Showing posts with label చంద్రబోస్. Show all posts
Showing posts with label చంద్రబోస్. Show all posts

Thursday, September 1, 2016

ఆంటీ కూతురా






చిత్రం : బావగారు బాగున్నారా? (1998)
సంగీతం : మణిశర్మ
గీతరచయిత : చంద్రబోస్
నేపధ్య గానం : బాలు, చిత్ర



పల్లవి :




ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది
ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది
ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది


అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది
వడ్డాణం తొందరన్నది.. వెడ్డింగే సిద్ధమైనది


పెళ్ళీదాక చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు
భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు


బుగ్గ చుక్క వారెవా.. ముక్కు పుడ్డక వారెవా
గళ్ళచొక్క వారెవా.. కళ్ళజోడు వారెవా


ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది
ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది




చరణం 1 :



ఆదివారం అర్ధరాత్రి వేళలో.. ఆ అల్లరంత మరిచేదెట్టా
సోమవారం ఆడుకున్న ఆటలో.. ఆ హాయికింక సరిలేదంట


వంట ఇంటి మధ్యలో గంటకెన్ని ముద్దులో
వేపచెట్టు నీడలో చెంపకెన్ని చుంబులో


ఎట్టాలే కెట్టిన పిట్టని ఒంటిలో పుట్టిమచ్చలున్నవి ఏడు
ఇంకాస్త చెప్పెయ్యమాకు ఆనవాలు.. ఇటువైపే చూడసాగే వేయికళ్ళు
ముద్దుమురిపాలు అంటే కిట్టనోళ్ళు.. మునుముందు జన్మలోనా కీటకాలు



ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది
ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది




చరణం 2 :




ఇంచుమించు ఇవరయ్యరు నడుముతో
నువ్వు కదిలితే సాగదు కాలం
నిబ్బరంగా డెబ్బై ఆరు బరువుతో
నువ్వు నడిస్తే నిలవదు ప్రాణం
గోల్లుడు చైను సాక్షిగ ఎన్ని గోటిముద్దలో
హెయిర్పిన్ సాక్షిగా ఎన్ని హాటు గుర్తులో


కైపే పుట్టించినా చిట్టా వోటుందిగా కొండవీటి చాంతాండంత
పెళ్ళి కాలేదుగాని లక్షణంగా పెళ్ళానికంటే నేను ఎక్కువేగా
ముళ్ళే పళ్ళేదుగాని శుభ్బరంగా.. ధ్రిల్లేదో నాకు తెలిసే రంగారంగా..


ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది
ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది



పెళ్ళీదాక చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు
భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు
బుగ్గ చుక్క వారెవా.. ముక్కు పుడ్డక వారెవా
గళ్ళచొక్క వారెవా.. కళ్ళజోడు వారెవా


ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది
ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9499

సారి సారి సారి








చిత్రం : బావగారు బాగున్నారా? (1998)
సంగీతం : మణిశర్మ
గీతరచయిత : చంద్రబోస్
నేపధ్య గానం : మనో, స్వర్ణలత  



పల్లవి :



సారి సారి సారి.. సో సారి సారి సారి.. హేయ్


సారి సారి సారి అంటుందోయ్ కుమారి
ప్యారి బ్రహ్మచారి మన్నించెయ్ ఈసారి
నిన్నే ఏరికోరి చేరిందోయ్ చిన్నారి
నువ్వేలేని దారి సహారా ఎడారి
తాగించాలా బిస్లెరి.. హేయ్ తినిపించాలా క్యాడ్బెరి
అందించాలా స్ట్రాబేరి.. కొంచెం మారాలి నీ వైఖరి



సారి సారి సారి అంటుందోయ్ కుమారి
ప్యారి బ్రహ్మచారి మన్నించెయ్ ఈసారి 






చరణం 1 :




లవ్వులోనా చిన్న తప్పులే కామన్.. కమాన్
నవ్వమంటు వేడుకున్నది సాజన్
ఆ నింగి రాలిందా.. అట్లాంటిక్ పొంగిందా
తుఫాను రానుందా.. అణుబాంబ్ మీద పడనుందా
మూఢీగా వుండొద్దయ్యా.. నన్నే ముద్దులో ముంచాలయ్య
హేయ్.. దూరంగ వెళ్ళోద్దయ్యా.. నన్నే గాఢంగా వాటేయ్ ప్రియా..


సారి సారి సారి.. సో సారి సారి సారి.. హేయ్





చరణం 2 :



మొదటిసారి ఇలా జరిగితే.. కలహం హోయ్
ముందు ముందు కలిసి వుండుంటే ఖాయం
జూన్ ఎండ ముగిసాక జులై వాన వస్తుంది
నీ తీరు చూశాక.. తలకే ఆవిరవుతుంది



మాటల్లో దించావమ్మో నువ్వే టోటల్గా నెగ్గావమ్మో.. యమ్మో
మాయేదో చేశావమ్మో నన్నే మొత్తంగ మార్చవమ్మో



జాని జాని జాని విన్నా నీ కహాని
రాజా అంధ్రాస్థాని మెచ్చాడే నీ బాణి
చీకు చింత మాని అందించెయ్ జవాని
ఏదేమైనా కాని జైభోలో భవాని...
టుర్ర్ర్ర్.. టుర్ర్ర్ర్.. లలలలలాలాలా లలలలలాలాలా
లలలలలాలాలా లలలలలాలాలా హేహేహే
లలలలలాలాలా లలలలలాలాలా






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9500

Thursday, August 1, 2013

మౌనంగానే ఎదగమనీ

చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం: కీరవాణి
గీతరచయిత: చంద్రబోస్
నేపధ్య గానం: చిత్ర

పల్లవి:

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది
మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది

అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

చరణం 1:

