Showing posts with label టి. చలపతి రావు. Show all posts
Showing posts with label టి. చలపతి రావు. Show all posts

Thursday, June 13, 2019

ఏటి దాపుల... తోట లోపల

చిత్రం : ప్రేమకానుక (1969)
సంగీతం : టి. చలపతి రావు
గీతరచయిత : సినారె
నేపథ్య గానం :  సుశీల

పల్లవి :

ఏటి దాపుల...  తోట లోపల....
ఏటి దాపుల... తోట లోపల
తేటతేనియలొలుకు పలుకుల... ఎవరినే పిలిచేవు కోయిల..
ఎవరినే... ఎవరినే...

చరణం 1 :

ప్రియుని అడుగుల సవ్వడులు... ఏ పిల్లగాలి తెలిపెనే
చెలుని పలుకుల రుచులు... ఏ తొలి చిగురు నీతో తెలిపెనే
తెలుపవే ఒకసారి కోయిల...  తెలుపవే 

ఏటి దాపుల... తోట లోపల
తేటతేనియలొలుకు పలుకుల... ఎవరినే పిలిచేవు కోయిల..
ఎవరినే... ఎవరినే...

చరణం 2 :

వేయి తెన్నుల... వేయి కన్నుల... ప్రియుడు నాకై వేచెనా ?
చెలుని విరహపు గీతమై... నీ గళములో వినిపించెనా?
తెలుపవే ఒకసారి కోయిల... తెలుపవే 

చరణం 3 :

చిలుక చెలులను వెంటగొని... మా పిలుపు మన్నించేవటే
తియ్యగా మా పెళ్ళిలో... సన్నాయ పలికించేవటే...
తెలుపవే ఒకసారి కోయిల... తెలుపవే 

ఏటిదాపుల... తోటలోపల
తేటతేనియలొలుకు పలుకుల..
ఎవరినే పిలిచేవు కోయిల ఎవరినే... ఎవరినే  

http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7357

Wednesday, July 11, 2018

దొంగచూపులు చూచి

చిత్రం : కలవారి కోడలు (1964)
సంగీతం : టి. చలపతి రావు
గీతరచయిత :
నేపథ్య గానం : ఘంటసాల, జిక్కి

పల్లవి : 

ఓహో..ఓ..ఓ..ఓ.ఓఓ...ఓ...ఓ...
ఓహో..ఓ..ఓ..ఓ.ఓఓ...ఓ...ఓ...
ఓహో..ఓ..ఓ..ఓ.ఓఓ...ఓ...ఓ...

దొంగచూపులు చూచి... దోరవయసు దోచీ
దొంగచూపులు చూచి... దోరవయసు దోచీ
కొత్త వలపులు చిలికితివా...  మత్తుకనులా చినదానా 

దొంగచూపులు చూచి... దోరవయసు దోచీ
మత్తుమందు చిలికితివా మనసు పడినా చినవాడా

చరణం 1 :  

ముచ్చటైన కురులు దువ్వి... మొగలిరేకులా జడను వేసి
ముచ్చటైన కురులు దువ్వి... మొగలిరేకులా జడను వేసి
మోజుతీర ముస్తాబు చేసి... మోమాటపడనేల ఓ చిన్నదానా

దొంగచూపులు చూచి... దోరవయసు దోచీ
కొత్త వలపులు చిలికితివా...  మత్తుకనులా చినదానా 

చరణం 2 : 

కోరమీసాల మెలేసి... కోటిసరసాల వలేసి
కోరమీసాల మెలేసి... కోటిసరసాల వలేసి
చిలిపిసైగల పిలిచావు గాని... చెప్పేటి కబురేమి ఓ చిన్నవాడా

దొంగచూపులు చూచి... దోరవయసు దోచీ
మత్తుమందు చిలికితివా...  మనసు పడినా చినవాడా

చరణం 3 :

