Friday, August 3, 2012

అదే నీవు అదే నేను


చిత్రం : అభినందన (1988)

సంగీతం : ఇళయరాజా

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం : బాలు



పల్లవి :



ఆ హా హా హా....ఆ ఆ ఆ....ఆ....



అదే నీవు అదే నేను .. అదే గీతం పాడనా

అదే నీవు అదే నేను .. అదే గీతం పాడనా

కథైనా... కలైనా... కనులలో చూడనా

అదే నీవు అదే నేను .. అదే గీతం పాడనా

అదే నీవు అదే నేను .. అదే గీతం పాడనా... 



చరణం 1 :



కొండా కోన గుండెల్లో ఎండా వానలైనాము

కొండా కోన గుండెల్లో ఎండా వానలైనాము

గువ్వా గువ్వ కౌగిల్లో గూడుచేసుకున్నాము

అదే స్నేహము అదే మోహమూ

అదే స్నేహము అదే మోహమూ.. ఆది అంతం ఏదీ లేని గానము




అదే నీవు అదే నేను .. అదే గీతం పాడనా

కథైనా... కలైనా... కనులలో చూడనా



చరణం 2 :



నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావూ...

నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు

కన్నీరైన ప్రేమల్లో పన్నీరవుదామన్నావు

అదే బాసగా... అదే ఆశ గా...

అదే బాసగా... అదే ఆశ గా... ఎన్ని నాళ్ళీ  నిన్న పాటే పాడను




అదే నీవు అదే నేను .. అదే గీతం పాడనా

అదే నీవు అదే నేను .. అదే గీతం పాడనా

కథైనా... కలైనా... కనులలో చూడనా

అదే నీవు అదే నేను .. అదే గీతం పాడనా



No comments:

Post a Comment