దూరమెంతో ఉందనీ దిగులుపడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయి గా
భారమెంతో ఉందనీ బాధపడకు నేస్తమా
బాధ వెంట నవ్వులపంట ఉంటుంది గా
సాగరమధనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చిందీ
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నదీ
కష్టాల వారధి దాటినవారికి సొంతమవుతుందీ
తెలుసుకుంటె సత్యమిదీ తలుచుకుంటె సాధ్యమిదీ

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనే అర్ధమందులో ఉంది

చరణం 2:

చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో
మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో
మారిపోని కధలే లేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడూ
నచ్చినట్టు గా నీతలరాతని నువ్వే రాయాలీ

నీ ధైర్యాన్ని దర్షించి దైవాలే తలదించగా
నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగా
నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలీ

అంతులేని చరితలకీ ఆది నువ్వు కావాలీ

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనే అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

గుర్తుకొస్తున్నాయి

చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం: కీరవాణి
గీతరచయిత: చంద్రబోస్
నేపధ్య గానం: కృష్ణకుమార్ (కే కే)

పల్లవి:

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఎదలోతులో ఏమూలనో
నిదురించు జ్ఞాపకాలూ నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

ఈగాలిలో ఏమమతలో
మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి...
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

చరణం 1:

మొదట చూసినా టూరింగ్ సినిమా
మొదట మొక్కినా దేవుని ప్రతిమా
రేగుపళ్ళకై పట్టిన కుస్తీ
రాగిచెంబుతో చేసిన ఇస్త్రీ
కోతికొమ్మలో బెణికిన కాలు
మేకపొదుగులో తాగిన పాలూ
దొంగచాటుగా కాల్చిన బీడీ
సుబ్బుగాడిపై చెప్పిన చాడీ
మోటబావిలో మిత్రుని మరణం
ఏకధాటిగా ఏడ్చిన తరుణం...

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

చరణం 2:

మొదటిసారిగా గీసిన మీసం
మొదట వేసినా ద్రౌపది వేషం
నెలపరీక్షలో వచ్చిన సున్నా
గోడకుర్చి వేయించిన నాన్న
పంచుకున్న ఆ పిప్పరమెంటు
పీరు సాయిబూ పూసిన సెంటూ
చెడుగుడాటలో గెలిచిన కప్పు
షావుకారుకెగవేసిన అప్పు
మొదటి ముద్దులో తెలియని తనమూ
మొదటి ప్రేమలో తియ్యందనమూ...

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

ఎదలోతులో ఏమూలనో
నిదురించు జ్ఞాపకాలూ నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి



గామ గామ హంగామా

చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం: కీరవాణి
గీతరచయిత: చంద్రబోస్
నేపధ్య గానం: బాలు, శ్రీవర్ధిని

పల్లవి:

గామ గామ హంగామా
మనమే హాయి చిరునామా
పాత బాధ గదినీ ఖాళీ చేద్దామా
గామ గామ హంగామా
కష్టం ఖర్చు పెడదామా
కొత్త సంతోషం జమ చేద్దామా

రప రప్పప్పారప్పారపా రప రప్పప్పారప్పా
రప రప్పప్ప రర రప్పప్పా రర పారపరపా

గామ గామ హంగామా
మనమే హాయి చిరునామా
పాత బాధ గదినీ ఖాళీ చేద్దామా

గామ గామ హంగామా
కష్టం ఖర్చు పెడదామా
కొత్త సంతోషం జమ చేద్దామా

రప రప్పప్పారప్పారపా రప రప్పప్పారప్పా
రప రప్పప్ప రర రప్పప్పా రర పారపరపా

చరణం 1:

నీ రాకతో రాయిలాంటి నా జీవితానికే జీవం వచ్చిందీ
నీ చూపుతో జీవం వచ్చిన రాయే చక్కని శిల్పం అయ్యిందీ
చేయూతతో శిల్పం కాస్తా నడకలు నేర్చీ కోవెల చేరిందీ
నీ నవ్వుతో కోవెల చేరిన శిల్పంలోన కోరిక కలిగింది
ఆ కోరికేమిటో చెప్పని
నను వీడి నువ్వు వెళ్ళొద్దని
మళ్ళీ రాయిని చెయ్యొద్దనీ

రప రప్పప్పారప్పారపా రప రప్పప్పారప్పా
రప రప్పప్ప రర రప్పప్పా రర పారపరపా

గామ గామ హంగామా
మనమే హాయి చిరునామా
పాత బాధ గదినీ ఖాళీ చేద్దామా

చరణం 2:

నీ మాటతో నాపై నాకే ఏదో తెలియని నమ్మకమొచ్చిందీ
నీ స్పూర్తితో ఎంతో ఎంతో సాధించాలని తపనే పెరిగిందీ
నీ చెలిమితో ఊహల్లోన ఊరిస్తున్న గెలుపే అందిందీ
ఆ గెలుపుతో నిస్పృహలోన నిదురిస్తున్న మనసే మురిసిందీ
ఆ మనసు అలిసిపోరాదని
ఈ చెలిమి నిలిచిపోవాలని
ఇలా బ్రతుకును గెలవాలనీ

రప రప్పప్పారప్పారపా రప రప్పప్పారప్పా
రప రప్పప్ప రర రప్పప్పా రర పారపరపా

గామ గామ హంగామా
మనమే హాయి చిరునామా
పాత బాధ గదినీ ఖాళీ చేద్దామా

గామ గామ హంగామా
కష్టం ఖర్చు పెడదామా
కొత్త సంతోషం జమ చేద్దామా

రప రప్పప్పారప్పారపా రప రప్పప్పారప్పా
రప రప్పప్ప రర రప్పప్పా రర పారపరపా



Tuesday, July 23, 2013

మంచు కొండల్లోన చంద్రమా

చిత్రం: తాజ్ మహల్ (1995)
సంగీతం: శ్రీలేఖ
గీతరచయిత: చంద్రబోస్
నేపధ్య గానం: బాలు, చిత్ర

