Showing posts with label ఎస్. రాజేశ్వరరావు. Show all posts
Showing posts with label ఎస్. రాజేశ్వరరావు. Show all posts
Friday, May 22, 2020
గిలిగింతల తోటలో
చిత్రం : అమెరికా అబ్బాయి (1987)
గిలిగింతల తోటలో పులకింతలు పూయని
ఒక్క క్షణం చూడకుంటే ఊహకెంత తొందర
నిండువలపు బాసలన్నీ నిలిపేదే జీవితం
గిలిగింతల తోటలో పులకింతలు పూయని
చిగురు మేను తాకగానే పెదవికింత దాహమా
చిలిపి చూపు గుండెపైన చేసింది సంతకం
గిలిగింతల తోటలో పులకింతలు పూయని
Friday, June 29, 2018
ఎవరికి తెలియదులే
చిత్రం : దొరికితే దొంగలు (1965)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల
పల్లవి :
ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి
ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి
ఇంతుల సంగతి పూబంతుల సంగతి
ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి
చరణం 1 :
జడలో మల్లె పూల జాతర చేస్తుంటారు
జడలో మల్లె పూల జాతర చేస్తుంటారు
బంగారు పెదవులపై రంగులు పూస్తుంటారు
బంగారు పెదవులపై రంగులు పూస్తుంటారు
ఈ సోకులన్నీ ఇంకెవరి కోసమంటారు
ఈ సోకులన్నీ ఇంకెవరి కోసమంటారు
ఈ సోకులన్నీ ఇంకెవరి కోసమంటారు... హా
ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి
ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి
చరణం 2 :
ముసిముసి నగవులతో... మిసమిస చూపులతో
ముసిముసి నగవులతో... మిసమిస చూపులతో
దాచుకున్న తలపులతో... దోచుకున్న వలపులతో
దాచుకున్న తలపులతో... దోచుకున్న వలపులతో
మొదట కసరి కొడతారు పిదప చల్లబడతారు
మొదట కసరి కొడతారు పిదప చల్లబడతారు
మొదట కసరి కొడతారు పిదప చల్లబడతారు
ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి
ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి
చరణం 3 :
పందిరి లేకుంటే... తీగ పైకి పోతుందా
పందిరి లేకుంటే... తీగ పైకి పోతుందా
గోడలు లేకుంటే గోపురమే ఉంటుందా
గోడలు లేకుంటే గోపురమే ఉంటుందా
పురుషులు లేకుంటే... తరుణుల పని గోవిందా
పురుషులు లేకుంటే... తరుణుల పని గోవిందా
పురుషులు లేకుంటే... తరుణుల పని గోవిందా... గోవిందా... హా..
ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి
ఇంతుల సంగతి పూబంతుల సంగతి
ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=77
Thursday, June 28, 2018
ఎవరన్నారివి కన్నులని
చిత్రం : దొరికితే దొంగలు (1965)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి :
ఎవరన్నారివి కన్నులని
ఎవరన్నారివి కన్నులని
అరెరె మధువొలికే గిన్నెలవి
ఎవరన్నారివి బుగ్గలని
ఎవరన్నారివి బుగ్గలని
హోయ్ ఎర్రని రోజా మొగ్గలవి
ఎవరన్నారివి కన్నులని
చరణం 1 :
నడుమిది ఏమంటున్నది?
ఈ నడుమిది ఏమంటున్నది?
నా పిడికిట ఇమడెదనన్నది
నల్లని జడ ఏమన్నది?
నా నల్లని జడ ఏమన్నది?
అది నను బంధించెద నన్నది
నను బంధించెదనన్నది
ఎవరన్నారివి కన్నులని
అరెరె మధువొలికే గిన్నెలవి
ఎవరన్నారివి బుగ్గలని
హోయ్ ఎర్రని రోజా మొగ్గలవి
చరణం 2 :
సిగ్గులు దోసిట దూయకు
నా సిగ్గులు దోసిటదూయకు
నీ చేతుల బందీ చేయకు
నీ చేతుల బందీ చేయకు
మెల్లగ లోలో నవ్వకు
మెలమెల్లగ లోలో నవ్వకు
చలచల్లగ పిడుగులు రువ్వకు
చల్లగ పిడుగులు రువ్వకు
ఎవరన్నారివి కన్నులని
అరెరె మధువొలికే గిన్నెలవి
ఎవరన్నారివి బుగ్గలని
హోయ్ ఎర్రని రోజా మొగ్గలవి
చరణం 3 :
అడుగున అడుగిడుటెందుకు?
నా అడుగున అడుగిడుటెందుకు?
నువు తడబడి పోతున్నందుకు
మరి మరి చూచెదవెందుకు?
నను మరి మరి చూచెదవెందుకు?
