Friday, August 3, 2012

ఎదుటా నీవే యదలోనా నీవే

చిత్రం: అభినందన (1988)

సంగీతం: ఇళయరాజా

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం: బాలు


పల్లవి :


ఎదుటా నీవే యదలోనా నీవే

ఎదుటా నీవే యదలోనా నీవే

ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే

ఎదుటా నీవే యదలోనా నీవే




చరణం 1 :


మరుపే తెలియని నా హృదయం

తెలిసి వలచుట తొలి నేరం...  అందుకే ఈ గాయం

మరుపే తెలియని నా హృదయం

తెలిసి వలచుట తొలి నేరం...  అందుకే ఈ గాయం



గాయాన్నైనా మాననీవు హృదయాన్నైనా వీడిపోవు

కాలం నాకు సాయం రాదు... మరణం నన్ను చేరనీదు

పిచ్చి వాడ్ని కానీదు 


ఆహహా ఓహోహో ఊఁహుఁహుఁ ఊఁహూఁహూ...


ఎదుటా నీవే యదలోనా నీవే

ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే

ఎదుటా నీవే యదలోనా నీవే


చరణం 2 :




కలలకు భయపడి పోయాను

నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను

కలలకు భయపడి పోయాను

నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను


స్వప్నాలైతే క్షణికాలేగా సత్యాలన్నీ నరకాలేగా

స్వప్నం సత్యమైతే వింత సత్యం స్వప్నమయ్యేదుందా

ప్రేమకింత బలముందా 
ఆహహా ఓహోహో ఊఁహుఁహుఁ ఊఁహూఁహూ...




ఎదుటా నీవే యదలోనా నీవే

ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే

ఎదుటా నీవే యదలోనా నీవే 



No comments:

Post a Comment