Monday, October 5, 2015

నీ మాట వింటే మదిలో

చిత్రం: కుమారరాజా (1978) 

సంగీతం: కె.వి. మహదేవన్ 

గీతరచయిత: వేటూరి 

నేపథ్య గానం: రామకృష్ణ, సుశీల 

పల్లవి : 

నీ మాట వింటే మదిలో గుడి గంటగా పలికింది
నీ జంట ఒంటరి ఎదలో చలిమంటగా రగిలింది
ఇది జోడు వీణల రాగం.. హృదయాల కుసుమ పరాగం
ఇది జోడు వీణల రాగం.. హృదయాల కుసుమ పరాగం

చరణం 1 :

కలలెన్ని నే కన్నానో.. నాకున్న కన్నులు రెండైనా
అలలెన్ని చెలరేగాయో.. ఏరంటి వయసే ఒకటైన
కలలెన్ని నే కన్నానో.. నాకున్న కన్నులు రెండైనా
అలలెన్ని చెలరేగాయో.. ఏరంటి వయసే ఒకటైన 

కడలేని కడలీ మనసు.. కలిసేటి నది నీ వయసు
కలగన్న కలయిక లోనే.. కరగాలి నీవు నేను
కడలేని కడలీ మనసు.. కలిసేటి నది నీ వయసు
కలగన్న కలయిక లోనే.. కరగాలి నీవు నేను

ఇది రెండు తనువుల ప్రాణం.. ఒకటైన జీవన రాగం
ఇది రెండు తనువుల ప్రాణం.. ఒకటైన జీవన రాగం 

నీ మాట వింటే మదిలో గుడి గంటగా పలికింది
నీ జంట ఒంటరి ఎదలో చలిమంటగా రగిలింది
ఇది జోడు వీణల రాగం.. హృదయాల కుసుమ పరాగం
ఇది జోడు వీణల రాగం.. హృదయాల కుసుమ పరాగం

చరణం 2 :

నీలాల నింగిలో చుక్కా ఏనాడు చెక్కిట పొడిచేను
ఆ తారలే తలంబ్రాలై.. ఏ రోజు తలపై కురిసేను
నీలాల నింగిలో చుక్కా ఏనాడు చెక్కిట పొడిచేను
ఆ తారలే తలంబ్రాలై.. ఏ రోజు తలపై కురిసేను

తొలి పొంగు కోరికలన్నీ మన కొంగు ముడిపెడుతుంటే
ఇల దాటి.. జాబిలి దాటి.. కలవాలి నీవు నేను
తొలి పొంగు కోరికలన్నీ మన కొంగు ముడిపెడుతుంటే
ఇల దాటి.. జాబిలి దాటి.. కలవాలి నీవు నేను

ఇది కాలమాగిన సమయం.. ఏ లోకమెరుగని ప్రణయం
ఇది కాలమాగిన సమయం.. ఏ లోకమెరుగని ప్రణయం

నీ మాట వింటే మదిలో గుడి గంటగా పలికింది
నీ జంట ఒంటరి ఎదలో చలిమంటగా రగిలింది
ఇది జోడు వీణల రాగం.. హృదయాల కుసుమ పరాగం
ఇది జోడు వీణల రాగం.. హృదయాల కుసుమ పరాగం

No comments:

Post a Comment