పల్లవి:

మంచు కొండల్లోన చంద్రమా
చందనాలు చల్లిపో
మెచ్చి మేలుకున్న బంధమా
అందమంతా అల్లుకో
మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో
మధురమీ సంగమం
కొత్తదాహంలో వింతమోహంలో
మదిలో సంబరం
పల్లవించుతున్న ప్రణయమా
మళ్లీ మళ్లీ వచ్చిపో
విన్నవించుకున్న పరువమా
వెన్నముద్దులిచ్చిపో
కొంటె రాగంలో జంట గానంలో
వలపుకే వందనం

చరణం 1:

ఊపిరల్లే వచ్చి ఊసులెన్నో తెచ్చి
ఆడిపాడి పేద గుండె తట్టు తట్టు తట్టు తట్టు
నింగి రాలిపోని నేల తూలిపోని విడిపోని
ప్రేమగూడు కట్టి కట్టి కట్టి కట్టి
తోడై నువ్వుంటే నీడై నేనుంటా
లోకం నువ్వంటా ఏకంకమ్మంటా

వలచి మరుజన్మలో గెలిచి నిను చేరనా
యుగము క్షణమై సదా జగము మరిపించనా
వెయ్యేళ్లు వర్ధిల్లు కరగని చెరగని
తరగని ప్రేమలలో

పల్లవించుతున్న ప్రణయమా
మళ్లీ మళ్లీ వచ్చిపో
విన్నవించుకున్న పరువమా
వెన్నముద్దులిచ్చిపో
కొంటె రాగంలో జంట గానంలో
వలపుకే వందనం

చరణం 2:

వెన్నెలమ్మ మొన్న కూనలమ్మ నిన్న
కన్నె వన్నెలన్నిచూసే గుచ్చి గుచ్చి గుచ్చి గుచ్చి
గున్నమావికొమ్మ సన్నజాజి రెమ్మ ముచ్చటాడే
నిన్ను నన్ను మెచ్చి మెచ్చి మెచ్చి మెచ్చి
చిందే సింగారం సిగ్గే సింధూరం
పొందే వైభోగం నాదే ఈ భాగ్యం

కలయికల కావ్యమై కలలు చిగురించెనా
శ్రుతిలయల సూత్రమై ప్రియుని జత కోరనా

ఏడేడు లోకాల ఎల్లలుదాటిన
అల్లరి ప్రేమలలో

Monday, July 22, 2013

మన్మధా మన్మధా



చిత్రం : ఠాగూర్ (2003) 

సంగీతం : మణిశర్మ 

గీతరచయిత : చంద్రబోస్ 

నేపథ్య గానం : మహాలక్ష్మి ఐయ్యర్, మల్లికార్జున్


పల్లవి : 


మన్మధా మన్మధా మామ పుత్రుడా.. ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా 

తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా.. జన్మకీ గుమ్మతో జంట కట్టరా 

మన్మధా మన్మధా మామ పుత్రుడా.. ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా 

తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా.. జన్మకీ గుమ్మతో జంట కట్టరా 


అబ్బనీ తీయనీ వలపంతా.. ఇచ్చుకో మనసారా 

ఏ.. జాంగిరీ పొంగులా జగదాంబా.. ఇచ్చుకో సొగసారా 


హే మన్మధా మన్మధా మామ పుత్రుడా.. ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా 

తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా.. జన్మకీ గుమ్మతో జంట కట్టరా 


చరణం 1 : 


ఎంత దాహం ఓ మన్మధా ఎంగిలైనా తేనే కదా 

పూల వయసు ఓ తుమ్మెదా ఘాటు పడ్డా తీపే కదా 


వాలేదా.. ఇలా మీదా.. సఖీ రాధా.. 

రారాదా దా దా దా దయే రాదా.. ప్రియం కాదా నా మీదా 

ముక్కు పచ్చ ఈడు వీచే ముద్దులిచ్చేదా 

హే హే హే సిగ్గు వచ్చి మొగ్గ విచ్చే బుగ్గలిచ్చేదా 



హే మన్మధా మన్మధా మామ పుత్రుడా.. ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా 

తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా.. జన్మకీ గుమ్మతో జంట కట్టరా 


చరణం 2 : 


ఆకలేసి సోకులన్నీ.. సొమ్మసిల్లే పొద్దే కదా 

సోకులన్నీ చిలకా చుట్టి.. నోటికిస్తే ముద్దే కదా 


రాగాల సరాగాల.. ఇదే గోలా ఈ వేళా 

ఊగాలా వయ్యారాలు.. వసంతాలే ఆడేలా 

చాటు మాటు చూసి నీకు చోటు పెట్టేదా 

ఓ ఓ ఓ మాట వరసే మార్చి నీకు మనసు ఇచ్చేదా 


హే మన్మధా మన్మధా మామ పుత్రుడా.. ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా 

తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా.. జన్మకీ గుమ్మతో జంట కట్టరా 


అబ్బనీ తీయనీ వలపంతా.. ఇచ్చుకో మనసారా 

జాంగిరీ పొంగులా జగదాంబా..  ఇచ్చుకో సొగసారా

చిన్నగ చిన్నగ చిన్నగ

చిత్రం: ఠాగూర్ (2003) 
సంగీతం: మణిశర్మ 
గీతరచయిత: చంద్రబోస్ 
నేపథ్య గానం: హరిహరన్, చిత్ర 

పల్లవి: 

చిన్నగ చిన్నగ చిన్నగ 
మది కన్నులు విప్పిన కన్నెగా 
నీ మగసిరికే వేస్తా నా వోటు 
నా సొగసిరితొ వెస్తా ఆ వోటు 