నువు మైకం లో ఉన్నందుకు
మైకంలో ఉన్నందుకు
ఎవరన్నారివి కన్నులని
అరెరె మధువొలికే గిన్నెలవి
ఎవరన్నారివి బుగ్గలని
హోయ్ ఎర్రని రోజా మొగ్గలవి
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=630
Monday, April 2, 2018
హైలో హైలెస్స
చిత్రం : భీష్మ (1962)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : జమునా రాణి
పల్లవి :
ఓ... ఓ... ఓ..ఓ... ఓ... ఓ..
అహా.. హా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
హైలో హైలెస్స... హంస కదా నా పడవ
హైలో హైలెస్స... హంస కదా నా పడవ
ఉయ్యాలలూగినదీ... ఊగీసలాడినదీ...
హైలో హైలెస్స... హంస కదా నా పడవ
ఓ... హొయ్... ఓ... హొయ్
చరణం 1 :
ఓ... ఓ... ఓ...
ఓ... ఓ... ఓ...
నదిలో నా రూపు... ఓ... ఓ... ఓ...
నదిలో నా రూపు నవనవలాడినది...
మెరిసే అందములూ మిలమిలలాడినవి...
నదిలో నా రూపు నవనవలాడినది...
మెరిసే అందములూ మిలమిలలాడినవి...
వయసు వయ్యారము పాడినవి పదేపదే
వయసు వయ్యారము పాడినవి పదేపదే
హైలో.. హైలో హైలెస్స... హంస కదా నా పడవ
ఉయ్యాలలూగినదీ... ఊగీసలాడినదీ...
హైలో హైలెస్స... హంస కదా నా పడవ
ఓ... హొయ్... ఓ... హొయ్
చరణం 2 :
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ...
ఎవరో మా రాజూ..ఓ..ఓ..
ఎవరో మా రాజూ... ఎదుటా నిలిచాడు
ఎవరో మా రాజూ... ఎదుటా నిలిచాడు
ఏవో చూపులతో సరసకు చేరాడు...
ఏవో చూపులతో సరసకు చేరాడు...
మనసే చెలించునే మాయదారి మగాళ్ళకి...
మనసే చెలించునే మాయదారి మగాళ్ళకి...
హైలో.. హైలో హైలెస్స... హంస కదా నా పడవ
ఉయ్యాలలూగినదీ... ఊగీసలాడినదీ...
హైలో హైలెస్స... హంస కదా నా పడవ
ఓ... హొయ్... ఓ... హొయ్
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=147
Friday, March 23, 2018
కాశీకి పోయాను
చిత్రం : అప్పు చేసి పప్పు కూడు (1959)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం : ఘంటసాల, స్వర్ణలత
పల్లవి :
కాశీకి పోయాను రామా హరి
గంగ తీర్థమ్ము తెచ్చాను రామా హరి
గంగ తీర్థాము తెచ్చాను రామా హరి
కాశీకి పోలేదు రామా హరి
ఊరి కాల్వలో నీళ్ళండి రామా హరి
మురుగు కాల్వలో నీళ్ళండి రామా హరి
చరణం 1 :
ఈమె మాటలు పట్టించుకోకండి
ఈ పిల్ల మా మేనకోడలు
నన్ను సంసారలంపటంలో దింపటానికొచ్చింది
శ్రీశైలమెళ్లాను రామా హరి
శివుని వీభూది తెచ్చాను రామా హరి
శివుని వీభూది తెచ్చాను రామా హరి
శ్రీశైలం పోలేదు రామా హరి
శివుని వీభూది తేలేదు రామా హరి
ఇది కాష్టంలో బూడిదా రామా హరి
చరణం 2 :
అన్నమక్కరలేదు రామా హరి
నేను గాలి భోంచేస్తాను రామా హరి
ఉత్త గాలి భోంచేస్తాను రామా హరి
గాలితో పాటుగా రామా హరి
వీరు గారెలే తింటారు రామా హరి
నేతి గారెలే తింటారు రామా హరి
చరణం 3 :
కైలాసమెళ్ళాను రామా హరి
శివుని కళ్ళారా చూశాను రామా హరి
రెండు కళ్ళారా చూశాను రామా హరి
కైలాసమెళితేను రామా హరి
నంది తన్ని పంపించాడు రామా హరి
బాగ తన్ని పంపించాడు రామా హరి
చరణం 4 :
ఆలుబిడ్డలు లేరు రామా హరి
నేను ఆత్మయోగీనండి రామా హరి
గొప్ప ఆత్మయోగీనండి రామా హరి
ఆ మాట నిజమండి రామా హరి
నేను అందుకే వచ్చాను రామా హరి
నేను అందుకే వచ్చాను రామా హరి
రామ రామ శరణం
చిత్రం : అప్పు చేసి పప్పు కూడు (1959)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం : పి. లీల
పల్లవి :
రామ రామ శరణం... భద్రాద్రిరామ శరణం
రామ రామ శరణం...
తాటకిని వధించి మునిరాజు కృపను గాంచి
తాటకిని వధించి మునిరాజు కృపను గాంచి
శిలకు ప్రాణమిచ్చి సన్నుతులు గాంచినట్టి
రామ రామ శరణం... భద్రాద్రిరామ శరణం
రామ రామ శరణం...
