Thursday, August 2, 2012

ఆనంద తాండవ మాడే

చిత్రం: అమెరికా అమ్మాయి (1976)
సంగీతం: జి.కె. వెంకటేశ్
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: సుశీల


పల్లవి:

ఆ..ఆ..ఆ..
ఆనంద తాండవమాడే
ఆనంద తాండవమాడే.. శివుడు
అనంతలయుడు.. చిదంబర నిలయుడు
ఆనంద తాండవమాడే...

నగరాజసుత చిరునగవులు చిలుకంగ
నగరాజసుత చిరునగవులు చిలుకంగ
సిగలోన వగలొలికి ఎగిరి ఎగిరి దూకంగ సురగంగ ..

ఆనంద తాండవ మాడే.. శివుడు
అనంతలయుడు.. చిదంబర నిలయుడు
ఆనంద తాండవమాడే..

చరణం 1:

ప్రణవనాదం ప్రాణం కాగా.. ప్రకృతిమూలం తానం కాగా
భువనములే రంగ భూమికలు కాగా
భుజంగ భూషణుడు.. అనంగ భీషణుడు
పరమ విభుడు.. గరళధరుడు
భావ రాగ తాళ మయుడు సదయుడు...

చరణం 2:

ఏమి శాంభవ లీల? ఏమా తాండవహేల?
ఏమి శాంభవ లీల? ఏమా తాండవహేల?
అణువణువులోన దివ్యానంద రసడోల
సుర గరుడులు.. ఖేచరులు.. విద్యాధరులు..ఊ..ఊ..
సుర గరుడులు.. ఖేచరులు.. విద్యాధరులు
నిటల తట ఘటిత..నిజకరకములై
నిలువగా.. పురహరాయని పిలువగా ..కొలువగా..

ఆనంద తాండవమాడే...

చరణం 3:

ధిమి ధిమి ధిమి ధిమ డమరుధ్వానము
దిక్తటముల మార్మోయగా...

కిణకిణ కిణ కిణ మణి నూపురముల ఝణత్కారములు మ్రోయగా..

విరించి తాళము వేయగా.. హరి మురజము మ్రోయింపగా
ప్రమధులాడగా... అప్సరలు పాడగా .. ఆడగా .. పాడగా...

ఆనంద తాండవమాడే ..


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4719

No comments:

Post a Comment