మెల్లగ మెల్లగ మెల్లగ 
మరు మల్లెలు మబ్బులు జల్లుగా 
ముని మాపులలో వేసేయ్ నీ వోటు 
మసి నవ్వులతో వేసేయ్ ఆ వోటు 

నా ప్రేమదేశాన్ని ప్రతి రోజు పాలించే 
నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే 
నీ గుండెలకే వేస్తా నా వోటు 
గుడి హారతినై వేస్తా ఆ వోటు 

చిన్నగ చిన్నగ చిన్నగ 
మది కన్నులు విప్పిన కన్నెగా 

నీ మగసిరికే వేస్తా నా వోటు 
నా సొగసిరితొ వెస్తా ఆ వోటు 

చరణం 1: 

అనుకోకుండా వచ్చి తనిఖి చేయ్యాలి 
అందాలలో నువ్వే మునకే వేయ్యాలి 

అధికారాన్నే ఇచ్చి కునుకే మారాలి 
అవకాశాన్నే చూసి ఇరుకై పోవాలి 

యెద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి 
రసమయసభలో చెప్పినవన్ని చేసుకుపోవాలి 

ప్రతి పక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి 
ఆ రతి పక్షం నేనై ఉండి యుద్దం చేయాలి 

నా వలపు కిరీటం తలపైనే ధరించు 
నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు 
నీ చినుకులకే వేస్తా నా వోటు 
నా చెమటలతో వేస్తా ఆ వోటు 

చరణం 2: 

నా సుకుమారం నీకో సింహాసనం గా 
నా కౌగిళ్ళే నీకు కార్యలయం గా 

నీ నయగారం నాకో ధనాగారం గా 
ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యమవగా 

సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది 
ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది 

కాముడికే మైకం కమ్మేయాగం జరిగింది 
ఓ బాలుడికే పాఠం చెప్పే యొగం దక్కింది 

ఆ పాల పుంతని వలవేసీ వరించే 
ఈ పూల పుంతలో పులకింతలు పుట్టించే 
నీ రసికతకే వేస్తా నా వోటు 
నా అలసటతో వేస్తా ఆ వోటు

గప్పుచిప్పు గప్పుచిప్పు

చిత్రం: ఠాగూర్ (2003)
సంగీతం: మణిశర్మ
గీతరచయిత: చంద్రబోస్
నేపథ్య గానం: మనో, చిత్ర

పల్లవి:

గప్పుచిప్పు గప్పుచిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వులెట్టే రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎట్టా చెప్పుడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు
మొట్టమొదట సారి నిన్ను చూసినప్పుడూ
అత్తి పత్తి బుగ్గలోన ఆశ గుప్పెడు
నింగిలో చంద్రుడే నీకు పోలడు
నిన్ను చూడగానే నేర్చుకుంది కాలు జారుడూ
ఎప్పుడెప్పుడూ...
గప్పుచిప్పు గప్పుచిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వులెట్టె రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎట్టా చెప్పుడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు

చరణం 1:

నువ్వు కానరాకపోతే కోపమొచ్చుడు
నువ్వు కంటి ముందు కొచ్చెనంటె కోరికొచ్చుడు
కౌగిలే కోరితే చెంతకొచ్చుడు
కౌగిలించుకోకపోతే నాకు చింత హెచ్చుడు
వెనక ముందు లాగుతుంది మనసు ఎప్పుడూ
ఇంత అంత కాదు దీని వింత గింజుడు
మనసునే గిల్లిన చిత్రహింసుడు
అబ్బ అమ్మతోడు నువ్వే నాకు రాజహంసుడూ
ఎప్పుడెప్పుడూ...
గప్పుచిప్పు గప్పుచిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వులెట్టె రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎట్టా చెప్పుడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు

చరణం 2:

ఇటుకపై ఇటుక వేస్తే ఇల్లు కట్టుడు
నే ముద్దు మీద ముద్దు పెడితే చిలక కొట్టుడు
పడకపై చల్లనీ పూల చల్లుడు
నీ పక్కలోన గుండెతోని గుండె అల్లుడు
కుంచెతోని రంగులద్దు చిత్రకారుడు
వీడు గోరుతోనే బొడ్డుపైన బొమ్మ గీస్తడు
నన్నిలా ముంచులా కరగదీసుడు
అమ్మో ఎన్ని కళలు ఉన్నవయ్య నీకు పిల్లడూ
ఎప్పుడెప్పుడూ...
గప్పుచిప్పు గప్పుచిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వులెట్టె రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎట్టా చెప్పుడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు
మొట్టమొదట సారి నిన్ను చూసినప్పుడూ
అత్తి పత్తి బుగ్గలోన ఆశ గుప్పెడు
నింగిలో చంద్రుడే నీకు పోలడు
నిన్ను చూడగానే నేర్చుకుంది కాలు జారుడూ
ఎప్పుడెప్పుడూ...

కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలీ

చిత్రం: ఠాగూర్ (2003)
సంగీతం: మణిశర్మ
గీతరచయిత: చంద్రబోస్
నేపథ్య గానం: శంకర్ మహదేవన్

పల్లవి:

కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలీ
ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలీ
బాటేదైనా కానీ మునుముందు కెళ్ళాలీ
పోటీ ఉన్నా కానీ గెలుపొంది తీరాలి
చరిత్రలో నీకో కొన్నీ పెజీలుండాలీ
చిందే వెయ్యాలీ నటరాజు లాగ
నవ్వే చిందాలీ నెలరాజులా
మనసే ఉండాలీ మహరాజు లాగ
మరిచే పోవాలి రాజు పేదా తేడాలన్నీ

చరణం 1:

చెయ్యి ఉంది నీకు చెయ్ కలిపెటందుకే
చూపున్నది ఇంకొకరికి దారి చూపేటందుకే
మాట ఉంది నీకు మాటిచ్చేటందుకే
మనసున్నది ఆ మాటని నెరవెర్చేటందుకే
ఆరాటం నీకుందీ ఏ పనైనా చెయ్యటానికే
అభిమానం తొడుంది ఎందాకైనా నడపటానికే
ఈ ప్రాణం, దేహం, జీవం ఉంది పరుల సేవకే
చేసే కష్టాన్ని నువ్వే చెయ్యాలీ
పొందే ఫలాన్ని పంచివ్వాలీ
అందరి సుఖాన్ని నువ్వే చూడాలీ
ఆ విధి రాతని చెమట తొనే చెరిపెయ్యాలి

కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలీ
ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలీ
బాటేదైనా కానీ మునుముందు కెళ్ళాలీ
పోటీ ఉన్నా కానీ గెలుపొంది తీరాలి
చరిత్రలో నీకో కొన్నీ పెజీలుండాలీ

చరణం 2:

పెద్దవాళ్ళకెపుడూ నువు శిరసు వంచరా
చిన్నవాళ్ళనెపుడు ఆశీర్వదించరా
లేనివాళ్ళనెపుడు నువు ఆదరించరా
ప్రతిభ వున్నవాళ్ళనెపుడు నువు ప్రోత్సహించరా
శరణంటూ వచ్చేసే శత్రువునైనా ప్రేమించరా
సంఘాన్నే పీడించే చీడను మాత్రం తుంచేయరా
ఈ ఆశాజీవి చిరంజీవి సూత్రమిదేరా
దేవుడు పంపిన తమ్ముళ్ళే మీరు
రక్తం పంచిన బంధం మీరు
చుట్టూ నిలిచిన చుట్టాలే మీరు
నన్నే చూపిన అద్దాలంటే మీరే మీరే...

కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలీ
ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలీ
బాటేదైనా కానీ మునుముందు కెళ్ళాలీ
పోటీ ఉన్నా కానీ గెలుపొంది తీరాలి
చరిత్రలో నీకో కొన్నీ పెజీలుండాలీ

నలుగురికి నచ్చినది

చిత్రం: టక్కరి దొంగ (2002)
సంగీతం: మణిశర్మ
గీతరచయిత: చంద్రబోస్
నేపధ్య గానం: శంకర్ మహదేవన్

పల్లవి:

నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో
నరులెవరూ నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో

 నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో 
నరులెవరూ నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో


పొగరని అందరు అన్నాఅది మాత్రం నా నైజం
తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం
నిండు చందురుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు
నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు
నిండు చందురుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు
నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు

నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో
నరులెవరూ నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో

చరణం 1:

నువ్వు నిలబడి నీళ్ళు తాగడం నథింగ్ స్పెషల్
పరుగులెత్తుతూ పాలూ తాగడం సంథింగ్ స్పెషల్
నిన్ను అడిగితే నిజం చెప్పడం నథింగ్ స్పెషల్
అప్పుడప్పుడు తప్పు చెప్పడం సంథింగ్ స్పెషల్
లేనివాడికి దానమివ్వడం నథింగ్ స్పెషల్
ఓ లేనివాడికి దానమివ్వడం నథింగ్ స్పెషల్
ఉన్నవాడిడి దోచుకెళ్ళడం సంథింగ్ స్పెషల్

నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో
నరులెవరూ నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో

చరణం 2:

బుద్దిమంతుడి బ్రాండు దక్కడం నథింగ్ స్పెషల్
పోకిరోడిలా పేరుకెక్కడం సంథింగ్ స్పెషల్
రాజమార్గమున ముందుకెళ్ళడం నథింగ్ స్పెషల్
దొడ్డిదారిలో దూసుకెళ్ళడం సంథింగ్ స్పెషల్
హాయి కలిగితే నవ్వు చిందడం నథింగ్ స్పెషల్
హాయి కలిగితే నవ్వు చిందడం నథింగ్ స్పెషల్
బాధ కలిగినా నవ్వుతుండడం సంథింగ్ స్పెషల్

నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో
నరులెవరూ నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో

పొగరని అందరు అన్నాఅది మాత్రం నా నైజం
తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం
నిండు చందురుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు
నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు
నిండు చందురుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు
నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు

Wednesday, January 30, 2013

A వచ్చి B పై వాలె

చిత్రం: ఛత్రపతి (2005)
సంగీతం: కీరవాణి
గీతరచయిత: చంద్రబోస్
నేపధ్య గానం: కీరవాణి, మాతంగి

పల్లవి:

A వచ్చి B పై వాలె B వచ్చి C పై వాలె C వచ్చి D పై వాలిందే
ఆహా..
1 వచ్చి 2 పై వాలె ఆహా.. 2 వచ్చి 3 పై వాలె ఆహా.. 3 వచ్చి 4 పై వాలిందే..
A B C అంటే నాలో అందం 123 అంటే నీలో వేగం
వేగంతో అందాన్నేగుణపారం చెయ్యాలే

వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

చరణం 1:

నీ సెల్లు నెంబరు కనిపెట్టా నీ ఇల్లు నెంబరు కనిపెట్టా నీఒళ్ళు నెంబరు పనిపెట్టాలే
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
నీ గ్రీను సింబల్‌కనిపెట్టా ఆటీను సింబల్‌కనిపెట్టా ప్రోటీను సింబల్‌కనిపెట్టాలే
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
నీ నెంబరు‌నా సింబరు‌ఓ కుంభకోణంగా..
నా పంబరు‌డిసెంబరు‌ఆరంభకోణంగా
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు..