చరణం 1 :
శివుని విల్లు ద్రుంచి... శ్రీ జానకిని గ్రహించి
శివుని విల్లు ద్రుంచి... శ్రీ జానకిని గ్రహించి
జనకు మాటనెంచి వనవాసమేగినట్టి
రామ రామ శరణం... భద్రాద్రిరామ శరణం
రామ రామ శరణం...
చరణం 2 :
రావణుని వధించి ఘనకీర్తి జగతినించి
రావణుని వధించి ఘనకీర్తి జగతినించి
పాపముల హరించి భువినెల్ల గాచునట్టి
రామ రామ శరణం... భద్రాద్రిరామ శరణం
రామ రామ శరణం...
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=29
Thursday, March 22, 2018
చేయి చేయి కలుపరావె
చిత్రం : అప్పు చేసి పప్పు కూడు (1959)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం : ఏ. ఏం. రాజా, పి. లీల
పల్లవి :
చేయి చేయి కలుపరావె హాయిహాయిగ
నదురు బెదురు మనకింక లేదులేదుగ
చేయి చేయి కలుపరావె హాయిహాయిగ
నదురు బెదురు మనకింక లేదులేదుగ
అహా... చేయి చేయి
పెద్దవారి అనుమతింక లేదు లేదుగ
చేయి చేయి కలుపుటెల హాయి హాయిగ
పెద్దవారి అనుమతింక లేదు లేదుగ
చేయి చేయి కలుపుటెల హాయి హాయిగ
ఉహూ... చేయి చేయి
చరణం 2 :
మగని మాటకెదురాడుట తగదు తగదుగ
నాతి చెంత విరహము నే తాళలేనుగ
మగని మాటకెదురాడుట తగదు తగదుగ
నాతి చెంత విరహము నే తాళలేనుగ
అహా... చేయి చేయి
చరణం 2 :
వీలుకాని విరహమింక వలదు వలదుగ
దాసి మీద వలపు మీకు తగదు తగదుగ
వీలుకాని విరహమింక వలదు వలదుగ
దాసి మీద వలపు మీకు తగదు తగదుగ
అహా... చేయి చేయి కలుపరావె హాయిహాయిగ
నదురు బెదురు మనకింక లేదులేదుగ
అహా... చేయి చేయి
ఓ పంచవన్నెల చిలకా
చిత్రం : అప్పు చేసి పప్పు కూడు (1959)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం : ఘంటసాల, స్వర్ణలత
పల్లవి :
ఓ మరదలా... నాలో పొంగి పొరలే ప్రేమ వరదలా
నీరూ పాలూ కలిసి ఒకటైనటులే... నీవూ నేనూ ఒకటే గదా
ఓ పంచవన్నెల చిలకా...ఆ ?... ఆ
ఓ పంచవన్నెల చిలకా... నీకెందుకింత అలక?
ఓ పంచవన్నెల చిలకా... నీకెందుకింత అలక?
మాటాడవేమే... మాటాడవేమే... నీ నోటి ముత్యాలొలక
పంచవన్నెల చిలకా...
ఓ పంచవన్నెల చిలకా... నీకెందుకింత అలక?
ఓ పంచవన్నెల చిలకా... నీకెందుకింత అలక?
ఓహో బావా... మార్చుకో నీ వంకరటింకర దోవ
ఊరికే నీవూ నేనూ ఒకటేననుకుంటే... ఒప్పుతుందా యీ లోకం?
ఓ కొంటె బావగారూ... హాయ్!
ఓ కొంటె బావగారూ... మనకెందుకింక పోరు?
ఓ కొంటె బావగారూ... మనకెందుకింక పోరు?
మా నాన్నగారు చూస్తే...
మా నాన్నగారు చూస్తే... మీ దుమ్ము దులుపుతారు!
ఓ కొంటె బావగారూ...
ఓ కొంటె బావగారూ... మనకెందుకింక పోరు?
చరణం 1 :
సీమటపాకాయలాగ చిటాపటాలాడేవు
సీమటపాకాయలాగ చిటాపటాలాడేవు
ప్రేముందా లేదా... ఓ మరదలా నా మీద?
పంచవన్నెల చిలకా...
ఓ పంచవన్నెల చిలకా... నీకెందుకింత అలక?
చరణం 2 :
మరదలినైతే మాత్రం మరీ అంత చనువా?
మరదలినైతే మాత్రం మరీ అంత చనువా?
మరియాద కాదు మీ బావ మరిది చొరవ
ఓ కొంటె బావగారూ...
ఓ కొంటె బావగారూ... మనకెందుకింక పోరు?
మా నాన్నగారు చూస్తే...
మా నాన్నగారు చూస్తే... మీ దుమ్ము దులుపుతారు
ఓ కొంటె బావగారూ... ఓ పంచవన్నెల చిలకా
ఓ కొంటె బావగారూ... ఓ పంచవన్నెల చిలకా
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6149
మూగవైన ఏమిలే
చిత్రం : అప్పు చేసి పప్పు కూడు (1959)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం : ఏ. ఏం. రాజా
పల్లవి :
మూగవైన ఏమిలే... నగుమోమే చాలులే
సైగలింక చాలింపుము జాణతనము తెలిసెనులే
మూగవైన ఏమిలే...
