Monday, July 30, 2012

ఈ నల్లని రాలలో

చిత్రం: అమరశిల్పి జక్కన (1964) 
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 
గీతరచయిత : సినారె
నేపధ్య గానం: ఘంటసాల 

పల్లవి: 

ఓహో ఓ ఓ.... 
ఓహోహో.... 
ఓ ఓ.... 

ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో 
ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో ఒ... ఓ .. ఓ .. 

చరణం 1: 

పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి 
పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి 
మునులవోలె కారడవుల మూలలందు పడియున్నవి ..ఈ నల్లని రాలలో 

చరణం 2: 

కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు 
కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు 
ఉలి అలికిడి విన్నంతనే ఉలి అలికిడి విన్నంతనే.... 
ఉలి అలికిడి విన్నంతనె జల జలమని పొంగి పొరలు ..ఈ నల్లని రాలలో.. 

చరణం 3: 

పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును 
పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును 
జీవమున్న మనిషికన్న శిలలే నయమని పించును ..ఈ నల్లని రాలలో..

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1618

No comments:

Post a Comment