A వచ్చి B పై వాలె B వచ్చి C పై వాలె C వచ్చి D పై వాలిందే
ఆహా..
1 వచ్చి 2 పై వాలె ఆహా.. 2 వచ్చి 3 పై వాలె ఆహా.. 3 వచ్చి 4 పై వాలిందే..

వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

చరణం 2:

మా నాన్న నడిగి యస్ అంటా పెదనాన్న నడిగి యస్ అంటా మా ఫ్యాన్స్ నడిగి యస్ అంటానే
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

మా బామ్మ నడిగి కిస్సంటా తాతమ్మ నడిగి కిస్సంటా జేజమ్మ నడిగి కిస్సంటాలే
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
ఓ యస్ ని నీ కిస్సుతో సరికూడుకున్నాగా ఓ యస్ ని వయస్సుతో తెగ వాడుకున్నాగా

వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

A వచ్చి B పై వాలె B వచ్చి C పై వాలె C వచ్చి D పై వాలిందే
ఆహా..
1 వచ్చి 2 పై వాలె ఆహా.. 2 వచ్చి 3 పై వాలె ఆహా.. 3 వచ్చి 4 పై వాలిందే..

వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

గుండుసూది గుండుసూది

చిత్రం: ఛత్రపతి (2005) 
సంగీతం: కీరవాణి 
గీతరచయిత: చంద్రబోస్ 
నేపధ్య గానం: కీరవాణి, సునీత 

పల్లవి: 

గుండుసూది గుండుసూది 
గుచ్చుకుంది గుండుసూది 
గుంజిందయ్యో గుండె నా...ది 
గుట్టులాగిందయ్యో పండు లా...గి 
గుండుసూది గుండుసూది 
గుచ్చుకుంటే తప్పు నాది 
తగ్గించనా నెప్పి నీది హాయి 
తెప్పించనా ఊది ఊది 

చరణం 1: 

తగిన వేళల తొలిసారి ..తెగని వేళల మలిసారి 
పడక వేళల ప్రతిసారి .. పగటి వేళల ఒకసారి 
ఈ కోప తాపాలన్నీ తీరేలాగ ..నన్నే ఊపాలి బ్రహ్మచారి 
నీ గోరు వంకల్లోన చేరేవేళ నేనే ..అయిపోనా భామచారి 
అమ్మమ్మ అబ్బబ్బబ్బా ..హయ్యయ్యయ్యో అంతా వినక 
అచ్చచ్చో చిచ్చో పిచ్చో .. సిగ్గులకే సెలవిచ్చో వచ్చేయి వెనక 
చూపాలయ్యో ఊపు నీది .. నాకు చెప్పాలయ్యో తీపి సోది 

గుండుసూది గుండుసూది .. గుచ్చుకుంది గుండుసూది 
గుంజిందయ్యో గుండె నాది .. గుట్టులాగిందయ్యో పండు లాగి 

చరణం 2: 

నీకు బోలెడు అది ఉంది..నాకు బుట్టెడు ఇది ఉంది 
ఎత్తిపోతల పదునుంది .. ఉక్కపోతల పని ఉంది 
మత్తుల్లో గమ్మత్తుల్లో ముంచెత్తాలి నేడే తేనెల్లోఈది ఈది 
చాటుల్లో మాటుల్లోన ఆడే ఆటల్లోన మారాలి తేది తేది 
ఇంకింకా ఇంకా ఇంకా .. కావాలింకా అహా చురక 
స్త్రీలంక చూడాలింకా . నాతోనే తోడింక ఛీపో అనక 
నచ్చావయ్యో ఉగ్రవాది .. నిన్ను చేసెయ్యనా జన్మ ఖైదీ 

గుండుసూది గుండుసూది .. గుచ్చుకుంటే తప్పు నాది 
గుంజిందయ్యో గుండె నాది .. తెప్పించనా ఊది ఊది

అగ్నిస్కలన సందగ్ధయుతు

చిత్రం: ఛత్రపతి (2005)
సంగీతం: కీరవాణి
గీతరచయిత: చంద్రబోస్
నేపధ్య గానం: కీరవాణి, మాతంగి, మంజరి

పల్లవి:

ఆ.. ఆ.. ఆ.. ఏ.. ఏ.. ఏ.. ఓ.. ఓ.. ఓ..

అగ్నిస్కలన సందగ్ధయుతు వర్గప్రళయ రధ ఛత్రపతి
మధ్యందిన సముధ్యకిరణ విద్యుద్యుమని ఘని ఛత్రపతి
తఝ్ఝం తఝణు తద్ధిం ధిరన ధిం ధిం తకిట నట ఛత్రపతి
ఉర్వీవలయ సంభావ్యవర స్వఛ్చంద గుణధీ...

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..
ఓఓ.. ఓ.. ఓ.. ఓ..

చరణం 1:

కుంభీనిగల కుంభస్థగురు కుంభీవలయ పతి ఛత్రపతి
ఝంఝా పవన గర్వాపహర వింధ్యాద్రి సమద్రుతి ఛత్రపతి
చంఢ ప్రబల దుర్గండజిత దుర్గండగఠ ఘఠి ఛత్రపతి
శత్రు ప్రబల విఛ్చేదకర భీమార్జున ప్రతి...

కుంభీనిగల కుంభస్థగురు కుంభీవలయ పతి ఛత్రపతి
ఝంఝా పవన గర్వాపహర వింధ్యాద్రి సమద్రుతి ఛత్రపతి
చంఢ ప్రబల దుర్గండజిత దుర్గండగఠ ఘఠి ఛత్రపతి
శత్రు ప్రబల విఛ్చేదకర భీమార్జున ప్రతి...

