Thursday, July 25, 2013

మల్లయ్యగారి ఎల్లయ్యగారి బుల్లెమ్మా

చిత్రం: దసరా బుల్లోడు (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల,పిఠాపురం


పల్లవి::

ఓ..మల్లయ్యగారి ఎల్లయ్యగారి..బుల్లెమ్మా
బుల్లెయ్యగారి చెల్లెమ్మా..
నీ పురాణమంతా బుర్ర కధగా చెబుతామమ్మా
వినరా..బుల్లెమ్మా వీరగాధలు వీనులవిందుగా
హేయ్..వినరా..బుల్లెమ్మా వీరగాధలు వీనులవిందుగా
బుల్లెమ్మంటే పల్లెటూళ్ళలో ఎల్లరెరిగిన యిల్లాలండి
తందానా..తాన
ఓహో..బుల్లెమ్మంటే పల్లెటూళ్ళలో ఎల్లరెరిగిన యిల్లాలండి
తందానా..తాన

వినరా..బుల్లెమ్మా వీరగాధలు వీనులవిందుగా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ..

చరణం::1

పిల్లికి బిచ్చం పెట్టని తల్లి...
బుల్లెమ్మా...
ఎంగిలి చేత్తో కాకిని తోలని...
బుల్లెమ్మా...
తవుడూ చిట్టూ ధాన్యం గీన్యం ఊళ్ళో అమ్మీ
పాలు పెరుగు వెన్నా నెయ్యి బస్తీ కమ్మీ
కడుగు నీళ్ళే మొగుడి ముఖాన కొడతావమ్మా
అయ్యో..
కడుపు కట్టి..మూటలు కట్టి దాస్తావమ్మా... దాస్తావమ్మా

హేయ్..వినరా..బుల్లెమ్మా వీరగాధలు వీనులవిందుగా
వినరా..బుల్లెమ్మా వీరగాధలు వీనులవిందుగా

చరణం::2

చదివేదేమో రామాయణము సంసారంలో రావణయుద్దము
చదివేదేమో రామాయణము సంసారంలో రావణయుద్దము
పాతివ్రత్యమే పారాయణము..పచ్చడి మెతుకులె భర్తకు దినము
పాతివ్రత్యమే పారాయణము..పచ్చడి మెతుకులె భర్తకు దినము
పిల్లా మేకా లేరు కదమ్మా..ఆ..అహా..లేరుకదమ్మా
యీ పిసినిగొట్టు బ్రతుకేం ఖర్మా
నీ ఖర్మా..
హేయ్..వినరా..బుల్లెమ్మా వీరగాధలు వీనులవిందుగా
అహా..వినరా..బుల్లెమ్మా వీరగాధలు వీనులవిందుగా



No comments:

Post a Comment