చరణం 1 :
ఆపలేని అనురాగం చూపులలో తొణికెనులే
ఆపలేని అనురాగం చూపులలో తొణికెనులే
దొంగ మనసు దాగదులే....
దొంగ మనసు దాగదులే.. సంగతెల్ల తెలిపెనులే
మూగవైన ఏమిలే...
చరణం 2 :
పలుకకున్న ఏమాయెను వలపు బాసలింతేలే
పలుకకున్న ఏమాయెను వలపు బాసలింతేలే
నను దయతో ఏలుకొనుమూ...
నను దయతో ఏలుకొమ్ము... కనుసన్నల మెలిగెదలే
మూగవైన ఏమిలే...
చరణం 3 :
అందాలే బంధాలై నను బంధీ చేసెనులే
అందాలే బంధాలై నను బంధీ చేసెనులే
కలవరమిక ఎందుకులే...
కలవరమిక ఎందుకులే... వలదన్నా వదలనులే
మూగవైన ఏమిలే నగుమోమే చాలులే
సైగలింక చాలింపుము... జాణతనము తెలిసెనులే
మూగవైన ఏమిలే...
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=22
సుందరాంగులను చూసిన వేళల
చిత్రం : అప్పు చేసి పప్పు కూడు (1959)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం : ఘంటసాల, పి. లీల, ఏ. ఏం. రాజా
పల్లవి :
సుందరాంగులను చూచిన వేళల... కొందరు ముచ్చటపడనేలా?
కొందరు పిచ్చనుపడనేలా?
సుందరాంగులను చూచిన వేళల... కొందరు ముచ్చటపడనేలా?
కొందరు పిచ్చనుపడనేలా?
అందము ప్రాయము ఐశ్వర్యముగల సుందరి దొరకుటే అరుదు కదా
అందము ప్రాయము ఐశ్వర్యముగల సుందరి దొరకుటే అరుదు కదా
ముందుగా ఎవరిని వరించునోయని తొందరలో మతి పోవుకదా
సుందరాంగులను చూచిన వేళల... కొందరు పిచ్చనుపడనేలా?
కొందరు ముచ్చటపడనేలా?
హృదయమునందలి ప్రేమగీతమే మధురముగా వినిపించు గదా
హృదయమునందలి ప్రేమగీతమే మధురముగా వినిపించు గదా
మందహాసమున మనసును దెలిపే ఇందువదన కనువిందు కదా
చరణం 1 :
ప్రేమపరీక్షలు జరిగే వేళల... కొందరు పరవశ పడనేల?
కొందరు కలవరపడనేల?
యువతి చెంత పరపురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా
యువతి చెంత పరపురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా
ప్రేమపందెమును గెలిచేవరకు నామది కలవరపడునుకదా
ప్రేమపరీక్షలు జరిగే వేళల... కొందరు కలవరపడనేల?
కొందరు పరవశ పడనేల?
కోయిలపలుకుల కోమలిగాంచిన.. తియ్యని తలపులు కలుగుగదా
కోయిలపలుకుల కోమలిగాంచిన.. తియ్యని తలపులు కలుగుగదా
వరములొసంగే ప్రేమదేవి గన పరవశమే మది కలుగుకదా
సుందరాంగులను చూసిన వేళల...
కొందరు ముచ్చటపడనేలా?....
కొందరు పిచ్చనుపడనేలా?
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=509
ఎచటి నుండి వీచెనో
చిత్రం : అప్పు చేసి పప్పు కూడు (1959)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం : ఘంటసాల, పి. లీల
పల్లవి :
ఎచటి నుండి వీచెనో... ఈ చల్లని గాలి
ఎచటి నుండి వీచెనో... ఈ చల్లని గాలి
తీవెలపై ఊగుతూ... పూవులపై తూగుతూ
తీవెలపై ఊగుతూ... పూవులపై తూగుతూ
ప్రకృతినెల్ల హాయిగా.... ఆ.... ప్రకృతినెల్ల హాయిగా
తీయగా.. మాయగా.. పరవశింప జేయుచూ
ఎచటి నుండి వీచెనో... ఈ చల్లని గాలి
చరణం 1 :
జాబిలితో ఆడుతూ... వెన్నెలతో పాడుతూ
జాబిలితో ఆడుతూ... వెన్నెలతో పాడుతూ
మనసు మీద హాయిగా.... ఆ.... మనసు మీద హాయిగా
తీయగా... మాయగా... మత్తు మందు జల్లుతూ
ఎచటి నుండి వీచెనో... ఈ చల్లని గాలి
చరణం 2 :
హృదయ వీణ మీటుతూ... ప్రేమ గీతి పాడుతూ
హృదయ వీణ మీటుతూ... ప్రేమ గీతి పాడుతూ
ప్రకృతినెల్ల హాయిగా.... ఆ.... ప్రకృతినెల్ల హాయిగా
తీయగా... మాయగా... పరవశింప జేయుచూ
ఎచటి నుండి వీచెనో... ఈ చల్లని గాలి...