చరణం 2:

దిగ్దిగ్విజయ ఢంకానినద ఘంటారవపుశిత ఛత్రపతి
సంఘ స్వజన విద్రోహిజన విధ్వంసమతమతి ఛత్రపతి
ఆర్తత్రాణ దుష్టద్యుమ్న క్షాత్రస్ఫూర్తి ధీనిధి ధీమక్ష్మాపతి శిక్షా స్మృతి స్థపతి..

పిల్లన గ్రోవి నేనై

చిత్రం: చేతిలో చెయ్యేసి (2010) 
సంగీతం: బంటి 
గీతరచయిత: చంద్రబోస్ 
నేపధ్య గానం: హరిహరన్, అల్కా 

పల్లవి: 

పిల్లన గ్రోవి నేనై ..చల్లని గాలి నువ్వై 
అల్లుకుపోయే రాగం .. ఆనంద రాగం 
పిల్లన గ్రోవి నేనై ..చల్లని గాలి నువ్వై 
అల్లుకుపోయే రాగం .. ఆనంద రాగం 

రాగానికే రూపం ఒచ్చి .. రూపమిలా ఎదురుగ నిలిచి 
ఆలాపించే రాగం ...ఆత్మీయ రాగం .. అదే ప్రేమ రాగం 

చరణం 1: 

మొదటి సారి నిను చూడగానే .. ఆశ్చర్యరాగం 
మదిని తెరిచి మాటాడగానే .. ఆహ్వానరాగం 
చొరవ చేసి నను చేరగానే .. ఆందోళరాగం 
చెలిమి చేయి కలిపేయగానే .. అవలీలరాగం 

నవ్వులోన నవనీత రాగం .. సిగ్గులోన గిలిగింతరాగం 
ఒంపులోన ఒలికింత రాగం .. ఓపలేని విపరీత రాగం 
అణువుఆణువున పలికెను మనలో .. అనురాగ రాగం .. అదే ప్రాణ రాగం 

రాగానికే రూపం ఒచ్చి .. రూపమిలా ఎదురుగ నిలిచి 
ఆలాపించే రాగం ...ఆత్మీయ రాగం .. అదే ప్రేమ రాగం 

చరణం 2: 

ఇరువురం దూర దూరముంటే .. ఇబ్బందిరాగం 
బంధమై స్పందించుతుంటే .. నిర్బంధరాగం 
పెదవి మీటి పెనవేసుకుంటే .. నిశ్శబ్దరాగం 
మధుర నిధిని దోచేసుకుంటే .. నిక్షేప రాగం 

తనువులోన తారంగ రాగం .. క్షణముకొక్క కేరింతరాగం 
కలలోన కల్లోల రాగం .. కలిసిపోతే కళ్యాణరాగం 
ఇద్దరమొకటై ముద్దుగ ఉంటే అద్వైత రాగం ..అదే మోక్షరాగం 

పిల్లన గ్రోవి నేనై ..చల్లని గాలి నువ్వై 
ఆలాపించే రాగం ...ఆత్మీయ రాగం .. అదే ప్రేమ రాగం

Monday, December 10, 2012

చిలకమ్మ ముక్కుకి

చిత్రం: గుడుంబా శంకర్ (2004)
సంగీతం: మణిశర్మ
గీతరచయిత: చంద్రబోస్
నేపధ్య గానం: కార్తీక్, శ్రీవర్ధిని, హనుమంతరావు

పల్లవి:

చిలకమ్మ ముక్కుకి దొండపండుకి ఏనాడో రాసి పెట్టుంది
కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది
అరె ఆశే ఉంటే అంతో ఇంతో అంతేనండి మరి రాసే ఉంటే అంతా సొంతం అయ్యేనండి
ఆ వీరబ్రహ్మం ఆనాడిదే అన్నాడండి మన పరబ్రహ్మం మళ్ళీ ఎటు ఉన్నాడండి

ఏవోవో ఏవో ఏవో ..ఉందోయ్ రాసి...ఏవోవో ఏవో ఏవో..
ఏవోవో ఏవో ఏవో ..లేదోయ్ రాజీ ... ఏవోవో ఏవో ఏవో..
చిలకమ్మ ముక్కుకి దొండపండుకి ఏనాడో రాసి పెట్టుంది
కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది

చరణం 1:

సన్నాయే విరిగినా ఆ డోలే పగిలినా అయ్యే పెళ్ళాగునా రాసుంటే
పందిళ్ళే కూలినా బంధువులే పోయినా అయ్యే పెళ్ళాగునా రాసుంటే
చల్లే అక్షింతలు నిప్పులే ఐనా పెళ్ళాగదు రాసే ఉంటే
హే మెడ్లో పూమాలలు పాములే ఐనా పెళ్ళాగదు రాసే ఉంటే

ఏవోవో ఏవో ఏవో ..ఉందోయ్ రాసి...ఏవోవో ఏవో ఏవో
ఏవోవో ఏవో ఏవో..వద్దోయ్ పేచీ.. ఏవోవో ఏవో ఏవో
చిలకమ్మ ముక్కుకి దొండపండుకి ఏనాడో రాసి పెట్టుంది
కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది

చరణం 2:

తిక్కన్నే వచ్చినా ఎర్రన్నే వచ్చినా జరిగే కథ మారునా రాసుంటే
గురుడే బోధించినా వరుడే పాటించినా జరిగే కథ మారునా రాసుంటే
సింహం ఓ పక్క నక్క ఓ పక్క కథ మారదు రాసే ఉంటే
పెళ్ళాం ఓ పక్క పళ్ళెమోపక్క కథ మారదు రాసే ఉంటే

ఏవోవో ఏవో ఏవో..ఉందోయ్ రాసి...ఏవోవో ఏవో ఏవో
ఏవోవో ఏవో ఏవో.. బ్రతుకే చీచీ...ఏవోవో ఏవో ఏవో

