాలి కాబోయె శ్రీవారు.. తమరింక కాలేదు మావారు 

చరణం 2: 

కోమలాంగి నడకలు కొండవాగు మెలికలు 
ఆ నవ్వులు విరిసిన విరిసిన పువ్వుల పకపకలు 
కోడె వయసు పిలుపులు కోన త్రాచు వలపులు 
ఆ చూపులు ఎగసిన సొగసరి గువ్వల గుసగుసలు 

కోమలాంగి నడకలు కొండవాగు మెలికలు 
ఆ నవ్వులు విరిసిన విరిసిన పువ్వుల పకపకలు 
కోడె వయసు పిలుపులు కోన త్రాచు వలపులు 
ఆ చూపులు ఎగసిన సొగసరి గువ్వల గుసగుసలు 

మంచు కరిగి పోతోంది ఎండ వేడికి 
మనసు రగిలిపోతోంది కొండ గాలికి 

ఆగాలి ఆగాలి అమ్మాయీ గారు 
తగ్గాలి కాబోయె శ్రీమతి గారు.. ఆగదింక ఈ గాలి ఈ జోరు 

చరణం 3: 

మల్లె గాలి వీస్తుంటే మనసు నిలవదూ 
చుక్క వెన్నెలొస్తుంతే పక్క కుదరదు 
ఆ ఆ ... 
మల్లె గాలి వీస్తుంటే మనసు నిలవదూ 
చుక్క వెన్నెలొస్తుంతే పక్క కుదరదు 
ఆ చూపు చూడకు నా తాపం పెంచకు 
ఆ చూపు చూడకు నా తాపం పెంచకు 
ఆ తీపి ఈ తాపం ఓపలేనూ.. ఎదుటే ఉన్న తెరలు తీయలేను 

ఆగాలి ఆగాలి ఈ గాలి జోరూ లలల లలల లలల 
తగ్గాలి కాబోయే శ్రీవారు తమరింక కాలేదు మా వారు 

ఆగాలి ఆగాలి అమ్మాయిగారూ లలల లలల లలల 
తగ్గాలి కాబోయె శ్రీమతి గారు అహా ఆగదింక ఈ గాలి ఈ జోరు

అనురాగ దేవత నీవే

చిత్రం: కుమారరాజా (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: వేటూరి
నేపథ్య గానం: బాలు

పల్లవి:

అనురాగ దేవత నీవే.. నా ఆమని పులకింత నీవే
నా నీడగా ఉంది నీవే.. నీ తోడుగా ఉండనీవే.. ఉండిపోవే
అనురాగ దేవత నీవే.. నా ఆమని పులకింత నీవే
నా నీడగా ఉంది నీవే.. నీ తోడుగా ఉండనీవే.. ఉండిపోవే

చరణం 1:

ఏనాటిదో ఈ అనుబంధం...ఉ..ఉ.. ఎద చాలని మధురానందం..ఉ..
ఏనాటిదో ఈ అనుబంధం.. ఎద చాలని మధురానందం..ఊ..
నేనేడు జన్మలు ఎత్తితే.. ఏడేడు జన్మలకు ఎదిగే బంధం
ఇది వీడరాని బంధం.. మమతానురాగ బంధం...

అనురాగ దేవత నీవే..ఏ...

చరణం 2:

నను నన్నుగా ప్రేమించవే.. నీ పాపగా లాలించవే..
నను నన్నుగా ప్రేమించవే.. నీ పాపగా లాలించవే...
నా దేవివై దీవించు.. నా కోసమే జీవించు
నీ దివ్యసుందర రూపమే.. నా గుండె గుడిలో వెలిగే దీపం
నా జీవితం నీ గీతం.. మన సంగమం సంగీతం...

అనురాగ దేవత నీవే.. నా ఆమని పులకింత నీవే
నా నీడగా ఉంది నీవే.. నీ తోడుగా ఉండనీవే.. ఉండిపోవే..
అనురాగ దేవత నీవే..

https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3158