హంసలాగ నడచిరాగా... అందమంతా పొంగిపోగా
హంసలాగ నడచిరాగా... అందమంతా పొంగిపోగా
కోయిలల్లే గొంతెత్తి పాడ... గుండెల్లో గిలిగింతలయ్యేను పిల్లా 

దొంగచూపులు చూచి... దోరవయసు దోచీ
కొత్త వలపులు చిలికితివా మత్తుకనులా చినదానా 

చరణం 4 :

పూలతావుల చేరదీసి... గాలితీగలా ఓడగట్టి
పూలతావుల చేరదీసి... గాలితీగలా ఓడగట్టి
మత్తుదారుల కేరింతలాడి... మైమరచిపోదాము ఓ చిన్నవాడా  

దొంగచూపులు చూచి... దోరవయసు దోచీ
కొత్త వలపులు చిలికితివా మత్తుకనులా చినదానా 

ఓహో..ఓ..ఓ..ఓ.ఓఓ...ఓ...ఓ...
ఓహో..ఓ..ఓ..ఓ.ఓఓ...ఓ...ఓ...
ఓహో..ఓ..ఓ..ఓ.ఓఓ...ఓ...ఓ...

Thursday, June 1, 2017

ఓ మై లవ్లీ డార్లింగ్

చిత్రం : ఖైదీ బుల్లోడు (1972)
సంగీతం : టి. చలపతి రావు
గీతరచయిత :
నేపధ్య గానం : బాలు, సుశీల
 
పల్లవి : 

ఓ మై లవ్లీ డార్లింగ్... లెట్ మి టెల్ యూ సమ్ థింగ్
ఓ మై లవ్లీ డార్లింగ్... లెట్ మి టెల్ యూ సమ్ థింగ్
ఊ... ఊ

నీ బుగ్గలలో నిగనిగలాడే సిగ్గుమొగ్గలే... గ్రూమింగ్

ఓ మై లవ్లీ డార్లింగ్... లెట్ మి టెల్ యూ సమ్ థింగ్
ఉం.. ఊ..

నీ కన్నులలో తళతళలాడే చిలిపి తలపులే... చామింగ్
ఓ మై లవ్లీ డార్లింగ్... 

చరణం 1 :

మురిపించే నీ అందం... వేసిందీ తొలిబంధం
పిలుపులలో తీయదనం... చిలికిందీ మకరందం

ఆశలు పొంగే ఈ సమయంలో నీ చిరునవ్వే... ఎక్సైటింగ్

ఓ మై లవ్లీ డార్లింగ్... లెట్ మి టెల్ యూ సమ్ థింగ్
ఓ మై లవ్లీ డార్లింగ్... 

లలలలలాలలలా.. లలలలాలలాల... అహహా.. ఆహహాహ

చరణం 2 :

విరబూసే విరజాజి తెలిపిందీ సందేశం
అందుకనే తుమ్మెదలో కలిగిందీ ఆవేశం 

జీవితమంతా చెరిగిపోనిది మధురమైనది... మీటింగ్

ఓ మై లవ్లీ డార్లింగ్... లెట్ మి టెల్ యూ సమ్ థింగ్
ఓ మై లవ్లీ డార్లింగ్... 

చరణం 3 :

అదిగదిగో ఆకాశం వాలిందీ మనకోసం
కొండలలో కోనలలో నిండిందీ అనురాగం

నీవూ నేనూ కలిసిన వేళా నిమిషనిమిషమూ.. త్రిల్లింగ్

ఓ మై లవ్లీ డార్లింగ్... లెట్ మి టెల్ యూ సమ్ థింగ్
ఓ మై లవ్లీ డార్లింగ్... 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2363

Monday, March 6, 2017

అన్నా... నీ అనురాగం

చిత్రం : ఆడపడుచు (1967)
సంగీతం : టి. చలపతి రావు
గీతరచయిత :
నేపధ్య గానం :  సుశీల 

పల్లవి :

అన్నా... నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం
ఓ అన్నా నీ అనురాగం... 