అరె ఆశే ఉంటే అంతో ఇంతో అంతేనండి మరి రాసే ఉంటే అంతా సొంతం అయ్యేనండి
ఆ వీరబ్రహ్మం ఆనాడిదే అన్నాడండి మన పరబ్రహ్మం మళ్ళీ ఎటు ఉన్నాడండి

ఏవోవో ఏవో ఏవో.. ఉందోయ్ రాసి... ఏవోవో ఏవో ఏవో
ఏవోవో ఏవో ఏవో..లేదోయ్ రాజీ ... ఏవోవో ఏవో ఏవో

Sunday, December 9, 2012

ఏం చక్కని మందారం

చిత్రం: గబ్బర్ సింగ్ (2012)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గీతరచయిత: చంద్రబోస్
నేపధ్య గానం: శంకర్ మహదేవన్ , గోపిక పూర్ణిమ

పల్లవి:

ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం
ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం
ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం ఇక తియ్యని ప్రేమకి తయ్యారం

ఓ ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే.. నీలా ఉంటుందే..
ఓ ఓ ఓ.. ఆనందం అల్లరి చేస్తే.. నాలా ఉంటుందే..
నాలా ఉంటుందే.. నాలా ఉంటుందే
వానల్లే నువ్వు జారగా నేలల్లె నేను మారగా
వాగల్లె నువ్వు నేను చేరగా
మది వరదై పొంగి సాగరమవుతుందే
హోలా హోలాహ హోలా హోలాహ నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల
హోలా హోలాహ హోలా హోలాహ ఇక చాలా చాలా జరిగే నీ వల్ల

ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం
ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం
ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం ఇక తియ్యని ప్రేమకి తయ్యారం

చరణం 1:

అల్లేసి.. నను గిల్లేసి.. తెగ నవ్వినావే సుగుణాల రాక్షసీ.. శత్రువంటి ప్రేయసి
పట్టేసి.. కనిపెట్టేసి.. దడ పెంచినావే దయలేని ఊర్వశి.. దేవతంటి రూపసి

గాలుల్లో రాగాలన్నీ నీలో పలికేనే.. నిద్దుర పుచ్చేనే..
ఓ ఓ ఓ.. లోకంలో అందాలన్నీ నీలో చేరెనే.. నిద్దుర లేపెనే..
హోలా హోలాహ హోలా హోలాహ నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల
హోలా హోలాహ హోలా హోలాహ ఇక చాలా చాలా జరిగే నీ వల్ల

ఆనందం ఆనందం ఆనందం అంటే అర్థం
ఈనాడే తెలిసింది కొత్త పదం
ఆనందం ఆనందం నీవల్లే ఇంతానందం
గుండెల్లో కదిలింది పూల రథం

చరణం 2:

వచ్చేసి.. బతికిచ్చేసి.. మసి చేసినావే రుషి లాంటి నా రుచి.. మార్చినావే అభిరుచి
సిగ్గేసి.. చలిమొగ్గేసి.. ఉసి గొలిపినావె సరిగమగా పదనిసి చేర్చినావే రోదసి
స్వర్గంలో సౌఖ్యాలన్నీ నీలో పొంగేనే.. ప్రాణం పోసేనే
ఓ ఓ ఓ.. నరకంలో నానా హింసలు నీలో సొగసేనే ప్రాణం పోసెనే

హోలా హోలాహ హోలా హోలాహ నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల
హోలా హోలాహ హోలా హోలాహ ఇక చాలా చాలా జరిగే నీ వల్ల

ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం
ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం
ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం ఇక తియ్యని ప్రేమకి తయ్యారం

ఒక తోటలో ఒక కొమ్మలో

చిత్రం: గంగోత్రి (2003) 
సంగీతం: కీరవాణి 
గీతరచయిత: చంద్రబోస్ 
నేపధ్య గానం: ఎస్.పి. చరణ్, మాళవిక 

పల్లవి: 

ఒక తోటలో.. ఒక కొమ్మలో.. ఒక పువ్వు పూసింది 
మహరాణిలా.. మహలక్ష్మిలా.. ఆ పువ్వు నవ్వింది 
అలాగే నవ్వుతూ ఉండాలని... 
అలాగే నవ్వుతూ ఉండాలని 
నింగినేల.. వాగువంక.. చెట్టుచేమ.. గువ్వగూడు.. 
ఆశీర్వదించాలి 

ఒక తోటలో.. ఒక కొమ్మలో.. ఒక పువ్వు పూసింది 
మహరాణిలా.. మహలక్ష్మిలా.. ఆ పువ్వు నవ్వింది 

చరణం 1: 

ఎన్నో రంగుల పువ్వు.. ఎండ కన్నే ఎరగని పువ్వు 
సుందరమైన పువ్వు.. పలు సుగుణాలున్న పువ్వు 
ఏ గుడిలో అడుగుపెట్టునో... 
దేవుడు చల్లగ చూడాలి 
ఆ పువ్వుకు పూజలు చేయాలి 
దేవుడి గుండెల గుడిలో... ఆ పువ్వే.. హాయిగ ఉండాలి 

ఒక తోటలో.. ఒక కొమ్మలో.. ఒక పువ్వు పూసింది 

చరణం 2: 

నీరును పోసి పెంచి.. పందిరల్లే నీడనిచ్చి 
ఎండా వానల్లోనా ఆదరించే తోటమాలి 
ఆ పువ్వుకి తోడు ఉండగా... 
దేవుడు వేరే లేడు కదా 
తోటమాలే పువ్వుకి దేవుడుగా 
మాలికి పువ్వుకు మధ్యన 
అనుబంధం... ఎన్నడూ వాడదుగా 

ఒక తోటలో.. ఒక కొమ్మలో.. ఒక పువ్వు పూసింది 
మహరాణిలా.. మహలక్ష్మిలా.. ఆ పువ్వు నవ్వింది