ఈ చల్లని గాలి...
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=521
కాలం కాని కాలంలో
చిత్రం : అప్పు చేసి పప్పు కూడు (1959)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం : సుశీల, పి. లీల
పల్లవి :
చిగురుల పూవుల సింగారముతో... తీవెలు సొంపులు గనలే..దు
ముసి ముసి నవ్వుల గిలిగింతలతో... వసంత ఋతువా... రానేలే..దు
కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో ...
తరుణం కాని తరుణంలో... నా మది ఈ గుబులెందుకనో..
కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో ...
వలపులు మీటగ తీయని పాటలు... హృదయవీణపై పలికెనుగా
ప్రియతము గాంచిన ఆనందములో... మనసే వసంత ఋతువాయెనుగా..
కాలం కాని కాలంలో కోయిల కూతలందుకనే
తరుణం కాని తరుణంలో... నీ మది ఈ గుబులందుకనే..
చరణం 1 :
తళుకు బెళుకుల తారామణులతో... శారద రాత్రులు రాలేదు
ఆకాశంలో పకపకలాడుచూ రాకాచంద్రుడా... రానేలేదు
కాలం కాని కాలంలో... చల్లని వెన్నెల ఎందుకనో...
తరుణం కాని తరుణంలో... నా మది ఈ గుబులెందుకనో..
కాలం కాని కాలంలో... చల్లని వెన్నెల ఎందుకనో...
తలచిన తలపులు ఫలించగలవని... బులపాటము బలమాయెనుగా..
పగటి కలలుగను కన్యామణులకే... ప్రియుడే...రాకాచంద్రుడుగా...
కాలం కాని కాలంలో... చల్లని వెన్నెల అందుకనే...
తరుణం కాని తరుణంలో... నీ మది ఈ గుబులందుకనే ..
కాలం కాని కాలంలో..చల్లని వెన్నెల అందుకనే
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=23
Friday, January 5, 2018
శివ దీక్షా పరురాలనురా
చిత్రం : పూజాఫలం (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : ఘనం శీనయ్య
నేపధ్య గానం : జానకి
పల్లవి :
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
శివ దీక్షా పరురాలనురా
నే శివ దీక్షా పరురాలనురా
శీలమింతైనా విడువ జాలనురా
నే... శీలమింతైనా విడువ జాలనురా
నే... శీలమింతైనా విడువ జాలనురా
నే... శివ దీక్షా పరురాలనురా
చరణం 1 :
శివ శివ గురునాజ్ఞ మీరనురా
శివ శివ గురునాజ్ఞ మీరనురా
శ్రీ వైష్ణవుడంటే చేరనురా
నే.. ...
శ్రీ వైష్ణవుడంటే చేరనురా
నే... శివ దీక్షా పరురాలనురా
చరణం 2 :
వడిగా వచ్చి మఠము చొరవకురా
వడిగా వచ్చి మఠము చొరవకురా
శివార్చన వేళా.. ఆ.. తలుపు తెరవకురా
శివార్చన వేళా... నా మడుగు తావి చెరగు తీయకురా
మడుగు తావి చెరగు తీయకురా
మాటి మాటికీ నోరు మూయకురా
ఆ.. ఆ.. ఆ.. మాటి మాటికీ నోరు మూయకురా
తధీంతకిట... తకతకిటధీం..తోమ్
తా.. తోం తోం ధా.. తోంతోం తత్ ధత్
ధికతోం.. ధీం తకితతికధా...
ధణక్ థ... తియ్యం.. తత్ తత్ థా.. ధణం..
శివ దీక్షా పరురాలనురా
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1630
Monday, December 18, 2017
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
చిత్రం : కులగోత్రాలు (1962)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : కొసరాజు
నేపధ్య గానం : పిఠాపురం, మాధవపెద్ది సత్యం
పల్లవి :
అయ్యయ్యో ... చేతిలో డబ్బులు పోయెనే
అయయ్యో ... జేబులు ఖాళీ ఆయెనే
అయ్యయ్యో... చేతిలో డబ్బులు పోయెనే
అయయ్యో ... జేబులు ఖాళీ ఆయెనే
ఉన్నది కాస్తా ఊడింది... సర్వ మంగళం పాడింది
ఉన్నది కాస్తా ఊడింది... సర్వ మంగళం పాడింది
పెళ్లాం మెళ్లో నగలతో సహా... తిరుక్షవరమై పోయింది
అయ్యయ్యో... చేతిలో డబ్బులు పోయెనే
అయయ్యో... జేబులు ఖాళీ ఆయెనే
చరణం 1 :
ఆ మహా మహా నలమహారాజుకే... తప్పలేదు భాయీ
ఓటమి తప్పలేదు భాయీ
మరి నువు చెప్పలేదు భాయీ... అది నా తప్పుగాదు భాయీ
తెలివి తక్కువగ... చీట్ల పేకలో దెబ్బ తింటివోయీ
బాబూ నిబ్బరించవోయీ
అయ్యయ్యో... చేతిలో డబ్బులు పోయెనే
అయయ్యో... జేబులు ఖాళీ ఆయెనే
చరణం 2 :
నిలువు దోపిడీ దేవుడికిచ్చిన ఫలితం దక్కేది
ఎంతో పుణ్యం దక్కేది... గోవిందా గోవిందా
నిలువు దోపిడీ దేవుడికిచ్చిన ఫలితం దక్కేది
ఎంతో పుణ్యం దక్కేది... చక్కెర పొంగలి చిక్కేది
ఎలక్షన్లలో ఖర్చుపెడితే... ఎం.ఎల్.ఏ దక్కేది
మనకు అంతటి లక్కేదీ
అయ్యయ్యో... చేతిలో డబ్బులు పోయెనే
అయయ్యో... జేబులు ఖాళీ ఆయెనే
చరణం 3 :
గెలుపూ ఓటమి దైవాధీనం...
