Showing posts with label విజయ్ భాస్కర్. Show all posts
Showing posts with label విజయ్ భాస్కర్. Show all posts

Thursday, August 2, 2012

నీలి మేఘమా జాలి చూపుమా

చిత్రం: అమ్మాయిల శపథం (1975) 

సంగీతం: విజయ్ భాస్కర్ 

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 

నేపథ్య గానం: బాలు, వాణీ జయరాం 



పల్లవి : 



నీలి మేఘమా జాలి చూపుమా ఒక నిముషమాగుమా 

నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్ళుమా 


కన్నె అందమా కలత మానుమా ఒక్క నిముషమాగుమా 

నీ దైవము నీ కోసము యెదుట నిలిచె చూడుమా 



చరణం 1 : 



ఆనుకోని రాగాలు వినిపించెనే 

కనరాని స్వర్గాలు దిగివచ్చెనే 

ఆనుకోని రాగాలు వినిపించెనే 

కనరాని స్వర్గాలు దిగివచ్చెనే 


కలలు పండి నిజముగా కనుల యెదుట నిలిచెగా 

రా.. జాబిలి నా నెచ్చెలి.. జాగేల... ఈ వేళ.. నను చేరగా 



నీలి మేఘమా జాలి చూపుమా.. ఒక నిముషమాగుమా 

నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్ళుమా..ఆ..ఆ 



చరణం 2 : 


కళ్యాణ మేళాలు మ్రోగించనా 

కంఠాన సూత్రాన్ని ముడివేయనా 

కళ్యాణ మేళాలు మ్రోగించనా.. 

కంఠాన సూత్రాన్ని ముడివేయనా.. 



గుండె గుడిగా చేయనా.. నిన్ను కొలువు తీర్చనా 

నీ దాసినై... సావాసినై... నా ప్రేమ పుష్పాల పూజించనా... 


కన్నె అందమా కలత మానుమా ఒక్క నిముషమాగుమా 

నీ దైవము నీ కోసము యెదుట నిలిచె చూడుమా....



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4812