పుట్టిన రోజున మీ దీవేనలే... వెన్నెల కన్నా చల్లదనం
ఓ అన్నా నీ అనురాగం..

చరణం 1 :

మల్లెలవంటి మీ మనసులలో చెల్లికి చోటుంచాలి
ఎల్లకాలము ఈ తీరుగానే చెల్లిని కాపాడాలి..

పుట్టిన రోజున మీ దీవేనలే... వెన్నెల కన్నా చల్లదనం
ఓ అన్నా నీ అనురాగం....  ఎన్నో జన్మల పుణ్యఫలం
ఓ అన్నా... 

చరణం 2 :

అన్నలు మీరే నా కన్నులుగా...  నన్నే నడిపించాలి
తల్లీ తండ్రీ సర్వము మీరై...  దయతో దీవించాలి

పుట్టిన రోజున మీ దీవేనలే... వెన్నెల కన్నా చల్లదనం
ఓ అన్నా నీ అనురాగం... ఎన్నో జన్మల పుణ్యఫలం
ఓ అన్నా... 

చరణం 3 :

ఇల్లాలినై నేనెచటికేగినా...  చెల్లిని మదిలో నింపాలి
ఆడపడచుకు అన్నివేళలా...  తోడూ నీడగా నిలవాలి

పుట్టిన రోజున మీ దీవేనలే...  వెన్నెల కన్నా చల్లదనం
ఓ అన్నా నీ అనురాగం...  ఎన్నో జన్మల పుణ్యఫలం
ఓ అన్నా..

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=152

Tuesday, February 7, 2017

గారడి చేసే కన్నులతో

చిత్రం : ఆడపడుచు (1967)
సంగీతం : టి. చలపతి రావు
గీతరచయిత :
నేపధ్య గానం : టి. ఆర్. జయదేవ్, సుశీల 

పల్లవి :

గారడి చేసే కన్నులతో నన్నారడి చేసేవెందుకనీ
ఎందుకనీ..ఎందుకనీ

చిలిపి చిలిపి నీ చేతలతో నను కలవరపరచే వెందుకనీ
ఎందుకనీ..ఎందుకనీ..

చరణం :

రారమ్మని నే పిలవగనే.. రానని మారాం చేసేవు
ఎందుకనీ... ఎందుకనీ

గారాలొలికే చెక్కిలిపై నేరం చేయగ తలచేవు
ఎందుకనీ... ఎందుకనీ

గారడి చేసే కన్నులతో నన్నారడి చేసేవెందుకనీ
ఎందుకనీ... ఎందుకనీ

చిలిపి చిలిపి నీ చేతలతో నను కలవరపరచే వెందుకనీ
ఎందుకనీ..ఎందుకనీ..

చరణం 2 :

జడలో పూవులు తురుమగనే తడబడి దూసుకుపోయేవు
ఎందుకనీ... ఎందుకనీ

పూవులు తురుమే సాకులతో నా నవ్వును దోచగ తలచేవూ
ఎందుకనీ... ఎందుకనీ

గారడి చేసే కన్నులతో నన్నారడి చేసేవెందుకనీ
ఎందుకనీ... ఎందుకనీ

చిలిపి చిలిపి నీ చేతలతో నను కలవరపరచే వెందుకనీ
ఎందుకనీ..ఎందుకనీ..

చరణం 3 :

నీ పాదాలే సోకిన చోట నిగనిగలాడేను ఈ తోటా
ఎందుకనీ... ఎందుకనీ

నను కాపాడే నీ నీడే అందాలొలికేను నా మేడ
ఎందుకనీ... ఎందుకనీ

గారడి చేసే కన్నులతో నన్నారడి చేసేవెందుకనీ
ఎందుకనీ... ఎందుకనీ

చిలిపి చిలిపి నీ చేతలతో నను కలవరపరచే వెందుకనీ
ఎందుకనీ..ఎందుకనీ..

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2315