చెయ్యి తిరగవచ్చు... మళ్ళీ ఆడి గెల్వవచ్చు
ఇంకా పెట్టుబడెవడిచ్చు... ఇల్లు కుదవ చేర్చవచ్చు
ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో... మన కరువు తీరవచ్చు
పోతే... అనుభవమ్ము వచ్చు
చివరకు జోలె కట్టవచ్చు
అయ్యయ్యో... చేతిలో డబ్బులు పోయెనే
అయయ్యో... జేబులు ఖాళీ ఆయెనే
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6100
Thursday, December 7, 2017
నిజం చెప్పవే పిల్లా
చిత్రం : డాక్టర్ చక్రవర్తి (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : సుశీల, వసంత
పల్లవి :
నిజం చెప్పవే పిల్లా ఎలాగుంది... ఈ వేళ
నీకెలాగుంది... ఈ వేళ
నిజం చెప్పవే పిల్లా ఎలాగుంది... ఈ వేళ
నీకెలాగుంది... ఈ వేళ
ఏది చూసినా... ఏమి చేసినా ఏదోగా ఉంది
ఏమి చెప్పనే పిల్లా... భలేగుంది ఈ వేళ
అహ... భలేగుంది ఈ వేళ...
చరణం 1 :
చిలిపి వయసు కవ్వించే... మనసు చిలికి మురిపించే
ఆ.. ఆ.. ఆ.. ఓ.. ఓ.. ఓ..
చిలిపి వయసు కవ్వించే... మనసు చిలికి మురిపించే
నీలి కన్నుల వాలులో... సరదాలు పొంగే జోరులో
నీలి కన్నుల వాలులో... సరదాలు పొంగే జోరులో...
సంబరాలతో సరాగాలతో సాగిపోదమా.. ఆ.. ఆ...
నిజం చెప్పవే పిల్లా ఎలాగుంది... ఈ వేళ
నీకెలాగుంది... ఈ వేళ..
నాలో వెలిగే దీపం... నీ చిరునవ్వు చిందే రూపం
నాలో వెలిగే దీపం... నీ చిరునవ్వు చిందే రూపం
నీ కాంతిలో... ఈ శాంతిలో... ఈ లోకమే స్వర్గము
నాలో వెలిగే దీపం...
చరణం 2 :
ఆ.. ఆ.. ఆ.. ఓ.. ఓ.. ఓ.. ఆ.. ఆ.. ఆ.. ఓ.. ఓ.. ఓ..
నిన్న లేని పులకింత కన్నెపిల్లకో వింత
ఆ.. ఆ.. ఆ.. ఓ.. ఓ.. ఓ..
నిన్న లేని పులకింత కన్నెపిల్లకో వింత
పాలబుగ్గలు మీటితే... తొలి ప్రేమ మొగ్గలు వేసెనే
పాలబుగ్గలు మీటితే... తొలి ప్రేమ మొగ్గలు వేసెనే
ఏల సిగ్గులే ఏమి నిగ్గులే... మాకు తెలుసులేవే...
నిజం చెప్పవే పిల్లా ఎలాగుంది... ఈ వేళ
నీకెలాగుంది... ఈ వేళ..
రాగం భావం నీవే... నా అనురాగ గీతం నీవే
రాగం భావం నీవే... నా అనురాగ గీతం నీవే
నీ ప్రేమలో నే లీనమై... జీవించుటే స్వర్గము
రాగం భావం నీవే...
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1115
ఎవరో జ్వాలను రగిలించారు
చిత్రం : డాక్టర్ చక్రవర్తి (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : ఘంటసాల
పల్లవి :
ఎవరో జ్వాలను రగిలించారు... వేరెవరో దానికి బలియైనారు
వేరెవరో దానికి బలియైనారు...
ఎవరో జ్వాలను రగిలించారు... వేరెవరో దానికి బలియైనారు
చరణం 1 :
అడుగు అడుగున అపజయముతో... ఓ..ఓ..
