Showing posts with label మాదవపెద్ది సురేశ్. Show all posts
Showing posts with label మాదవపెద్ది సురేశ్. Show all posts

Wednesday, March 30, 2016

ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి

చిత్రం : బృందావనం (1992)
సంగీతం : మాదవపెద్ది సురేశ్
గీతరచయిత : వెన్నెలకంటి
నేపధ్య గానం : బాలు , జానకి 

పల్లవి :

ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి... అనుకున్నా ఏదో నవ్వని
ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి... అనుకున్నా ఏదో నవ్వని
ఈ రోజే నాకు తెలిసింది... ఆ నవ్వున దాగుంది లవ్వని
ఎద జివ్వున లాగింది లవ్వని

ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి... అనుకున్నా ఏదో నవ్వని
ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి... అనుకున్నా ఏదో నవ్వని
ఈ రోజే నాకు తెలిసింది... ఆ నవ్వున దాగుంది లవ్వని
ఎద జివ్వున లాగింది లవ్వని 

చరణం 1 :

ఆ రోజు జాబిల్లి పగలే వచ్చింది... ఈ రోజు జాజుల్లో సెగలే తెచ్చింది
ఆ రోజు ఓ చూపు వలలే వేసింది... ఈ రోజు మాపుల్లో కలలే తోచింది
కన్నులే వెన్నెలాయే... వన్నెలే వెన్నలాయే
ముద్దులా ముచ్చటాయే నిద్దరే పట్టదాయే 

ఈ రోజే నాకు తెలిసింది... ఈ చిత్రాలు చేసింది లవ్వని

మధు పత్రాలు రాసింది లవ్వని... 

ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి... అనుకున్నా ఏదో నవ్వని
ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి... అనుకున్నా ఏదో నవ్వని
ఈ రోజే నాకు తెలిసింది... ఆ నవ్వున దాగుంది లవ్వని
ఎద జివ్వున లాగింది లవ్వని 

చరణం 2 :

ఆ రోజు కలలోన తొణికే ఓ ప్రేమ... ఈ రోజు ఇలలోన నిజమే చేద్దామా
ఆ రోజు మెరిసింది అందం చిరునామా... ఈ రోజు కలిసింది జతగా ఈ భామ
గుండెలో అల్లరాయే.... ఎండలే చల్లనాయే
ఆశలే వెల్లువాయే....  ఊసులే చల్లిపోయే
ఈ రోజే నాకు తెలిసింది... రాగాలు రేపింది లవ్వని
అనురాగాలు చూపింది నువ్వని... 

ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి... అనుకున్నా ఏదో నవ్వని
ఈ రోజే నాకు తెలిసింది... ఆ నవ్వున దాగుంది లవ్వని
ఎద జివ్వున లాగింది లవ్వని
ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి... అనుకున్నా ఏదో నవ్వని
ఈ రోజే నాకు తెలిసింది... ఆ నవ్వున దాగుంది లవ్వని
ఎద జివ్వున లాగింది లవ్వని

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11540

ఒహొ ఒహొ ఒహొ బుల్లి పావురమా

చిత్రం : బృందావనం (1992)
సంగీతం : మాదవపెద్ది సురేశ్
గీతరచయిత : వెన్నెలకంటి
నేపధ్య గానం : బాలు , జానకి 

పల్లవి :

ఒహొ ఒహొ ఒహొ బుల్లి పావురమా
అయ్యో పాపం అంటే అది నేరమా
అతివలకింత పంతమా ఓ ఓ ఓ ...
అలకలు వారి సొంతమా 

ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా
పదే పదే అదే వెటకారమా
అతివలు అంత సులభమా ఓ ఓ ఓ ...
శృతి ఇక మించనీకుమా

చరణం 1 :

మాటే వినకుంటే బయటే పడుకుంటే
మంచే పడునంట మంచే చెబుతుంట 

అమ్మో మగవారు అన్నిట తగువారు
హద్దే మరిచేరు చాలిక ఆ జోరు 

కోపం తీరాలంట తాపం తగ్గాలంట
తాపం తగ్గాలంటే చొరవే మానాలంట
మాటా మంతీ మర్యాదే అపచారమా

ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా... పదే పదే అదే వెటకారమా
అతివలకింత పంతమా ఓ ఓ ఓ... అలకలు వారి సొంతమా 

చరణం 2 :

నెయ్యం తీయ్యంగ చెయ్యగ రమ్మంట
వియ్యాల పందిట్లొ కయ్యం తగదంట 

గిల్లి కజ్జాలే చెల్లవు పొమ్మంట
అల్లరి చాలిస్తే ఎంతో మేలంట 

వెండి వెన్నెలంతా ఎండగా మరిందంట
కొంటె కుర్రాళ్ళకు అదియే సరియంట
తగని తెగని తగువంతా తన నైజమా

ఒహొ ఒహొ ఒహొ బుల్లి పావురమా.... అయ్యో పాపం అంటే అది నేరమా
అతివలకింత పంతమా ఓ ఓ ఓ....  అలకలు వారి సొంతమా 

ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా... పదే పదే అదే వెటకారమా
అతివలు అంత సులభమా ఓ ఓ ఓ... శృతి ఇక మించనీకుమా
ఒహొ ఒహొ ఒహొ బుల్లి పావురమా.... ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11541

మధురమే సుధా గానం

చిత్రం : బృందావనం (1992)
సంగీతం : మాదవపెద్ది సురేశ్
గీతరచయిత : వెన్నెలకంటి
నేపధ్య గానం : బాలు,  జానకి

పల్లవి :

మధురమే సుధాగానం... మనకిదే మరోప్రాణం
మదిలో మొహన గీతం... మెదిలే తొలి సంగీతం

మధురమే సుధాగానం... మనకిదే మరోప్రాణం
మదిలో మోహన గీతం...  మెదిలే తొలి సంగీతం

చరణం 1 :

చరణాలు ఎన్నివున్నా పల్లవొకటే కదా
కిరణాలు ఎన్ని వున్నా వెలుగొక్కటేకదా
శతకోటి భావాలను పలుకు ఎద మారునా
సరిగమలు మారుతున్నా  మధురిమలు మారునా

మధురమే సుధాగానం... మనకిదే మరోప్రాణం
మదిలో మోహన గీతం...  మెదిలే తొలి సంగీతం

చరణం 2 :

వేవేల తారలున్నా నింగి ఒకటే కదా
ఎన్నెన్ని దారులున్నా గమ్యమొకటే కదా
ఎనలేని రాగలకు నాదమొకటే కదా
అనుభూతులెన్ని వున్నా హృదయమొకటే కదా

మధురమే సుధాగానం... మనకిదే మరోప్రాణం
మదిలో మోహన గీతం... మెదిలే తొలి సంగీతం

మధురమే సుధాగానం... మనకిదే మరోప్రాణం
మదిలో మోహన గీతం...  మెదిలే తొలి సంగీతం

మదిలో మోహన గీతం...  మెదిలే తొలి సంగీతం

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11539