అలసిసొలసిన నా హృదయానికి
సుధవై... సుధవై జీవనసుధవై ఉపశాంతివ్వగా ఓర్వనివారు
ఎవరో జ్వాలను రగిలించారు... వేరెవరో దానికి బలియైనారు
చరణం 2 :
అనురాగానికి ప్రతిరూపాలై... ఆదిదంపతులవలె మీరుంటే
అనురాగానికి ప్రతిరూపాలై ఆదిదంపతులవలె మీరుంటే
ఆనందంతో మురిసానే... ఆత్మీయులుగా తలచానే
అందుకు ఫలితం... అపనిందేనా
ఎవరో జ్వాలను రగిలించారు... వేరెవరో దానికి బలియైనారు
చరణం 3 :
మనిషికి మనిషికి మమత కూడదా…
మనసు తెలుసుకొను మనసే లేదా
ఇది తీరని శాపం... ఇది మారని లోకం
మానవుడే దానవుడై... మసలే చీకటి నరకం
ఎవరో జ్వాలను రగిలించారు... వేరెవరో దానికి బలియైనారు
వేరెవరో దానికి బలియైనారు...
ఎవరో జ్వాలను రగిలించారు...
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1067
Monday, December 4, 2017
ఒహో మేఘమాలా
చిత్రం : భలే రాముడు (1956)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : సదాశివబ్రహ్మం
నేపధ్య గానం : పి. లీల
పల్లవి :
ఒహో మేఘమాలా... ఆ... ఆ... ఆ... ఆ.... నీలాల మేఘమాల
చల్లగ రావేలా మెల్లగ రావేలా
చల్లగ రావేలా మెల్లగ రావేలా
మెల మెల్లగ రావేలా
వినీల దుడుకుతనమేలా
వినీల దుడుకుతనమేలా... ఆ... ఆ
ఊరుకోవే మేఘమాలా
ఊరుకోవే మేఘమాలా ఉరుముతావేలా మెరవగానేలా
చల్లగ రావేలా ... మెల్లగ రావేలా
చరణం 1 :
ఒహో ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
గూటిలోన రామచిలుక నిదురపోతోంది
గూటిలోన రామచిలుక నిదురపోతోంది
చిలుక బెదిరిపోతుంది
ఊరుకోవే మేఘమాలా
ఊరుకోవే మేఘమాలా ఉరుముతావేలా మెరవగానేలా
చల్లగ రావేలా ... మెల్లగ రావేలా
చరణం 2 :
ఒహో ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
తీయతీయని కలలు కంటూ మురిసిపోతుంది
తీయతీయని కలలు కంటూ మురిసిపోతుంది
మైమరచిపోతుంది
ఊరుకోవే మేఘమాలా
ఊరుకోవే మేఘమాలా... ఉరుముతావేల మెరవగానేలా
చల్లగ రావేలా ..మెల్లగ రావేలా
చల్లగ రావేలా ..మెల్లగ రావేలా
ఒహో ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఒహో ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1138
Saturday, October 28, 2017
అప్పుడెప్పుడెప్పుడెప్పుడో చూశాను
చిత్రం : రాధాకృష్ణ (1978)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :
నేపథ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
ఏప్పుడో....
అప్పుడెప్పుడెప్పుడెప్పుడో చూశాను... నిన్నేనా జాంపండు
నువ్వేనా నా జాంపండు... నువ్వేనా ఆ జాంపండు
ఇప్పుడే....
ఇప్పుడిప్పుడిప్పుడిప్పుడే చూస్తున్న... నువ్వేనా మొద్దబ్బాయి
నువ్వేనా ఆ మొద్దబ్బాయి... నువ్వేనా నా మొద్దబ్బాయి
చరణం 1 :
కొలను నేనుంటే కలువపూలు కోస్తుంటే
చేరుకోబోయినప్పుడు నువ్వు జారినప్పుడు... ఆ జారినప్పుడు...
నిన్ను ఎలా ఎత్తుకొన్నానో గుర్తుందా... గుర్తుందా..
అరటిపండు పట్టుకొని ఆలయంలో నువ్వుంటే..
గండుకోతి పండును కాజేసినప్పుడు... కాజేసినప్పుడు
నువ్వెలా అదిరిపోయావో గుర్తుందా... గుర్తుందా..
అన్నీ గుర్తేకాని అమ్మడూ.. ఆ...
చిట్టి అమ్మడూ... ఉహు...
ఈ వంపులేడ దాచావో అప్పుడు..హా..హా....
ఇప్పుడిప్పుడిప్పుడిప్పుడే చూస్తున్న నువ్వే నా మొద్దబ్బాయి... హా
నువ్వేనా ఆ మొద్దబ్బాయీ... నువ్వేనా ఆ జాంపండు
చరణం 2 :
బడికి నువ్వు రానంటే మెడపట్టి ఈడ్చుకొస్తే
పంతులయ్య బరితపూజ చేసినప్పుడు... ఆ చేసినప్పుడు...
నువ్వెలా తుర్రుమన్నావో గుర్తుందా... గుర్తుందా..
నువ్వు తినే జాంపండు నేను కాస్త లాక్కోని
ఉరిస్తు ఊరిస్తు తినేటప్పుడు... ఆ తినేటప్పుడూ..
నువ్వెలా మొహం పెట్టవో గుర్తుందా... ఆ... గుర్తుందా..
అన్నీ గుర్తే కాని కృష్ణుడు..చిన్ని కృష్ణుడు..
ఆ చిలిపితనం పోలేదే ఇప్పుడు...హా...
అప్పుడెప్పుడెప్పుడెప్పుడో చూశాను నిన్నేనా జాంపండు
నువ్వేనా నా జాంపండు... నువ్వే నా ఆ మొద్దబ్బాయి
ఆ..నువ్వే నా నా జాంపండు... నువ్వే నా నా మొద్దబ్బాయి
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2537
Saturday, July 1, 2017
ఎవరికి తెలియదులే
చిత్రం : దొరికితే దొంగలు (1965)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
అహహా.. ఓహోహో.. అహహహా.. ఓ..ఓ..ఓ..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఎవరికి తెలియదులే... యువకుల సంగతి
ఎవరికి తెలియదులే... యువకుల సంగతి
యువకుల సంగతి... మీ తలబిరుసుల సంగతి
ఎవరికి తెలియదులే... యువకుల సంగతి
చరణం 1 :
ఆడపిల్ల కనబడితే ఏడిపించబోతారు
ఆడపిల్ల కనబడితే ఏడిపించబోతారు
ఏడిపించి మేను మరచి ఎగిరి నవ్వుకుంటరు
నవ్వి నవ్వి చివరకు నవ్వులపాలౌతారు
ఎవరికి తెలియదులే... యువకుల సంగతి
ఎవరికి తెలియదులే... యువకుల సంగతి
చరణం 2 :
లేనిపోని డాబులతో.. లెక్కలేని కోతలతో...
లేనిపోని డాబులతో.. లెక్కలేని కోతలతో...
గడుసుగడుసు మాటలతో.. మిడిసిపాటు చేతలతో...
కాలరెత్తి తిరుగుతారు... కాళ్ళబేరమాడతారు
హ...ఎవరికి తెలియదులే... యువకుల సంగతి
ఎవరికి తెలియదులే... యువకుల సంగతి
చరణం 3 :
ముందు తీగలేకుంటే... పందిరితో పని ఉందా?
ముందు తీగలేకుంటే... పందిరితో పని ఉందా?
పునాదులే లేకుంటే... భువిని గోడ ఉంటుందా?
ఆ.. పునాదులే లేకుంటే... భువిని గోడ ఉంటుందా?
తరుణులసలు లేకుంటే... పురుషుల పని గోవిందా...
తరుణులసలు లేకుంటే... పురుషుల పని గోవిందా...
గోవిందా... గోవిందా... హహ
ఎవరికి తెలియదులే... యువకుల సంగతి
యువకుల సంగతి... మీ తలబిరుసుల సంగతి
ఎవరికి తెలియదులే... యువకుల సంగతి
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=92
Wednesday, June 28, 2017
జగమే మారినది
చిత్రం : దేశద్రోహులు (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి :
ఆ...ఆ...ఆ... ఆ...ఆ...ఆ...
జగమే మారినది మధురముగా ఈ వేళ
జగమే మారినది మధురముగా ఈ వేళ
కలలూ కోరికలూ తీరినవి మనసారా
జగమే మారినది మధురముగా ఈ వేళ
చరణం 1 :
మనసాడెనే మయూరమై పావురములు పాడే
ఎల పావురములు పాడే
మనసాడెనే మయూరమై పావురములు పాడే
ఎల పావురములు పాడే
ఇదె చేరెను గోరువంక రామచిలుక చెంత
అవి అందాల జంట
ఇదె చేరెను గోరువంక రామచిలుక చెంత
అవి అందాల జంట
నెనరూ కూరిమి ఈనాడే పండెను
నెనరూ కూరిమి ఈనాడే పండెను
జీవితమంతా చిత్రమైన పులకింతా
జగమే మారినది మధురముగా ఈ వేళ
కలలూ కోరికలూ తీరినవి మనసారా
జగమే మారినది మధురముగా ఈ వేళ
చరణం 2 :
విరజాజులా సువాసన స్వాగతములు పలుక
సుస్వాగతములు పలుక
తిరిగాడును తేనెటీగ తీయ్యదనము కోరి
అనురాగాలా తేలి
ఎదలో ఇంతటి సంతోషమెందుకో
ఎదలో ఇంతటి సంతోషమెందుకో
ఎవ్వరికోసమో ఎందుకింత పరవశమో
జగమే మారినది మధురముగా ఈ వేళ
కలలూ కోరికలూ తీరినవి మనసారా
జగమే మారినది మధురముగా ఈ వేళ
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=567
Subscribe to:
Posts (Atom)